AFG vs ENG: ఓడితే ఇంటికే.. డూ ఆర్ డై మ్యాచ్‌ లో టాస్ గెలిచిన అఫ్గాన్.. ఇరు జట్ల ప్లేయింగ్-XI ఎలా ఉందంటే?

ప్రతిష్ఠాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో మరో కీలక మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. మరికాసేపట్లో ఇంగ్లాండ్, అఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య కీలక మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో ఓడిన జట్లు మెగా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. కాబట్టి ఇరు జట్లకు డూ ఆర్ డై మ్యాచ్

AFG vs ENG: ఓడితే ఇంటికే.. డూ ఆర్ డై మ్యాచ్‌ లో టాస్ గెలిచిన అఫ్గాన్.. ఇరు జట్ల ప్లేయింగ్-XI ఎలా ఉందంటే?
Afghanistan Vs England

Updated on: Feb 26, 2025 | 2:36 PM

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్, అఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య ఎనిమిదవ మ్యాచ్ లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన అఫ్టాన్ జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా ఇరు జట్లు తమ మొదటి మ్యాచ్ లో ఓడిపోయాయి.  ఇంగ్లాండ్‌ను ఆస్ట్రేలియా ఓడించగా, ఆఫ్ఘనిస్తాన్‌ను దక్షిణాఫ్రికా ఓడించింది. కాబట్టి ఈ మ్యాచ్ లో రెండు జట్లకు గెలుపు చాలా కీలకం. స్టార్ ప్లేయర్లతో ఇంగ్లండ్ బలంగా ఉండగా.. సంచలనం సృష్టించేందుకు అఫ్గాన్ ప్లేయర్లు రెడీ గా ఉన్నారు. ఈ మ్యాచ్ లో ఓడిపోతే టోర్నీ నుంచి తట్టా బుట్టా సర్దుకోక తప్పదు. కాబట్టి ఇరు జట్లకు ఇది డై ఆర్ డై మ్యాచ్.  ఈ  మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఆ జట్టులో ఎటువంటి మార్పు లేదు. అయితే ఇంగ్లాండ్ జట్టు లో గాయపడిన బ్రైడాన్ కార్స్ స్థానంలో జేమీ ఓవర్టన్‌ను నియమించింది. ఇంగ్లాండ్, అఫ్ఘనిస్తాన్ జట్లు వన్డేల్లో తలపడటం ఇది నాలుగోసారి. రెండు మ్యాచుల్లో ఇంగ్లండ్ విజయం సాధించగా, ఒక మ్యాచ్ లో అఫ్గన్ గెలుపొందింది.

 

ఇవి కూడా చదవండి

ఈ టోర్నమెంట్‌లో ఇంగ్లాండ్,  ఆఫ్ఘనిస్తాన్ జట్లకు ఇది ​​రెండవ మ్యాచ్. ఈ టోర్నమెంట్‌ను రెండు జట్లు పరాజయాలతో ప్రారంభించాయి. కాబట్టి, ఈ టోర్నమెంట్‌లో ముందుక వెళ్లాలంటే ఈ మ్యాచ్ లో గెలవడం ఇరు జట్లకు తప్పనిసరి.

ఇంగ్లండ్ జట్టులో మార్పులు.

అఫ్గానిస్తాన్ ప్లేయింగ్ XI:

రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, సెదికుల్లా అటల్, రహ్మత్ షా, హస్మతుల్లా షాహిది (కెప్టెన్), అజ్మతుల్లా, ఒమర్జాయ్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నయీబ్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఫజల్హాక్ ఫరూఖీ

ఇంగ్లాండ్ ప్లేయింగ్ XI:

బెన్ డకెట్, ఫిల్ సాల్ట్, జేమీ స్మిత్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, జేమీ ఓవర్టన్

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..