T20 World Cup 2026: సూపర్ 8లో టీమిండియా ప్రత్యర్థులు వీళ్లే.. లీగ్ మ్యాచ్‌లకు ముందే తేల్చేశారుగా..?

India T20 World Cup 2026 Super 8 Matches: టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభానికి మరికొద్ది రోజులే ఉంది. ఫిబ్రవరి 7 నుంచి ఈ మెగా టోర్నీ మొదలుకానుంది. గ్రూప్ దశలో 4 జట్లతో తలపడనున్న భారత జట్టు.. అగ్రస్థానంలో కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాతే అసలైన మజా మొదలు కానుంది. అయితే, సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం మేరకు టీమిండియా సూపర్ 8 ప్రత్యర్థులు కూడా తేల్చేశారు. అవేంటో ఓసారి చూద్దాం..

T20 World Cup 2026: సూపర్ 8లో టీమిండియా ప్రత్యర్థులు వీళ్లే.. లీగ్ మ్యాచ్‌లకు ముందే తేల్చేశారుగా..?
Team India

Updated on: Jan 28, 2026 | 8:40 AM

T20 World Cup 2026 Super 8: టీ20 ప్రపంచకప్ 2026 ఫార్మాట్ ప్రకారం, గ్రూప్ దశ నుంచి అర్హత సాధించిన టాప్ జట్లు సూపర్ 8లో తలపడతాయి. భారత జట్టు సెమీఫైనల్ చేరాలంటే ఈ దశలో మూడు కీలక మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. అయితే, సోషల్ మీడియాలో ప్రస్తుతం మాజీల అభిప్రాయం మేరుకు భారత జట్టు సూపర్ 8లో ఎదుర్కోబోయే ప్రత్యర్థి టీంలు ఏంటో చెప్పేశారు. అవేంటో ఓసారి చూద్దాం..

సూపర్ 8 చేరాలంటే ముందుగా భారత జట్టు లీగ్ మ్యాచ్ ల్లో గెలవాల్సి ఉంటుంది. మొత్తంగా టీమిండియా లీగ్ దశలో అమెరికా, నమీబియా, పాకిస్తాన్, నెదర్లాండ్స్ జట్లతో తలపడాల్సి ఉంది. ఒకవేళ పాక్ జట్టు భారత జట్టుతో మ్యాచ్ ను బహిష్కరిస్తే టీమిండియా అగ్రస్థానంలో నిలవనుంది. పాక్ జట్టులో మ్యాచ్ జరిగితే గెలిచిన జట్టు అగ్రస్థానంలో నిలిచే అవకాశం ఉంది.

1. భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా (అహ్మదాబాద్): సూపర్ 8లో భారత్‌కు ఎదురయ్యే తొలి అతిపెద్ద సవాలు దక్షిణాఫ్రికా కానుందని అంటున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ప్రోటీస్ పేస్ దళాన్ని భారత బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరం.

2. భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా (చెన్నై): క్రికెట్ ప్రపంచంలో అతిపెద్ద రైవల్రీలో ఒకటైన భారత్-ఆస్ట్రేలియా పోరుకు చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదిక కానుంది. స్పిన్‌కు అనుకూలించే ఈ పిచ్‌పై భారత స్పిన్నర్లు ఆసీస్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టే అవకాశం ఉంది.

3. భారత్ వర్సెస్ వెస్టిండీస్ / స్కాట్లాండ్ (కోల్‌కతా): కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో భారత్ తన మూడో సూపర్ 8 మ్యాచ్ ఆడనుంది. గ్రూప్ సి నుంచి వెస్టిండీస్ లేదా అనూహ్యంగా దూసుకొచ్చిన స్కాట్లాండ్‌తో భారత్ తలపడవచ్చు. బంగ్లాదేశ్ బహిష్కరణ నిర్ణయం తర్వాత స్కాట్లాండ్ జట్టులో చేరడం ఈ గ్రూపును మరింత ఆసక్తికరంగా మార్చింది.

స్కాట్లాండ్ ఎంట్రీ – కొత్త సమీకరణాలు: ఐసీసీ నిర్ణయం ప్రకారం బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ అధికారికంగా గ్రూప్ సి లో చేరింది. స్కాట్లాండ్ జట్టు ఇటీవల అద్భుతమైన ఫామ్‌లో ఉంది. వెస్టిండీస్ వంటి జట్లకు షాక్ ఇచ్చి సూపర్ 8కు చేరితే, భారత్‌తో పోరు ఈడెన్ గార్డెన్స్‌లో రసవత్తరంగా సాగనుంది.

కెప్టెన్ సూర్య వ్యూహాలు: సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు సూపర్ 8 కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఉపఖండపు పిచ్‌లపై భారత్‌కు ఉన్న పట్టు, సూపర్ 8లో హోమ్ అడ్వాంటేజ్‌గా మారనుంది. హార్డిక్ పాండ్యా ఆల్ రౌండ్ ప్రదర్శన, బుమ్రా బౌలింగ్ పదును భారత్‌కు ప్రధాన బలం.

సూపర్ 8 దశ అనేది సెమీస్ చేరడానికి అగ్ని పరీక్ష లాంటిది. ఇక్కడ ఒక్క మ్యాచ్ ఓడినా సెమీఫైనల్ అవకాశాలు ప్రమాదంలో పడతాయి. మరి అహ్మదాబాద్, చెన్నై పిచ్‌లపై భారత్ జైత్రయాత్ర కొనసాగిస్తుందో లేదో వేచి చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..