AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 : CSK-రాజస్థాన్ రాయల్స్ ట్రేడ్ డీల్ ఖరారు..సంజూ శాంసన్ కోసం చెన్నై నుంచి ఇద్దరు ప్లేయర్లు

ఐపీఎల్ 2026 మెగా ఆక్షన్ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య కీలకమైన ఆటగాళ్ల ట్రేడ్ డీల్ దాదాపు ఖరారైంది. ఈ డీల్ లో ముగ్గురు స్టార్ ఆటగాళ్లు పాలుపంచుకోవడం విశేషం. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్, వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ అయిన సంజు శాంసన్ ను చెన్నై సూపర్ కింగ్స్ తీసుకోనుంది.

IPL 2026 : CSK-రాజస్థాన్ రాయల్స్ ట్రేడ్ డీల్ ఖరారు..సంజూ శాంసన్ కోసం చెన్నై నుంచి ఇద్దరు ప్లేయర్లు
Csk, Rajasthan Royals
Rakesh
|

Updated on: Nov 11, 2025 | 6:49 AM

Share

IPL 2026 : ఐపీఎల్ 2026 మెగా వేలం కంటే ముందే ట్రేడ్ విండోలో అత్యంత సంచలనమైన డీల్ ఒకటి జరగబోతోంది. అత్యంత విజయవంతమైన జట్టు చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ప్లేయర్ల ట్రేడ్ డీల్ దాదాపు ఖరారైనట్లు సమాచారం. ఈ డీల్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ సీఎస్కేలోకి రానుండగా, చెన్నై నుంచి ఇద్దరు కీలక ఆటగాళ్లు రవీంద్ర జడేజా, శాం కరణ్ రాజస్థాన్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ ట్రేడ్ డీల్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత హై-ప్రొఫైల్ డీల్స్‌లో ఒకటిగా నిలవనుంది.

ఐపీఎల్ 2026 మెగా ఆక్షన్ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య కీలకమైన ఆటగాళ్ల ట్రేడ్ డీల్ దాదాపు ఖరారైంది. ఈ డీల్ లో ముగ్గురు స్టార్ ఆటగాళ్లు పాలుపంచుకోవడం విశేషం. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్, వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ అయిన సంజు శాంసన్ ను చెన్నై సూపర్ కింగ్స్ తీసుకోనుంది. సంజుకు బదులుగా చెన్నై నుంచి ఆల్-రౌండర్లు రవీంద్ర జడేజా, శాం కరణ్ రాజస్థాన్ రాయల్స్‌కు వెళ్తారు.

ఐపీఎల్ ట్రేడ్ నిబంధనల ప్రకారం ఆటగాడి వ్రాతపూర్వక ఆమోదం లేకుండా ఏ ట్రేడ్ జరగదు. ఈ డీల్‌లో కీలకమైన ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. క్రిక్ బజ్ నివేదిక ప్రకారం.. ఈ ముగ్గురు ఆటగాళ్లు (సంజు శాంసన్, రవీంద్ర జడేజా, శాం కరణ్) ట్రేడ్‌కు తమ సమ్మతిని తెలియజేస్తూ పత్రాలపై సంతకాలు చేశారు.

ఆటగాళ్ల సమ్మతి తర్వాత చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీలు ముగ్గురు ఆటగాళ్ల పేర్లతో కూడిన ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ ను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌కు పంపించాయి. అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. రాజస్థాన్ రాయల్స్‌కు దీర్ఘకాలంగా కెప్టెన్‌గా వ్యవహరించిన సంజు శాంసన్ (ప్రస్తుత కాంట్రాక్ట్ రూ.18 కోట్లు) ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కీలక పాత్ర పోషించనున్నారు. ఐపీఎల్ 2025 తర్వాత ఎంఎస్ ధోనీకి వారసుడిగా సంజు శాంసన్‌ను సీఎస్కే చూస్తోంది.

సీఎస్కేలో సంజు మిడిల్ ఆర్డర్‌ను బలోపేతం చేయడంతో పాటు వికెట్ కీపింగ్ బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహించగలరు. నివేదికల ప్రకారం, సంజు శాంసన్ ఐపీఎల్ 2025 తర్వాత స్వయంగా రాజస్థాన్ రాయల్స్ నుంచి విడుదల కావడానికి సుముఖత వ్యక్తం చేశారు. సంజు రాకతో చెన్నై నుంచి రాజస్థాన్‌కు వెళ్తున్న రవీంద్ర జడేజా (రూ.18 కోట్ల కాంట్రాక్ట్), ఇంగ్లీష్ ఆల్‌రౌండర్ శాం కరణ్ పాత్రలు కూడా ముఖ్యమైనవే.

2012 నుంచి సీఎస్కే కోర్ టీమ్‌లో జడేజా కొనసాగారు. 2022లో కెప్టెన్సీ కూడా వహించారు. రాజస్థాన్ రాయల్స్‌కు 2008లో జరిగిన తొలి ఐపీఎల్ విజయంలో ఆయన ఒక భాగం. ఇప్పుడు 15 ఏళ్ల తర్వాత ఆయన మళ్లీ ఆ జట్టులోకి వెళ్లడం భావోద్వేగమైన అంశం. జడేజా, శాం కరణ్ ఇద్దరూ ప్రపంచ స్థాయి ఆల్‌రౌండర్లు. వీరిద్దరూ రాజస్థాన్ రాయల్స్ ఆల్‌రౌండ్ విభాగాన్ని కచ్చితంగా బలోపేతం చేస్తారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం