AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

87 ఏళ్ల చరిత్రకు బ్రేక్ పడింది.. కరోనా మార్గదర్శకాల మధ్య రంజీ ట్రోఫీ నిర్వహించలేమన్న బీసీసీఐ

ఈ ఏడాది దేశవాళీ క్రికెట్ నిర్వహించడం లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. ఆయా రాష్ట్రాల క్రికెట్​ అసోసియేషన్ల కోరిక మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. 87 ఏళ్ల రంజీ చరిత్రలో ట్రోఫీని..

87 ఏళ్ల చరిత్రకు బ్రేక్ పడింది.. కరోనా మార్గదర్శకాల మధ్య రంజీ ట్రోఫీ నిర్వహించలేమన్న బీసీసీఐ
Sanjay Kasula
|

Updated on: Jan 30, 2021 | 5:19 PM

Share

No Ranji Trophy  :  ఈ ఏడాది దేశవాళీ క్రికెట్ నిర్వహించడం లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. ఆయా రాష్ట్రాల క్రికెట్​ అసోసియేషన్ల కోరిక మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. 87 ఏళ్ల రంజీ చరిత్రలో ట్రోఫీని నిర్వహించకపోవడం ఇదే తొలిసారి అంటూ  బీసీసీఐ పేర్కొంది. కోవిడ్​ నేపథ్యంలో మెజార్టీ రాష్ట్రాల క్రికెట్​ అసోసియేషన్లు విజయ్​ హజారే ట్రోఫీ నిర్వహణకు మొగ్గు చూపడమే దీనికి కారణం.

దీంతోపాటు అండర్​-19 వన్డే, వినూ మన్కడ్​ ట్రోఫీ, మహిళల పరిమిత ఓవర్ల టోర్నమెంట్లనూ జరుపుతామని బీసీసీఐ స్పష్టం చేసింది. కరోనా మార్గదర్శకాలు పాటిస్తూ రెండు నెలల పాటు రంజీ ట్రోఫీని నిర్వహించడం సాధ్యం కాదని తెలిపింది.

అంతకుముందు.. రంజీ టోర్నీల నిర్వహణ అంశంపై రాష్ట్రాల క్రికెట్​ అసోసియేషన్లు అభిప్రాయాలు వెల్లడించాల్సిందిగా బీసీసీఐ కార్యదర్శి జై షా లేఖలో పేర్కొంది. ముస్తాక్​ అలీ టోర్నీని విజయవంతంగా నిర్వహించడంపైనా ఆయన హర్షం వ్యక్తం చేశారు. వివిధ రాష్ట్రాల క్రికెట్​ అసోసియేషన్లకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, గతేడాది జరిగిన రంజీ ట్రోఫీ ఫైనల్లో బంగాల్​, సౌరాష్ట్రలు తలపడ్డాయి. విజేతగా సౌరాష్ట్ర నిలిచింది.

129 ఏళ్ల ఘనమైన చరిత్ర ఉన్న రంజీ ట్రోఫీ చరిత్రలో దేశవాళీ లీగ్ రద్దు కావడం ఇది మూడోసారి. 1892లో భారతదేశంలో రంజీ ట్రోఫీ ఆరంభమైంది… 1930-31, 1933-34 సమయంలో దేశంలో స్వాతంత్ర్య ఉద్యమం నడుస్తున్న సమయంలో మొట్టమొదటిసారిగా రంజీ సీజన్‌కి బ్రేక్ పడింది. అయితే ఆ తర్వాత స్వాతంత్ర్య భారత దేశంలో మాత్రం ఇదే తొలిసారి.

మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం సమయాల్లో కూడా ఫస్ట్ క్లాస్ క్రికెట్ టోర్నీలను నిర్వహించిన ఏకైక దేవం భారత దేశం. అయితే అంత ప్రపంచ యుద్ధాలను మించిన స్థాయిలో కరోనా విపత్తు రావడంతో ఈ సారి ట్రోఫీని రద్దు చేసింది బోర్డు.

ఇవి కూడా చదవండి : 

Niharika: వేసవి త్వరగా రావాలని కోరుకుంటున్న మెగా డాటర్‌ నిహారిక.. కారణమేంటో తెలుసా..?

Prime Minister Modi: ఆ ఆఫర్ ఇప్పటికీ వర్తిస్తుంది.. రైతుల ఉద్యమంపై కీలక వ్యాఖ్యలు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ..