Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులోకి సిరాజ్! కారణమేంటంటే?

గత రెండేళ్లలో టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో మహ్మద్ సిరాజ్ ఒకరు. ముఖ్యంగా మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా గైర్హాజరీలో టీమిండియా బౌలింగ్ విభాగానికి నాయకత్వం వహించాడు హైదరాబాదీ స్టార్ బౌలర్. ఈక్రమంలోనే గత రెండేళ్లలో 42 ఇన్నింగ్స్‌ల్లో మొత్తం 71 వికెట్లు పడగొట్టాడు సిరాజ్.

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులోకి సిరాజ్!  కారణమేంటంటే?
Mohammed Siraj

Updated on: Jan 28, 2025 | 10:48 AM

ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసిన భారత జట్టులో హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ కు చోటు దక్కలేదు. అంతే కాకుండా ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్‌ నుంచి కూడా అతడిని తప్పించారు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందే మహ్మద్ సిరాజ్ కు టీమిండియాలోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఛాంపియన్స్ ట్రోఫీలో జస్ప్రీత్ బుమ్రా ఆడడం అనుమానాస్పదంగానే ఉంది. వెన్నునొప్పి చికిత్స కోసం అతను న్యూజిలాండ్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. దీనిని పరిశీలించిన తర్వాత, బుమ్రాకు ఎక్కువ విశ్రాంతి ఇవ్వాలా వద్దా అనేది నిర్ణయం తీసుకోనున్నారు. బుమ్రాకు మరింత విశ్రాంతి అవసరమని న్యూజిలాండ్ మెడికల్ రిపోర్ట్ సూచిస్తే ఛాంపియన్స్ ట్రోఫీ జట్టు నుంచి అతడు తప్పుకోవడం ఖాయం. అతనికి బదులు మహ్మద్ సిరాజ్ జట్టులోకి ఎంపికయ్యే అవకాశం ఉందని కూడా సమాచారం. బ్యాకప్ ప్లేయర్‌ని సిద్ధం చేయాలని ఇప్పటికే ఆదేశాలు అందాయని, బుమ్రా 100% ఫిట్‌గా లేకుంటే, ఛాంపియన్స్ ట్రోఫీకి మహ్మద్ సిరాజ్‌ను పంపాలని సెలక్షన్ కమిటీ ఆలోచిస్తున్నట్లు సమాచారం.

ఫిబ్రవరి 19 నాటికి జస్ప్రీత్ బుమ్రా పూర్తి ఫిట్‌నెస్ సాధించలేడని తేలితే, ఛాంపియన్స్ ట్రోఫీ జట్టు నుంచి అతనిని తొలగించే అవకాశాలున్నాయి. అతని స్థానంలో అనుభవం దృష్ట్యా మహ్మద్ సిరాజ్ జట్టుకు ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనిపై మరికొన్ని రోజుల్లో ఫుల్ క్లారిటీ రానుంది. కాగా టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

ఇవి కూడా చదవండి

ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా.

 

ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్..

టీమిండియా మ్యాచ్ ల వివరాలు..