Virat Kohli: ఆ విషయంలో కోహ్లీని హెచ్చరించిన బీసీసీఐ.. సడన్ రిటైర్మెంట్‌లో ఊహించని ట్విస్ట్..?

Virat Kohli Retirement: భారత అత్యుత్తమ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ ఎర్ర బంతితో ఆడటం ఆందోళన కలిగించే విషయంగా మిగిలిపోయింది. గత 5 సంవత్సరాలలో, కోహ్లీ ఈ ఫార్మాట్‌లో సగటున 30 కంటే తక్కువ పరుగులు చేశాడు. 2020 నుంచి 2024-25 వరకు భారతదేశం తరపున విరాట్ కోహ్లీ మొత్తం 69 ఇన్నింగ్స్‌లు ఆడాడు.

Virat Kohli: ఆ విషయంలో కోహ్లీని హెచ్చరించిన బీసీసీఐ.. సడన్ రిటైర్మెంట్‌లో ఊహించని ట్విస్ట్..?
Virat Kohli

Updated on: May 14, 2025 | 12:24 PM

Virat Kohli Retirement: భారత జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సోమవారం (మే 12) టెస్ట్ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. ముందు టీ20 నుంచి రిటైర్ అయిన తర్వాత కోహ్లీ క్రికెట్ సుధీర్ఘ ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ అధికారికంగా ప్రకటించాడు. దీంతో బ్యాట్స్‌మన్‌గా వన్డే ఫార్మాట్‌లో మాత్రమే ఇకపై కనిపించనున్నాడు.

అయితే, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించే ముందు, జూన్ 20 నుంచి ఇంగ్లాండ్‌తో ప్రారంభమయ్యే ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు బీసీసీఐ కోహ్లీని ఒప్పించగలదని భావించారు. కానీ, ఇప్పుడు బీసీసీఐ విరాట్ కోహ్లీని హెచ్చరించినట్లు తెలుస్తోంది.

బీసీసీఐ కఠిన నిర్ణయం..

విరాట్ కోహ్లీ చాలా కాలంగా టెస్ట్ ఫార్మాట్‌లో ప్రతి పరుగును సాధించడానికి ఇబ్బంది పడుతున్నాడు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతో జరిగిన చివరి రెండు టెస్ట్ సిరీస్‌లలో కోహ్లీ చాలా పేలవంగా రాణించాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ పర్యటనకు జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.

ఇవి కూడా చదవండి

దైనిక్ జాగరణ్‌లో వచ్చిన ఒక నివేదిక ప్రకారం, కోహ్లీ రిటైర్మెంట్ ఆపడానికి బదులుగా, అతని పేలవమైన ఫామ్ కారణంగా, ఇంగ్లాండ్ పర్యటనకు జట్టులో చోటు దొరకదని బీసీసీఐ హెచ్చరించిందంట. అదే సమయంలో, బీసీసీఐ ఏ ఆటగాడిని ఆడమని అభ్యర్థించదని, బదులుగా ఈ నిర్ణయం ఆటగాడి వ్యక్తిగతమని ఆ నివేదిక తెలిపింది. ఇందులో బీసీసీఐ ఏ విధంగానూ జోక్యం చేసుకోదనే విషయం స్పష్టంగా చెప్పిందంట.

కోహ్లీ మళ్ళీ కెప్టెన్ కాబోతున్నాడు..!

బుధవారం, మే 7న, భారత టెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తన రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ, ఇప్పుడు రోహిత్ తర్వాత, ఇంగ్లాండ్ పర్యటనలో విరాట్ కోహ్లీని కెప్టెన్‌గా చేయాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. గిల్‌కు కమాండింగ్ పాత్రలో కొంత సమయం లభించేలా ఇంగ్లాండ్ పర్యటనకు విరాట్ కోహ్లీని కెప్టెన్‌గా చేయాలని సెలెక్టర్లు పరిశీలిస్తున్నారని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

‘గిల్ వయసు కేవలం 25 సంవత్సరాలు, ఇంకా అతను ఇంకా మంచి ఫామ్‌లో లేడు. అదే సమయంలో, జస్‌ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్ కారణంగా, అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీకి గిల్ మొదటి ఎంపిక అని కూడా బీసీసీఐ వర్గాలు’ తెలిపాయి.

విరాట్ కోహ్లీ ఫామ్ అతనికి మద్దతు ఇవ్వడం లేదు..

భారత అత్యుత్తమ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ ఎర్ర బంతితో ఆడటం ఆందోళన కలిగించే విషయంగా మిగిలిపోయింది. గత 5 సంవత్సరాలలో, కోహ్లీ ఈ ఫార్మాట్‌లో సగటున 30 కంటే తక్కువ పరుగులు చేశాడు. 2020 నుంచి 2024-25 వరకు భారతదేశం తరపున విరాట్ కోహ్లీ మొత్తం 69 ఇన్నింగ్స్‌లు ఆడాడు. అందులో అతను 3 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు మాత్రమే చేశాడు. ఆస్ట్రేలియాలో కోహ్లీ ఐదు మ్యాచ్‌ల్లో 190 పరుగులు చేశాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను 15.50 సగటుతో 93 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..