IND vs AUS: టీమిండియాతో టెస్ట్ సిరీస్.. ఆస్ట్రేలియాకు భారీ ఎదురు దెబ్బ.. స్టార్ ప్లేయర్ ఔట్‌

|

Oct 14, 2024 | 2:09 PM

ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ సిరీస్‌ కోసం భారత్, ఆస్ట్రేలియా జట్లు సంసిద్ధమవుతున్నాయి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా జరిగే ఈ సిరీస్ లో గెలవడం ఇరు జట్లకు చాలా కీలకం. అందుకే ఈ టెస్ట్ సిరీస్ కోసం ఇప్పటికే రెండు జట్లు తమ తమ ప్రణాళికల్లో ఉన్నాయి. అయితే ఈ ప్రతిష్ఠాత్మక సిరీస్ కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు షాక్ తగిలింది

IND vs AUS: టీమిండియాతో టెస్ట్ సిరీస్.. ఆస్ట్రేలియాకు భారీ ఎదురు దెబ్బ.. స్టార్ ప్లేయర్ ఔట్‌
Australia Cricket Team
Follow us on

ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ సిరీస్‌ కోసం భారత్, ఆస్ట్రేలియా జట్లు సంసిద్ధమవుతున్నాయి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా జరిగే ఈ సిరీస్ లో గెలవడం ఇరు జట్లకు చాలా కీలకం. అందుకే ఈ టెస్ట్ సిరీస్ కోసం ఇప్పటికే రెండు జట్లు తమ తమ ప్రణాళికల్లో ఉన్నాయి. అయితే ఈ ప్రతిష్ఠాత్మక సిరీస్ కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు షాక్ తగిలింది. ఈ సిరీస్‌కు ఆ జట్టు అగ్రశ్రేణి ఆల్‌రౌండర్‌ కామెరూన్ గ్రీన్‌ దూరమయ్యాడు. తుంటి నొప్పితో బాధపడుతున్న గ్రీన్ త్వరలో శస్త్రచికిత్స చేయించుకోనున్నారు. ఈ కారణంగా నవంబర్ 22 న ప్రారంభమయ్యే BGT సిరీస్‌కు అందుబాటులో ఉండడు. కామెరూన్ గ్రీన్ వెన్నెముక సమస్యతో బాధపడుతున్నాడు. అతనికి శస్త్రచికిత్స అవసరమని వైద్యులు చెప్పారు. దీంతో భారత్‌తో జరిగే ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. కాగా కామెరాన్ గ్రీన్ అందుబాటులో లేకపోవడం ఆస్ట్రేలియా జట్టుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఆసీస్ జట్టులో గ్రీన్ ఆల్ రౌండర్ గా మెరుగ్గా రాణిస్తున్నాడు. ఇప్పుడు అతను ప్రధాన సిరీస్‌కు అందుబాటులో లేనందున, క్రికెట్ ఆస్ట్రేలియా అనివార్యంగా ప్రత్యామ్నాయ ఆల్ రౌండర్‌ను ఎంచుకోవలసి ఉంటుంది.

 

ఇవి కూడా చదవండి

వంబర్ 22 నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కాగా, ఈ సిరీస్‌లో మొత్తం ఐదు మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్ పెర్త్‌లో జరగనుండగా, రెండో మ్యాచ్ డిసెంబర్ 6 నుంచి అడిలైడ్‌లో ప్రారంభం కానుంది. అదేవిధంగా, డిసెంబర్ 14 నుండి ప్రారంభమయ్యే మూడవ మ్యాచ్‌కు బ్రిస్బేన్ ఆతిథ్యం ఇవ్వగా, నాల్గవ మ్యాచ్ మెల్‌బోర్న్‌లో జరుగుతుంది. డిసెంబర్ 26 నుంచి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. జనవరి 3 నుంచి ప్రారంభమయ్యే ఫైనల్ మ్యాచ్‌కు సిడ్నీ క్రికెట్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. కామెరాన్ గ్రీన్ ఇప్పటివరకు ఆస్ట్రేలియా తరపున 28 టెస్టులు ఆడాడు, అందులో అతను 36.23 సగటుతో 1377 పరుగులు చేశాడు. 35 వికెట్లు కూడా తీశాడు.

 

గ్రీన్ సుమారు 6 నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు అంటే అతను భారత్‌తో జరిగే 5 టెస్టుల సిరీస్‌కుతో పాటు ఏడాది ఫిబ్రవరిలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా దూరం కానున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..