
ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభ మ్యాచ్‌లో పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు కరాచీలో తలపడగా, పాకిస్తాన్ అభిమానుల ఆశలు భగ్నమయ్యాయి. 321 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సిన ఆతిథ్య జట్టు, బౌలర్ల ధాటికి కుదేలైంది. ముఖ్యంగా, వారి ఆశలన్నీ మాజీ కెప్టెన్ బాబర్ అజామ్‌పై ఉండగా, అతను 64 పరుగుల వద్ద అవుట్ కావడంతో స్టేడియంలోని ప్రేక్షకులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
పాకిస్తాన్ ఇన్నింగ్స్‌లో బాబర్ ఆడుతూ 31వ ఓవర్లో తన 35వ ODI అర్ధ సెంచరీని పూర్తిచేసాడు. అయితే, 34వ ఓవర్ చివరి బంతికి మిచెల్ సాంట్నర్ బౌలింగ్‌లో అతను భారీ షాట్ కొట్టేందుకు ప్రయత్నించాడు, కానీ సరిగ్గా టైమింగ్ చేయలేకపోయి న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ వికెట్ పడగానే స్టేడియంలోని కెమెరాలు ప్రేక్షకుల వైపు తిరగగా, నిరాశతో స్టేడియం వదిలి వెళ్తున్న అభిమానుల దృశ్యాలు కనిపించాయి.
న్యూజిలాండ్ బౌలర్లు మొదటి నుంచే పాకిస్తాన్ జట్టుపై ఒత్తిడి పెంచారు. ఓపెనర్ సౌద్ షకీల్ కేవలం 6 పరుగులకే అవుటవ్వగా, విల్ ఓ’రూర్క్ అతని వికెట్ తీశాడు. అనంతరం, గ్లెన్ ఫిలిప్స్ అద్భుతమైన క్యాచ్ అందుకొని మొహమ్మద్ రిజ్వాన్‌ను కేవలం 3 పరుగులకే పెవిలియన్ పంపించాడు. ఫఖర్ జమాన్ గాయపడిన కారణంగా నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. అయితే, 41 బంతుల్లో 24 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు.
సల్మాన్ అఘా కివీస్ బౌలింగ్‌ను ఎదుర్కొంటూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. కానీ, 42 పరుగుల వద్ద నాథన్ స్మిత్ బౌలింగ్‌లో మైఖేల్ బ్రేస్‌వెల్ క్యాచ్ అందుకొని అతని ఇన్నింగ్స్‌ను ముగించాడు. తయ్యబ్ తాహిర్ కేవలం 1 పరుగు చేసి మిచెల్ సాంట్నర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.
న్యూజిలాండ్ బ్యాటింగ్‌లో టామ్ లాథమ్ (118), విల్ యంగ్ (107) అద్భుతమైన సెంచరీలు నమోదు చేయగా, గ్లెన్ ఫిలిప్స్ 61 పరుగులతో మెరిశాడు. దీంతో కివీస్ జట్టు 320 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.
అయితే, భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్తాన్ టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమై, అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ముఖ్యంగా, బాబర్ అజామ్ అవుట్ అయిన వెంటనే స్టేడియం నుంచి బయటకు వెళ్లిపోతున్న అభిమానుల దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. భారీ లక్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్తాన్ 60 పరుగుల తేడాతో న్యూజిలాండ్ పై ఓటమిని చవి చూసింది.
The crowd started leaving the stadium after the wicket of Babar Azam. 🥺💔#BabarAzam𓃵 #PAKvNZ #ChampionsTrophy pic.twitter.com/5TUosZRT5t
— Sadia Rajpoot 🌙 (@SADIY56) February 19, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..