RCB: ఆర్సీబీకి పట్టిన దరిద్రం అతడేనన్నారు.. కట్ చేస్తే.. 5 భారీ సిక్సర్లతో వీర కుమ్ముడు.. ఎవరంటే.?

|

Sep 08, 2024 | 10:36 AM

ఈ ప్లేయర్ ఆర్సీబీకి పట్టిన దరిద్రం అని ఫ్యాన్స్ అన్నారు. కోట్లు పెట్టి కొన్నా.. ఎలాంటి ప్రభావం చూపించలేకపోయాడని తిట్టిపోశారు. కట్ చేస్తే.. ఎప్పుడైతే ఆర్సీబీ ఈ ప్లేయర్‌ను రిలీజ్ చేస్తుందని వార్తలు వచ్చాయో.. దెబ్బకు బ్యాట్‌తో కుమ్మేశాడు.. ఇంతకీ ఎవరని అనుకుంటున్నారా.?

RCB: ఆర్సీబీకి పట్టిన దరిద్రం అతడేనన్నారు.. కట్ చేస్తే.. 5 భారీ సిక్సర్లతో వీర కుమ్ముడు.. ఎవరంటే.?
Rcb
Follow us on

స్కాట్‌లాండ్‌తో జరిగిన 3 టీ20ల సిరీస్‌ను ఆస్ట్రేలియా క్లీన్ స్వీప్ చేసింది. ఎడిన్‌బుర్గ్ వేదికగా ఆతిధ్య జట్టుతో జరిగిన మూడో టీ20లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంలో ఆసీస్ ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ అటు బంతి(3/35)తో, ఇటు బ్యాట్‌(62 నాటౌట్)తో అదరగొట్టాడు. అలాగే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సైతం కామెరాన్ గ్రీన్ సొంతం చేసుకోవడం విశేషం. ఇదిలా ఉంటే.. గ్రీన్ చేసిన ఈ పెర్ఫార్మన్స్‌ను ఆర్సీబీ నిర్ణయంతో ముడిపెట్టారు ఫ్యాన్స్. ఎప్పుడైతే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ రిలీజ్ చేసే ఆటగాళ్ల లిస్టులో గ్రీన్‌ను చేర్చిందో.. అప్పటినుంచి ఈ రైట్ హ్యాండ్ ఆల్‌రౌండర్ అదరగొడుతున్నాడని ఆర్సీబీ ఫ్యాన్స్ అంటున్నారు.

ఇది చదవండి: మూర్చబోయిన బాలుడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. స్కాన్ చేసి బిత్తరపోయిన వైద్యులు

తొలుత ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ ఎంచుకున్న స్కాట్‌లాండ్ నిర్ణీత 20 ఓవర్లకు 9 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. బ్రాండన్ మెక్‌ముల్లెన్ 56 పరుగులతో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఆసీస్ బౌలర్లలో హార్డీ, అబాట్ చెరో రెండు వికెట్లు.. స్టోయినిస్, జంపా తలో వికెట్.. ఇక గ్రీన్ 3 వికెట్లు పడగొట్టారు. ఇక 150 పరుగుల లక్ష్యచేధనలో భాగంగా బరిలోకి దిగిన ఆసీస్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. మెక్‌గుర్క్ డకౌట్ కాగా.. హెడ్ 12 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కామెరాన్ గ్రీన్(62).. జట్టు కెప్టెన్ మార్ష్(31)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. ఈ క్రమంలోనే తన అర్ధ సెంచరీని సైతం పూర్తి చేశాడు. చివర్లో డేవిడ్(25), హార్డీ(11) వేగంగా పరుగులు రాబట్టడంతో 23 బంతులు మిగిలి ఉండగానే.. ఆస్ట్రేలియా టార్గెట్ చేధించింది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: S అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తుల వ్యక్తిత్వం ఎలాంటిదో తెల్సా? రొమాన్స్‌లో రెచ్చిపోతారట

మరోవైపు ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందుగా ఆర్సీబీ జట్టు కామెరాన్ గ్రీన్‌తో పాటు డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్ లాంటి కీలక విదేశీ ఆటగాళ్లను విడిచిపెట్టనుందని సమాచారం. ఇక ఐపీఎల్ 2024లో ట్రేడ్ ద్వారా ఆర్సీబీలోకి వచ్చిన గ్రీన్ బ్యాట్‌తో పూర్తిగా నిరాశపరిచాడు. ఇక బంతితో 13 మ్యాచ్‌లలో కేవలం 10 వికెట్లు మాత్రమే తీశాడు. ధారాళంగా పరుగులు సమర్పించాడు.

ఇది చదవండి: టీ20లకే మొనగాడురా.! 12 ఫోర్లు, 5 సిక్సర్లతో కావ్యపాప ప్లేయర్ ఊచకోత

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..