CCL 2023: తుది సమరానికి చేరిన సెలబ్రిటీ క్రికెట్ లీగ్.. సెమీఫైనల్, ఫైనల్ ఎప్పుడు, ఎక్కడంటే?

|

Mar 18, 2023 | 10:55 AM

సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (CCL) 2023- లీగ్ దశల్లో 4 అగ్రశ్రేణి జట్లు సెమీ-ఫైనల్ దశలోకి ప్రవేశించాయి. భారతదేశంలోని ప్రాంతీయ చలనచిత్ర పరిశ్రమల నుంచి నటీనటులను ఒకచోట చేర్చిన స్పోర్టైన్‌మెంట్ లీగ్‌గా పేరుగాంచిన సంగతి తెలిసిందే.

CCL 2023: తుది సమరానికి చేరిన సెలబ్రిటీ క్రికెట్ లీగ్.. సెమీఫైనల్, ఫైనల్ ఎప్పుడు, ఎక్కడంటే?
Ccl 2023
Follow us on

సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (CCL) 2023- లీగ్ దశల్లో 4 అగ్రశ్రేణి జట్లు సెమీ-ఫైనల్ దశలోకి ప్రవేశించాయి. భారతదేశంలోని ప్రాంతీయ చలనచిత్ర పరిశ్రమల నుంచి నటీనటులను ఒకచోట చేర్చిన స్పోర్టైన్‌మెంట్ లీగ్‌గా పేరుగాంచిన సంగతి తెలిసిందే. ఈ వారాంతంలో లీగ్ సెమీ-ఫైనల్ దశలోకి ప్రవేశించింది. ఆ తర్వాత గ్రాండ్ ఫినాలే మ్యాచ్‌తో ఈ ఏడాది సీసీఎల్ విజయవంతంగా ముగియనుంది.

కర్ణాటక బుల్డోజర్స్, భోజ్‌పురి దబాంగ్స్ 2023 CCL ఎడిషన్‌లో ఆధిపత్యం ప్రదర్శించాయి. ఈ జట్లు ఇప్పటివరకు ఆడిన 16 మ్యాచ్‌లలో ఒక్క పరాజయాన్ని కూడా ఎదుర్కోలేదు. అయితే, ముంబై హీరోస్, తెలుగు వారియర్స్ కూడా బలమైన పోటీదారులుగానే నిలిచాయి. పాయింట్ల పట్టికలో మూడు, నాలుగు స్థానాలను కలిగి ఉన్నాయి.

తొలి సెమీఫైనల్ మ్యాచ్ మార్చి 24న వైజాగ్‌లో భోజ్‌పురి దబాంగ్స్, ముంబై హీరోస్ మధ్య జరగనుండగా, రెండో సెమీఫైనల్ కర్ణాటక బుల్డోజర్స్, తెలుగు వారియర్స్ మధ్య జరుగుతుంది. గ్రాండ్ ఫినాలే మ్యాచ్ మార్చి 25న వైజాగ్‌లో జరగనుంది.

ఇవి కూడా చదవండి

CCL 2023 సెమీ-ఫైనల్ మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్..

శుక్రవారం, మార్చి 24: భోజ్‌పురి దబాంగ్స్ vs ముంబై హీరోస్ – సెమీఫైనల్ 1 – 2:30 PM IST, వైజాగ్

శుక్రవారం, మార్చి 24: కర్ణాటక బుల్డోజర్స్ vs తెలుగు వారియర్స్– సెమీఫైనల్ 2 – 7:00 PM IST, వైజాగ్

• ఫైనల్: మార్చి 25 శనివారం: సాయంత్రం 7 నుంచి 11 గంటల వరకు, వైజాగ్

CCL 2023 సెమీ-ఫైనల్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూడటం ఎలా?

సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ప్రసార హక్కులను జీ ఎంటర్‌టైన్‌మెంట్ కొనుగోలు చేసింది. 9 వేర్వేరు భాషల్లో CCL 2023 సెమీ-ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాన్ని చూడొచ్చు. అలాగే Zee5 యాప్ 2023లో సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ప్రత్యక్ష ప్రసారాన్ని అందిస్తుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..