కెరీర్‌లో ఆఖరి టెస్ట్ మ్యాచ్.. కట్ చేస్తే.. 30 ఏళ్ల రికార్డు బ్రేక్.. ఆ ప్లేయర్ ఎవరంటే.?

ఒక ప్లేయర్ తన వీడ్కోలు మ్యాచ్‌లో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టడం అరుదైన ఘట్టం. అలాంటి అద్భుతాన్ని 2016వ సంవత్సరంలో న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ బ్రెండన్ మెక్కల్లమ్ చేసి చూపించాడు. క్రికెట్ నుండి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించిన.. ఆ వివరాలు ఇలా..

కెరీర్‌లో ఆఖరి టెస్ట్ మ్యాచ్.. కట్ చేస్తే.. 30 ఏళ్ల రికార్డు బ్రేక్.. ఆ ప్లేయర్ ఎవరంటే.?
Test Cricket

Updated on: Jan 28, 2026 | 7:53 AM

2016లో న్యూజిలాండ్ స్టార్ బ్రెండన్ మెక్కల్లమ్ తన చివరి టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై కేవలం 54 బంతుల్లో సెంచరీ చేసి 30 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. టెస్ట్ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీగా ఇప్పటికీ నిలిచిన ఈ అద్భుత ఇన్నింగ్స్‌లో అతను 79 బంతుల్లో 145 పరుగులు సాధించి, తన వీడ్కోలు మ్యాచ్‌ను చిరస్మరణీయం చేశాడు.

ఇది చదవండి: ‘తాగేసి షూటింగ్‌కి వచ్చానని.. ఎన్టీఆర్ మా ఫైటర్స్‌ను పిలిచి ఏం చేశాడంటే..’

ఒక ప్లేయర్ తన వీడ్కోలు మ్యాచ్‌లో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టడం అరుదైన ఘట్టం. అలాంటి అద్భుతాన్ని 2016వ సంవత్సరంలో న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ బ్రెండన్ మెక్కల్లమ్ చేసి చూపించాడు. క్రికెట్ నుండి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించిన మెక్కల్లమ్, తన చివరి టెస్ట్ మ్యాచ్‌ను ఆస్ట్రేలియాతో ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఈ మ్యాచ్‌పై అతని అభిమానుల దృష్టి ఉన్నప్పటికీ, రికార్డుల పరంగా పెద్దగా అంచనాలు లేవు.

ఇవి కూడా చదవండి

అయితే, ఆ ఆఖరి మ్యాచ్‌లో మెక్కల్లమ్ అందరినీ ఆశ్చర్యపరిచాడు. మొదటి ఇన్నింగ్స్‌లో అతను కేవలం 54 బంతుల్లోనే సెంచరీ కొట్టి, సర్ వివ్ రిచర్డ్స్ పేరు మీద 30 ఏళ్లుగా ఉన్న ఫాస్టెస్ట్ టెస్ట్ సెంచరీ రికార్డును బ్రేక్ చేశాడు. ఈ రికార్డు ఇప్పటికీ టెస్ట్ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీగా బ్రెండన్ మెక్కల్లమ్ పేరు మీదే నిలిచి ఉంది. అతని ఇన్నింగ్స్‌లో ఓవరాల్‌గా 79 బంతుల్లో 145 పరుగులు చేసి ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపించాడు. దురదృష్టవశాత్తు, ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు ఓడిపోయింది.

ఇది చదవండి: హీరోయిన్లు అందరూ శోభన్ ‌బాబు దగ్గరకు వెళ్లి ఏం మాట్లాడేవారంటే.? అసలు విషయాన్ని చెప్పిన జయసుధ

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..