INDIA VS ENGLAND: హిట్‌మ్యాన్ ఆ క్యాచ్‌ను అందుకోలేకపోయాడు.. ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్..

INDIA VS ENGLAND: టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్ ఆధిపత్యం చెలాయిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి

INDIA VS ENGLAND: హిట్‌మ్యాన్ ఆ క్యాచ్‌ను అందుకోలేకపోయాడు.. ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్..
Follow us
uppula Raju

|

Updated on: Feb 07, 2021 | 7:32 AM

INDIA VS ENGLAND: టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్ ఆధిపత్యం చెలాయిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లీష్ జట్టు 555/8 పరుగులు చేసింది. కెప్టెన్ జో రూట్(218: 377 బంతుల్లో 19×4, 2×6) సూపర్ డబుల్ సెంచరీతో ఇన్నింగ్స్‌కి వెన్నుముకగా నిలవగా.. ఓపెనర్ సిబ్లీ(87: 286 బంతుల్లో 12×4, 0x6), ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్(82: 118 బంతుల్లో 10×4, 3×6) మంచి భాగస్వామ్యాలను నెలకొల్పడంలో సహాయపడ్డారు.

ఇదిలా ఉంటే ఇండియన్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ ఓ సులువైన క్యాచ్‌ను కూడా అందుకోలేకపోయాడని ఆశ్చర్యవ్యక్తం చేశాడు ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ బెన్ స్టోక్స్. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. సుందర్‌ బౌలింగ్‌లో 175 ఓవర్‌లో డామ్ బెస్‌ (28*) షాట్‌కు ప్రయత్నించాడు. బంతి మిడ్‌ వికెట్‌లో ఉన్న రోహిత్‌ వైపునకు వెళ్లింది. అయితే ఎంతో సులువైన ఆ క్యాచ్‌ను హిట్‌మ్యన్‌ జారవిడిచాడు. దీంతో రోహిత్‌తో సహా టీమిండియా ఆటగాళ్లంతా ఎంతో నిరాశ చెందారు. మరోవైపు డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఉన్న స్టోక్స్‌ కూడా ఆశ్చర్యపోయాడు.

19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద లైఫ్ దక్కించుకున్న బెస్‌ శనివారం ఆట ఆఖరి వరకు క్రీజులో నిలిచాడు. బౌండరీలు బాదుతూ జట్టు స్కోరును 550 దాటించాడు. అయితే చెపాక్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పేలవ ఫీల్డింగ్ చేస్తోంది. నాలుగు క్యాచ్‌లను అందుకోలేకపోయింది. పంత్, అశ్విన్‌, పుజారా, రోహిత్ ఒక్కో క్యాచ్‌ను జారవిడిచారు. ఫలితంగా భారీ మూల్యం చెల్లించుకోవల్సి వస్తోంది.

India vs England: టీమ్ ఇండియా నిర్ణయం సరైనది కాదు.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు..

వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..