
మరో మూడు రోజుల్లో చాంపియన్స్ ట్రోఫీ 2025 పాకిస్థాన్‌లో ప్రారంభంకానుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో టీమిండియా ఆడే మ్యాచ్‌లకు అదనపు టికెట్లు విడుదల చేయడం అభిమానులకు శుభవార్త అయ్యింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఈ టికెట్లను ఫిబ్రవరి 16 మధ్యాహ్నం 1.30 గంటల నుంచి ఆన్‌లైన్‌లో అమ్మకానికి ఉంచింది. క్రికెట్ అభిమానులు తమ టికెట్లను ఇప్పటికిప్పుడు బుక్ చేసుకోవచ్చు.
టీమిండియా గ్రూప్ దశలో మూడు కీలకమైన మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మ్యాచ్‌లకు సంబంధించి కొన్ని అదనపు టికెట్లు రిలీజ్ చేయడంతో పాటు, మొదటి సెమీఫైనల్‌కు కూడా పరిమిత టికెట్లు అందుబాటులో ఉంచినట్లు ICC ప్రకటించింది. ఈ టికెట్లను పొందడానికి అభిమానులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత షెడ్యూల్ ఈ విధంగా ఉంది. ఫిబ్రవరి 20 – భారత్ vs బంగ్లాదేశ్, ఫిబ్రవరి 23 – భారత్ vs పాకిస్థాన్, మార్చి 2 – భారత్ vs న్యూజిలాండ్, మార్చి 4 – తొలి సెమీఫైనల్
ఐసీసీ ప్రకటన ప్రకారం, మార్చి 9న జరగనున్న ఫైనల్ మ్యాచ్ టికెట్లను సెమీఫైనల్ ముగిసిన తర్వాత మాత్రమే రిలీజ్ చేస్తారు. ఒక వేళ భారత్ ఫైనల్ చేరితే, మ్యాచ్ దుబాయ్ వేదికగా జరుగుతుంది. భారత్ అర్హత సాధించని పక్షాన మ్యాచ్ లాహోర్ వేదికగా ఉంటుంది. అందుకే ఫైనల్ మ్యాచ్ వేదిక ఖరారు కావాలంటే, మొదటి సెమీఫైనల్ ఫలితం కీలకం కానుంది.
ఈ సారి చాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ Aలో భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లు ఉన్నాయి. టోర్నమెంట్ ఫిబ్రవరి 19న పాకిస్థాన్-న్యూజిలాండ్ మధ్య ఓపెనింగ్ మ్యాచ్‌తో ప్రారంభమవుతుంది.
టీమిండియా మ్యాచ్‌లను ప్రత్యక్షంగా స్టేడియంలో చూసే అవకాశం కోల్పోయిన అభిమానులకు ఇప్పుడు మరో అవకాశాన్ని ICC కల్పించింది. టికెట్లు త్వరగా బుక్ చేసుకోవాలనుకుంటే, ఐసీసీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న టికెట్ లింక్‌ను చెక్ చేసుకోవచ్చు.
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (WK), రిషబ్ పంత్ (WK), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహమ్మద్. షమీ, అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి.
రోహిత్ శర్మ (సి), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (WK), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ
Additional tickets for #ChampionsTrophy matches in the UAE – including India’s group stage fixtures – will go on sale today 👀
Details ⬇https://t.co/w0ADfGZvJI
— ICC (@ICC) February 16, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..