IND vs NZ 4th T20I: వైజాగ్‌లో మరోసారి కివీస్‌కు బడితపూజే.. ఈసారి 5 ఓవర్లలోనే మ్యాచ్ ఫినిష్..?

IND vs NZ 4th T20 Pitch Report: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య నాల్గవ టీ20 మ్యాచ్ విశాఖపట్నంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ కూడా హై-స్కోరింగ్ అవుతుందా లేదా తక్కువ స్కోరింగ్ అవుతుందా? మ్యాచ్‌కు ముందు వైజాగ్ పిచ్ రిపోర్ట్ ఓసారి చూద్దాం పదండి..

IND vs NZ 4th T20I: వైజాగ్‌లో మరోసారి కివీస్‌కు బడితపూజే.. ఈసారి 5 ఓవర్లలోనే మ్యాచ్ ఫినిష్..?
Ind Vs Nz

Updated on: Jan 27, 2026 | 9:14 PM

IND vs NZ 4th T20 Pitch Report: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో నాల్గవ మ్యాచ్ 2026 జనవరి 28 బుధవారం సాయంత్రం 7 గంటలకు విశాఖపట్నంలోని ACA-VDCA క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. సిరీస్ పూర్తిగా భారత జట్టు నియంత్రణలో ఉంది. ఇప్పటికే మొదటి మూడు మ్యాచ్‌లను గెలుచుకోవడం ద్వారా సిరీస్‌ను గెలుచుకున్న సూర్యసేన.. మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిచి.. సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలిన చూస్తోంది. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు 2026 టీ20 ప్రపంచ కప్‌నకు ముందు మరింత జోష్ ను అందుకోవాలని కోరుకుంటోంది. మరోవైపు, న్యూజిలాండ్ చాలా ఒత్తిడిలో ఉంది. ODI సిరీస్‌ను గెలుచుకున్న తర్వాత, కివీస్ జట్టు T20లలో తీవ్రంగా ఇబ్బంది పడుతోంది.

ACA-VDCA స్టేడియం పిచ్ రిపోర్ట్..

వైఎస్ రాజశేఖర రెడ్డి ACA-VDCA క్రికెట్ స్టేడియంలోని పిచ్ బ్యాట్స్‌మెన్స్ కు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ మైదానంలో భారీగా పరుగులు వస్తాయని తెలుస్తోంది. పిచ్ ఉపరితలం మంచి పేస్, బౌన్స్‌ను అందిస్తుంది. దీనివల్ల పరుగులు చేయడం చాలా సులభం అవుతుంది. అయితే, భారీ బౌండరీలు సవాలుగా ఉన్నప్పటికీ, ఇది సాధారణంగా అధిక స్కోరింగ్ గ్రౌండ్ గా పేరుగాంచింది. ఈ వేదికలో సగటు మొదటి ఇన్నింగ్స్ స్కోరు 148. అత్యధిక స్కోరు 215, అత్యల్ప స్కోరు 82గా నమోదంది.

టాస్ కీలకం..

ఈ స్టేడియంలో ఛేజింగ్ జట్టుకు అదనపు ప్రయోజనం లభిస్తుంది. ఎందుకంటే రెండవ ఇన్నింగ్స్‌లో పడే మంచు ఛేజింగ్ జట్టుకు సహాయం చేస్తుంది. ఈ వేదికలో ఇప్పటివరకు మొత్తం 4 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు జరిగాయి. 3 సార్లు ఛేజింగ్ జట్లు గెలిచాయి. ఇటువంటి సందర్భంలో టాస్ ఇక్కడ కీలక పాత్రను పోషిస్తుంది.

టీం ఇండియా స్క్వాడ్..

అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా మరియు అర్ష్‌దీప్ సింగ్.

న్యూజిలాండ్ జట్టు..

డెవాన్ కాన్వే, టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్), రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), కైల్ జామిసన్, మాట్ హెన్రీ, ఇష్ సోధి, జాకబ్ డఫీ, జేమ్స్ నీషమ్, మైఖేల్ బ్రేస్‌వెల్, క్రిస్టియన్ క్లార్క్, టిమ్ రాబిన్సన్, బెవాన్ జాకబ్స్, జాకరీ ఫౌల్క్స్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..