Viral Video: ఇదేం మ్యాజిక్ సామీ.. చిరుత కన్నావేగంతో కళ్లు చెదిరే రనౌట్.. ధోనీనే మరిపించావ్‌గా..

Trending Video: నేపాల్ టీ20 లీగ్‌లో బిరత్‌నగర్ సూపర్ కింగ్స్, జనక్‌పూర్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో బిరత్‌నగర్ సూపర్ కింగ్స్ వికెట్ కీపర్ అద్భుతమైన స్టంపింగ్ చేసి మహేంద్ర సింగ్ ధోనీని గుర్తు చేశాడు.

Viral Video: ఇదేం మ్యాజిక్ సామీ.. చిరుత కన్నావేగంతో కళ్లు చెదిరే రనౌట్.. ధోనీనే మరిపించావ్‌గా..
Viral Stumping Video
Follow us
Venkata Chari

|

Updated on: Dec 29, 2022 | 5:30 AM

ప్రపంచ క్రికెట్‌లో వికెట్ కీపింగ్ విషయానికి వస్తే, భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) ప్రస్తావన ఖచ్చితంగా వస్తుంది. వికెట్ల వెనుక మహేంద్ర సింగ్ ధోనీ స్టైల్ వేరేలా ఉంటుంది. మెరుపు వేగంలో స్టంపింగ్ చేసి, బ్యాటర్లకు భారీ షాక్‌లు ఇచ్చేవాడు. ఇప్పటికీ చాలామంది ధోనీలా ప్రయత్నిస్తుంటారు. తాజాగా నేపాల్ టీ20 లీగ్ నుంచి అద్భుతమైన స్టంపింగ్ వీడియో తెరపైకి వచ్చింది. ఈ లీగ్‌లో బిరత్‌నగర్ సూపర్ కింగ్స్, జనక్‌పూర్ రాయల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో బిరత్‌నగర్ సూపర్ కింగ్స్ వికెట్ కీపర్ అర్జున్ సౌద్ మెరుపు వేగంతో స్టంపింగ్ చేసి, మహేంద్ర సింగ్ ధోనీని గుర్తు చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

రనౌట్‌గా వెనుదిరిగిన ఇద్దరు బ్యాటర్లు..

వైరల్ అవుతున్న వీడియోలో మొదటి జనక్‌పూర్ రాయల్స్ బ్యాట్స్‌మెన్ వాల్టన్ బంతిని డిఫెండ్ చేస్తూ, బంతి దూరంగా వెళ్లడం చూసి పరుగు తీసేందుకు ప్రయత్నించాడు. కానీ, ఫీల్డింగ్ చేస్తున్న సికందర్ రజా వికెట్ కీపర్ అర్జున్ సౌద్‌కు బంతిని ఇచ్చాడు. బంతి అర్జున్ సౌద్ నుంచి కొంచెం దూరం వెళ్లింది. అతను దానిని గాలిలో ఎగురుతూ క్యాచ్ పట్టుకుని బ్యాట్స్‌మన్‌ను రన్ అవుట్ చేశాడు. వ్యాఖ్యాతకి అర్జున్ ఈ శైలి బాగా నచ్చింది. తన స్టంపింగ్‌పై వ్యాఖ్యాత స్పందిస్తూ, ‘యువకుడా, నువ్వు మహేంద్ర సింగ్ ధోనీని గర్వపడేలా చేశావు’ అంటూ ప్రసంశల జల్లు కురిపించాడు. ఇన్నింగ్స్ 9వ ఓవర్ మూడో బంతికి ఈ ఘటన చోటుచేసుకుంది.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియో..

తర్వాతి బంతికి అంటే ఓవర్‌లోని ఐదో బంతికి అర్జున్ మరోసారి తన అద్భుతమైన వికెట్ కీపింగ్‌ను చూపించాడు. ఈసారి బ్యాట్స్‌మన్ స్వీప్ షాట్ ఆడా. మొదటి పరుగు పూర్తి చేసిన తర్వాత రెండవ పరుగు కోసం ప్రయత్నిస్తాడు. ఇంతలో, ఫీల్డర్ ఫీల్డ్ మిస్ అయ్యాడు. ఆ తర్వాత అతను బంతిని వికెట్ కీపర్ అర్జున్ సౌద్ వైపు విసిరాడు. ఈసారి మహేంద్ర సింగ్ ధోని స్టైల్‌లో, అతను తన రెండు కాళ్ల మధ్య బంతిని తీసుకొని స్టంప్ చేసి బ్యాట్స్‌మన్‌ను రన్ అవుట్ చేశాడు. దీంతో నెటిజన్లు కూడా ధోనీతో పోల్చుతూ కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!