LLC 2022: ఓ క్రికెటర్‌గా భారత జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు గౌతమ్ గంభీర్ (Gautam Gambhir). 2007లో జరిగిన టీ20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్స్ లో అతను ఆడిన ఇన్నింగ్స్‌లు ఎవరూ మర్చిపోలేరు. ఇక సారథిగా ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను రెండుసార్లు విజేతగా నిలిపిన ఘనత ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ సొంతం. ఇలా భారత క్రికెట్‌లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న గౌతీ 2018లో అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్ల నుంచి రిటైర్ అయ్యాడు. ఆతర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి ఎంపీగా పార్లమెంట్‌లోకి అడుగుపెట్టాడు. ఇదిలా ఉంటే ఈ సొగసరి ఆటగాడు మరోసారి క్రికెట్ మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. భారత జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి కమిషనర్‌గా వ్యవహరిస్తోన్న లెజెండ్స్ లీగ్ క్రికెట్ రెండో సీజన్‌లో అతను భాగం కానున్నాడు. ఈ విషయాన్ని గంభీర్ శుక్రవారం ధ్రువీకరించాడు.’మళ్లీ క్రికెట్ మైదానంలో అడుగుపెట్టేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో దిగ్గజ ఆటగాళ్లతో ఆడే అవకాశం రావడం నాకు చాలా సంతోషంగా ఉంది’ అని గౌతీ పేర్కొన్నాడు.
కాగా లెజెండ్స్ లీగ్ క్రికెట్-2022 సీజన్ సెప్టెంబరు 17 నుంచి ప్రారంభం కానుంది. దిగ్గజ ఆటగాళ్లతో కూడిన మొత్తం ఆరు జట్లు ఈ టోర్నీలో పాల్గొననున్నాయి. ఇదిలా ఉంటే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఇండియా మహరాజాస్, వరల్డ్ జెయింట్స్ మధ్య సెప్టెంబర్ 16న ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఓ ఛారిటీ మ్యాచ్ జరగనుంది. ఇండియా మహరాజాస్‌కు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సారథ్యం వహిస్తుండగా.. వరల్డ్ జెయింట్స్‌కు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ నాయకత్వం వహించనున్నాడు.
#BossLogonKaGame welcomes a #Boss player whose contribution to India’s 2007 T20 World Cup and 2011 ODI World Cup wins is legendary. Welcome #Legend @GautamGambhir for the new season of #LegendsLeagueCricket #BossLogonKaGame #LLCT20 #BossGame pic.twitter.com/RDXePIAmJ5
— Legends League Cricket (@llct20) August 19, 2022
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..