IND vs ENG: ఆ ఒక్కడ్ని అవుట్‌ చేయగానే.. విజయం మాదే అని ఫిక్స్‌ అయ్యాం! బెన్‌ స్టోక్స్‌ షాకింగ్‌ కామెంట్స్‌..

లార్డ్స్‌లో జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో టీమిండియా 22 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇంగ్లాండ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. బెన్ స్టోక్స్, రిషభ్ పంత్‌ను తొలగించడం వల్లే గెలిచామని అన్నారు. జడేజా 61 పరుగులు చేసినా, మిగిలిన బ్యాట్స్‌మెన్‌లు విఫలమయ్యారు. సిరాజ్ చివరి వరకు పోరాడాడు.

IND vs ENG: ఆ ఒక్కడ్ని అవుట్‌ చేయగానే.. విజయం మాదే అని ఫిక్స్‌ అయ్యాం! బెన్‌  స్టోక్స్‌ షాకింగ్‌ కామెంట్స్‌..
Ben Stokes

Updated on: Jul 15, 2025 | 10:56 AM

క్రికెట్‌ మక్కా ప్రతిష్టాత్మక లార్డ్స్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 22 పరుగుల స్వల్ప తేడాతో ఓటమి పాలైంది. ఆట నాలుగు రోజులు పూర్తి అయిన తర్వాత టీమిండియానే ఫేవరేట్‌గా కనిపించినా.. ఐదో రోజు ఇంగ్లాండ్‌ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేసి మ్యాచ్‌ గెలిచారు. అయితే.. మ్యాచ్‌ ఐదో రోజు ఆట చివరి సెషన్‌ వరకు వెళ్లినా.. తాము మ్యాచ్‌ గెలుస్తామనే విషయం తమకు ఉదయమే అర్థమైపోయిందంటూ ఇంగ్లాండ్‌ కెప్టెన్ బెన్‌ స్టోక్స్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాలోని ఆ ఒక్క బ్యాటర్‌ను అవుట్‌ చేయగానే.. ఇక మ్యాచ్‌ గెలిచేశాం అని ఫీలైనట్లు వెల్లడించారు. ఇంతకీ బెన్‌ స్టోక్స్‌ ఏ బ్యాటర్‌ గురించి మాట్లాడాడో ఇప్పుడు చూద్దాం..

కేవలం 193 పరుగుల టార్గెట్‌తో రెండో ఇన్నింగ్స్‌ బరిలోకి దిగిన టీమిండియా 170 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. రవీంద్ర జడేజా 181 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్‌తో 61 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేశాడు. కానీ, అతనికి బ్యాటర్ల నుంచి సపోర్ట్‌ లభించలేదు. చివర్లో జస్ప్రీత్‌ బుమ్రా, మొహమ్మద్‌ సిరాజ్‌ అద్భుతంగా సపోర్ట్‌ చేసి.. విజయంపై ఆశలు రేపినా.. టీమిండియాను దురదృష్టం వెంటాడింది. 30 బంతులను సమర్థవంతంగా ఎదుర్కొన్న సిరాజ్‌.. బషీర్‌ బౌలింగ్‌లో అద్భుతంగా డిఫెన్స్‌ ఆడినప్పటికీ.. బాల్‌ రోల్‌ అవుతూ అనూహ్యంగా వికెట్లను మెల్లగా తాకింది. దాంతో ఇంగ్లాండ్‌ ఓటమి అంచుకు వచ్చి మ్యాచ్‌ గెలిచింది.

విజయం తర్వాత బెన్‌ స్టోక్స్‌ మాట్లాడుతూ.. రిషభ్‌ పంత్‌ను ఈ రోజు ఉదయమే అవుట్‌ చేయడం కలిసొచ్చిందని, అతను చాలా డేంజరస్‌ ప్లేయర్‌ అని అతని వికెట్‌ పడగానే.. గెలిచేస్తామనే నమ్మకం వచ్చిందని అన్నాడు. ఈ మ్యాచ్‌లో రిషభ్‌ పంత్‌ 12 బంతుల్లో 2 ఫోర్లతో 9 పరుగులు చేసి అవుట్‌ అయ్యాడు. కాగా ఇలాంటి పరిస్థితుల్లో పంత్‌ మంచి బ్యాటింగ్‌ చేస్తాడు. అగ్రెసివ్‌గా ఆడుతూ మ్యాచ్‌ను ప్రత్యర్థి చేతి నుంచి లాగేసుకుంటాడు. అలా చాలా సార్లు చేశాడు కూడా. అందుకే ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ పంత్‌ వికెట్‌కు అంత ప్రాధాన్యత ఇచ్చాడు. అయితే పంత్‌తో పాటు వాషింగ్టన్‌ సుందర్‌, నితీష్‌ కుమార్‌ రెడ్డి కూడా జడేజాకు సపోర్ట్‌ ఇవ్వలేకపోయారు. దీంతో టీమిండియాకు గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమి ఎదురైంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి