Video: ఎవడండీ వీడు.. విజయానికి 26 పరుగులు.. కట్‌చేస్తే.. చివరి ఓవర్‌లో ట్విస్ట్ మాములుగా లేదుగా

|

Jan 10, 2025 | 9:08 AM

BPL: బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2025లో భాగంగా 13వ మ్యాచ్‌లో, రంగ్‌పూర్ రైడర్స్ 3 వికెట్ల తేడాతో ఫార్చ్యూన్ బారిసల్‌పై ఉత్కంఠభరితంగా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో చివరి బంతికి రంగ్‌పూర్ రైడర్స్ విజయం సాధించింది. జట్టు కెప్టెన్ నూరుల్ హసన్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి చివరి ఓవర్లో 30 పరుగులు చేసి జట్టును గెలిపించాడు.

Video: ఎవడండీ వీడు.. విజయానికి 26 పరుగులు.. కట్‌చేస్తే.. చివరి ఓవర్‌లో ట్విస్ట్ మాములుగా లేదుగా
Rangpur Riders Skipper Nurul Hasan
Follow us on

BPL 2025: గురువారం సిల్హెట్‌లో జరిగిన బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లో రంగ్‌పూర్ రైడర్స్ బ్యాట్స్‌మెన్ నూరుల్ హసన్ చివరి ఓవర్‌లో 3 సిక్స్‌లు, 3 ఫోర్లు కొట్టి జట్టుకు ఫార్చ్యూన్ బారిసాల్‌పై థ్రిల్లింగ్ విజయాన్ని అందించాడు. నిజానికి, ఒక దశలో రంగ్‌పూర్ రైడర్స్ ఓడిపోవడం ఖాయంగా కనిపించింది. కానీ, చివరి ఓవర్లో టీమిండియా కెప్టెన్ నూరుల్ హసన్ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. చివరి ఓవర్‌లో రంగ్‌పూర్ రైడర్స్ విజయానికి 26 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజులో ఉన్న కెప్టెన్ నూరుల్ హసన్ 30 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

19వ ఓవర్లో 3 వికెట్లు..

ఫార్చ్యూన్ బరిషల్ ఇచ్చిన 197 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ రంగ్‌పూర్ రైడర్స్ జట్టు 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన నూరుల్ హసన్ ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో 2 పరుగులు చేశాడు. కానీ, రంగపూర్ రైడర్స్ 19వ ఓవర్లో మూడు వికెట్లు కోల్పోయింది. జహందాద్ ఖాన్ వేసిన ఈ ఓవర్‌లో రంగపూర్ రైడర్స్ బ్యాట్స్‌మెన్ ఖుష్దిల్ షా, మెహదీ హసన్, మహ్మద్ సైఫుద్దీన్‌లు ఔటయ్యారు.

ఇవి కూడా చదవండి

20వ ఓవర్లో పరుగుల వర్షం..

దీంతో చివరి ఓవర్‌లో రంగ్‌పూర్ రైడర్స్ విజయానికి 26 పరుగులు చేయాల్సి ఉంది. ఈసారి నూరుల్ హసన్ స్ట్రైక్‌లో ఉండగా, విండీస్ ఆల్ రౌండర్ కైల్ మేయర్స్ బౌలింగ్ బాధ్యతలు స్వీకరించాడు. తొలి బంతికి మైయర్స్ సిక్సర్ బాదగా, తర్వాతి రెండు బంతుల్లో నూరుల్ 2 బౌండరీలు బాదాడు. నాలుగో బంతికి మరో సిక్సర్ కొట్టిన నూరుల్ చివరి రెండు బంతుల్లో ఒక బౌండరీ, సిక్సర్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు.

నూరుల్ హసన్ చివరి ఓవర్లో 30 పరుగులు చేసి ఎన్నో రికార్డులు సృష్టించాడు. పురుషుల టీ20ల్లో చివరి ఓవర్‌లో ఇది మూడో అత్యధిక స్కోరు. దీనికి ముందు 2015లో జరిగిన టీ20 బ్లాస్ట్‌లో కెంట్ జట్టుపై సోమర్‌సెట్ 34 పరుగులు చేసింది. కానీ, చివరి ఓవర్‌లో సరిగ్గా 9 బంతులు పడ్డాయి. అయితే, సోమర్సెట్ మ్యాచ్‌లో 22 పరుగుల తేడాతో ఓడిపోయింది.

నూరుల్ హసన్ ఎవరు?

నూరుల్ హసన్ బంగ్లాదేశ్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్. ఈ ఆటగాడు బంగ్లాదేశ్ తరపున 11 టెస్టులు, 7 వన్డేలు ఆడాడు. ఇది కాకుండా 46 టీ20 మ్యాచ్‌లు కూడా ఆడాడు. హసన్ ఇప్పటివరకు 3 అర్ధ సెంచరీలు సాధించాడు. అతని వన్డే సగటు 82 కంటే ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ఈ ఆటగాడు బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో రంగపూర్ రైడర్స్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..