Vijay Hazare Trophy: వారెవ్వా.. పృథ్వీ షా మెరుపు ఇన్నింగ్స్..21 ఫోర్లు, 7 సిక్సులు.. సెమీఫైనల్స్​‌కు దూసుకెళ్లిన ముంబై

|

Mar 09, 2021 | 9:01 PM

విజయ్​ హజారే ట్రోఫీలో మరోసారి పృథ్వీషా మరోసారి దుమ్మురేపాడు.  అద్భుత ప్రదర్శనతో జట్టను సెమీఫైనల్స్​‌కు చేర్చాడు. మంగళవారం సౌరాష్ట్రతో జరిగిన క్వార్టర్స్​ మ్యాచ్‌లో కెప్టెన్​ పృథ్వీషా...

Vijay Hazare Trophy: వారెవ్వా.. పృథ్వీ షా మెరుపు ఇన్నింగ్స్..21 ఫోర్లు, 7 సిక్సులు.. సెమీఫైనల్స్​‌కు దూసుకెళ్లిన ముంబై
దుమ్మురేపిన ముంబై కెప్టెన్ పృథ్వీ షా
Follow us on

విజయ్​ హజారే ట్రోఫీలో మరోసారి పృథ్వీషా మరోసారి దుమ్మురేపాడు.  అద్భుత ప్రదర్శనతో జట్టను సెమీఫైనల్స్​‌కు చేర్చాడు. మంగళవారం సౌరాష్ట్రతో జరిగిన క్వార్టర్స్​ మ్యాచ్‌లో కెప్టెన్​ పృథ్వీషా ఏకంగా 185 పరుగులే చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ క్రమంలో ముంబై 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి సెమీస్​కు చేరింది.  రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ జట్లపై తక్కువ స్కోరుకే ఔటైన ఈ యువ ఓపెనర్.. కీలక మ్యాచ్‌లో దుమ్మురేపాడు. పుదుచ్చేరితో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 227 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

తాజా మ్యాచ్‌లో  తొలుత బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 284 రన్స్ చేసింది. ఛేజింగ్‌లో ముంబై జట్టు ఓపెనర్లు నిలకడగా బ్యాటింగ్​ చేసి మొదటి వికెట్​కు 238 పరుగుల పార్టనర్షిప్​ నెలకొల్పారు. టీమ్ సారథి​ పృథ్వీషా 185 పరుగులు చేయగా.. అందులో 21 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. యశస్వీ జైశ్వాల్​ 75 పరుగులు చేసి ఉనద్కట్​ బౌలింగ్​లో పెవిలియన్ చేరాాడు.

అయితే ఇంగ్లాండ్​తో పరిమిత ఓవర్ల సిరీస్​కు సెలక్ట్ అయిన నేపథ్యంలో ముంబై కెప్టెన్​ శ్రేయస్​ అయ్యర్​, బ్యాట్స్​మన్​ సూర్యకుమార్​ యూదవ్​ దూరమయ్యారు. ఈ క్రమంలో ముంబై జట్టు బాధ్యతలు భుజానికి ఎత్తుకున్న పృథ్వీషా.. జట్టును సెమీస్​కు చేర్చాడు.

కాగా ఇప్పటికే కర్ణాటక, గుజరాత్​ జట్లు ఇప్పటికే సెమీస్​​ లోకి అడుగుపెట్టాయి. గురువారం ఈ టోర్నీ సెమీఫైనల్​ మ్యాచ్​లు నిర్వహించనుండగా.. ఆదివారం ఫైనల్​ జరగనుంది. మార్చి 11న విజయ్ హజారే ట్రోఫీ సెమీఫైనల్లో ముంబైతో కర్ణాటక తలపడనుంది. కర్ణాటక యువ ఓపెనర్ దేవదత్త్ పడిక్కల్ సైతం సూపర్ ఫామ్‌తో దూసుకుపోతున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో వరుసగా రెండు హాఫ్ సెంచరీలు, నాలుగు సెంచరీలు చేసిన పడిక్కల్ 673 పరుగులతో టోర్నీలో టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. గత ఏడాది విజయ్ హజారే ట్రోఫీలో పడిక్కల్ 609 పరుగులు చేశాడు.

 

Also Read:

స్మృతి మంధనా ఊచకోత, గోస్వామి మెరుపు బౌలింగ్.. 9 వికెట్ల తేడాతో ఓడిపోయిన దక్షిణాఫ్రికా

ఇంట్లో కోలాహాలం.. మరికాసేపట్లో పెళ్లి.. వరుడు పరార్! రీజన్ తెలిస్తే షాకవుతారు…