CSK: జోష్‌ మీదున్న చెన్నైకి ఊహించని షాక్‌.. జట్టుకు కీలక ప్లేయర్‌ దూరం.

|

Apr 09, 2023 | 5:44 PM

ఐపీఎల్‌ 2023లో చెన్నై సూపర్ కింగ్స్‌ దూకుడు మీదుంది. మొత్తం 3 మూడు మ్యాచుల్లో రెండింటిలో విజయం సాధించి జోస్‌ మీదుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న చెన్నైకి దీపక్‌ చాహర్‌ రూపంలో భారీ షాక్‌ తగిలింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండర్‌ దీపక్‌ చాహర్‌కు గాయమైన...

CSK: జోష్‌ మీదున్న చెన్నైకి ఊహించని షాక్‌.. జట్టుకు కీలక ప్లేయర్‌ దూరం.
Csk
Follow us on

ఐపీఎల్‌ 2023లో చెన్నై సూపర్ కింగ్స్‌ దూకుడు మీదుంది. మొత్తం 3 మూడు మ్యాచుల్లో రెండింటిలో విజయం సాధించి జోస్‌ మీదుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న చెన్నైకి దీపక్‌ చాహర్‌ రూపంలో భారీ షాక్‌ తగిలింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండర్‌ దీపక్‌ చాహర్‌కు గాయమైన విషయం తెలిసిందే. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో గాయం (లెఫ్ట్‌ హ్యామ్‌స్ట్రింగ్‌) తిరగబెట్టడడంతో కేవలం ఒక్క ఓవర్‌ మాత్రమే వేయగలిగాడు చాహర్‌. దీంతో చాహర్‌ చెన్నై ఆడనున్న 4 నుంచి 5 మ్యాచ్‌లకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది.

ఇది చెన్నై జట్టుకు ఇబ్బందిగా మారనుంది. అంతేకాకుండా ఇప్పటికే సీఎస్‌కే జట్టుకు చెందిన పలువురు ఆటగాళ్లు గాయాల కారణంగా మ్యాచ్‌కు దూరమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చాహర్‌ కూడా మ్యాచ్‌కు దూరమవుతుండడం ఆందోళన కలిగించే అంశంగా చెప్పొచ్చు. ఇదిలా ఉంటే చాహర్‌ గత సీజన్లోనూ ఇలాగే మధ్యలోనే వైదొలిగి, సీజన్‌ మొత్తానికే దూరమైన విషయం తెలిసిందే. మరి చాహర్‌ కొలుకొని మళ్లీ జట్టులోకి వస్తారా.. లేదా చూడాలి.

ఇదిలా ఉంటే చాహర్‌కు గాయం కావడంపై చెన్నై సారథి ధోని మాట్లాడుతూ.. ‘ముంబైపై మ్యాచ్ గెలిచినందుకు సంతోషంగా ఉంది. కానీ మేం తొలి ఓవర్లోనే మా ప్రధాన పేసర్ దీపక్ చాహర్ సేవల్ని కోల్పోయా’మని చెప్పుకొచ్చాడు. చాహర్‌కు మళ్లీ తొడ కండరాలు పట్టేసినట్లున్నాయని, ఇది చెన్నైకి ఇబ్బందికర పరిస్థితేనని సురేష్‌ రైనా సైతం స్పందించారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..