IND vs ENG: ఆ ఒక్క తప్పు చేయకుండా ఉండాల్సింది..! BCCIలో మొదలైన అలజడి
బీసీసీఐ ఎప్పుడూ సరైన నిర్ణయాలు తీసుకుంటుందని పేరుంది. అయితే, టీ20 కెప్టెన్సీ విషయంలో తాము తీసుకున్న నిర్ణయం రైటే అని ఇప్పుడు నిరూపించుకోవాల్సిన పరిస్థితి. సూర్యకుమార్ యాదవ్‌ను తప్పించి, శ్రేయస్ అయ్యర్‌కు పగ్గాలివ్వడం, జట్టు ఎంపికలో తప్పిదాల వల్ల టీమిండియా వరుసగా ఓటమిపాలైంది. ఈ పరిణామాలపై బీసీసీఐ లోతుగా సమీక్షిస్తోంది.

తాము తీసుకున్న నిర్ణయం రైట్ అని నిరూపించాల్సిన పరిస్థితి బీసీసీఐకి గతంలో ఎప్పుడూ రాలేదు. వాళ్లు ఏది చేసినా అది కరెక్టే అనే ఇంప్యాక్ట్ ఇండియన్ క్రికెట్‌పై క్రియేట్ చేశారు. విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించినా, రోహిత్ శర్మకు అదే ట్రీట్‌మెంట్ ఇచ్చినా, శుబ్‌మన్ గిల్‌ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్ చేసి, టీ20ల నుంచి తప్పించినా.. ఇలా ఏది చేసినా బీసీసీఐకే చెల్లింది. అప్పటికి అప్పుడు విమర్శలు వచ్చినా.. వాళ్లు తీసుకున్న నిర్ణయం సరైందే అనేలా ఆ తర్వాత రిజల్ట్స్ వచ్చాయి. కానీ, ఇప్పుడు పరిస్థితి అలా లేదు.
టీ20 కెప్టెన్సీ విషయంలో తాము తీసుకున్న నిర్ణయం కరెక్టే అని నిరూపించుకోవాల్సిన పరిస్థితికి బీసీసీఐ దిగజారిపోయింది. అందుకు కారణం.. టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్ టీమ్ వరుసగా నాలుగు ఓటములు చవిచూసింది. టీ20 వరల్డ్ కప్ 2026 గెలిచిన తర్వాత ట్రోఫీ విన్నింగ్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను ఫామ్ లేదనే కారణంతో కెప్టెన్‌గా తప్పించారు. ఐపీఎల్ ప్రదర్శన చూసి, అసలు టీ20 టీమ్ సెలెక్షన్ ఆలోచనల్లోనే లేని శ్రేయస్ అయ్యర్‌ను తీసుకొచ్చి ఏకంగా టీ20 కెప్టెన్‌ని చేశారు. బీసీసీఐ ఏది చేసినా రైటే అనే బ్యాచ్ కూడా ఇప్పుడు లేదు.. లేదు.. ఎక్కడో తప్పు జరిగింది అని అంటున్నారు.
ఎక్కడో కాదు.. టీ20 టీమ్ ఎంపికలో, కెప్టెన్ ఎంపికలోనే తప్పు జరిగిపోయింది. కేవలం ఐపీఎల్‌లో కెప్టెన్సీ చూసి మాత్రమే అయ్యర్‌ను కెప్టెన్ చేసి ఉంటే.. ఆర్సీబీకి వరుసగా రెండు కప్పులు అందించిన రజత్ పాటిదార్‌ను కెప్టెన్ చేయాల్సింది, కానీ కనీసం టీమ్‌లోకి కూడా తీసుకోలేదు. అలాగే బౌలర్ల విషయంలో కూడా తప్పుచేశారు, ప్రసిద్ధ్ కృష్ణ, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణాలను తీసుకున్నారు. వీరి కంటే బెటర్ బౌలర్లు బయట ఉన్నారు. మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ వంటి మ్యాచ్ విన్నర్లను పక్కనపెట్టేశారు. అయితే బీసీసీఐకి తాము చేసిన తప్పేంటో అర్థం అవుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అసలు టీమిండియాలో ఏం జరుగుతోంది? తప్పు ఎవరిది? కెప్టెన్, కోచ్ ఇలా అందరి పనితీరును రివ్యూ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ బీసీసీఐ తల్చుకుంటే జింబాబ్వే టూర్ తర్వాత టీమిండియా టీ20 టీమ్‌లో పెను మార్పులు సంభవించే అవకావం లేకపోలేదు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
