
IPL 2026 : ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టాటా ఐపీఎల్ 2026 రెండో దశ (సెకండ్ ఫేజ్) షెడ్యూల్‌ను బీసీసీఐ అధికారికంగా రిలీజ్ చేసింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తొలుత ఏప్రిల్ 12 వరకు మాత్రమే షెడ్యూల్ ఇచ్చిన బోర్డు, ఇప్పుడు మే 24 వరకు జరగబోయే మిగిలిన 50 లీగ్ మ్యాచ్‌ల వివరాలను వెల్లడించింది. దేశవ్యాప్తంగా 12 నగరాల్లో ఈ క్రికెట్ సంబురం జరుగనుంది. ఐపీఎల్ 2026 రెండో దశ ఏప్రిల్ 13 నుంచి ప్రారంభం కానుంది. మొదటి దశలో కేవలం 20 మ్యాచ్‌ల వివరాలే ఇచ్చారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల తేదీలను దృష్టిలో ఉంచుకుని అప్పట్లో షెడ్యూల్‌ను పరిమితం చేశారు. ఇప్పుడు పరిస్థితులు సర్దుమణగడంతో పూర్తి స్థాయి క్యాలెండర్ సిద్ధమైంది. ఏప్రిల్ 13న హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య పోరుతో ఈ మలిదశ మొదలవుతుంది. మొత్తం 12 నగరాల్లో మ్యాచ్‌లు జరగనుండగా, కొత్తగా ధర్మశాల, రాయ్‌పూర్, న్యూ చండీగఢ్ వేదికలు కూడా జాబితాలో చేరాయి.
ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన, ఆర్థిక సంక్షోభం తలెత్తుతుందనే ఆందోళనలు ఉన్నాయి. అయితే, బీసీసీఐ మాత్రం టోర్నీకి ఎలాంటి ఆటంకం కలగకుండా ఏర్పాట్లు చేస్తోంది. లాజిస్టిక్స్ లేదా ప్రేక్షకులకు ఇబ్బంది లేకుండా షెడ్యూల్ రూపొందించారు. ఈ రెండో దశలో మొత్తం ఎనిమిది సార్లు ఒకే రోజు రెండు మ్యాచ్‌లు (డబుల్ హెడర్స్) జరగనున్నాయి. మధ్యాహ్నం మ్యాచ్‌లు 3:30 గంటలకు, సాయంత్రం మ్యాచ్‌లు 7:30 గంటలకు ప్రారంభమవుతాయి. పంజాబ్ కింగ్స్ తన హోమ్ మ్యాచ్‌లను న్యూ చండీగఢ్, ధర్మశాలలో ఆడుతుండగా, రాజస్థాన్ రాయల్స్ జైపూర్‌ను తన అడ్డాగా మార్చుకోనుంది.
టాటా ఐపీఎల్ 2026 పూర్తి మ్యాచ్‌ల జాబితా
1. మార్చి 28 (శనివారం): సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – బెంగళూరు (రాత్రి 7:30)
2. మార్చి 29 (ఆదివారం): కోల్‌కతా నైట్ రైడర్స్ vs ముంబై ఇండియన్స్ – ముంబై (రాత్రి 7:30)
3. మార్చి 30 (సోమవారం): చెన్నై సూపర్ కింగ్స్ vs రాజస్థాన్ రాయల్స్ – గువహటి (రాత్రి 7:30)
4. మార్చి 31 (మంగళవారం): గుజరాత్ టైటాన్స్ vs పంజాబ్ కింగ్స్ – న్యూ చండీగఢ్ (రాత్రి 7:30)
5. ఏప్రిల్ 01 (బుధవారం): ఢిల్లీ క్యాపిటల్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ – లక్నో (రాత్రి 7:30)
6. ఏప్రిల్ 02 (గురువారం): సన్‌రైజర్స్ హైదరాబాద్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ – కోల్‌కతా (రాత్రి 7:30)
7. ఏప్రిల్ 03 (శుక్రవారం): పంజాబ్ కింగ్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ – చెన్నై (రాత్రి 7:30)
8. ఏప్రిల్ 04 (శనివారం): ముంబై ఇండియన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ – ఢిల్లీ (మధ్యాహ్నం 3:30)
9. ఏప్రిల్ 04 (శనివారం): రాజస్థాన్ రాయల్స్ vs గుజరాత్ టైటాన్స్ – అహ్మదాబాద్ (రాత్రి 7:30)
10. ఏప్రిల్ 05 (ఆదివారం): లక్నో సూపర్ జెయింట్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ – హైదరాబాద్ (మధ్యాహ్నం 3:30)
11. ఏప్రిల్ 05 (ఆదివారం): చెన్నై సూపర్ కింగ్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – బెంగళూరు (రాత్రి 7:30)
12. ఏప్రిల్ 06 (సోమవారం): పంజాబ్ కింగ్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ – కోల్‌కతా (రాత్రి 7:30)
13. ఏప్రిల్ 07 (మంగళవారం): ముంబై ఇండియన్స్ vs రాజస్థాన్ రాయల్స్ – గువహటి (రాత్రి 7:30)
14. ఏప్రిల్ 08 (బుధవారం): గుజరాత్ టైటాన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ – ఢిల్లీ (రాత్రి 7:30)
15. ఏప్రిల్ 09 (గురువారం): లక్నో సూపర్ జెయింట్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ – కోల్‌కతా (రాత్రి 7:30)
16. ఏప్రిల్ 10 (శుక్రవారం): రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs రాజస్థాన్ రాయల్స్ – గువహటి (రాత్రి 7:30)
17. ఏప్రిల్ 11 (శనివారం): సన్‌రైజర్స్ హైదరాబాద్ vs పంజాబ్ కింగ్స్ – న్యూ చండీగఢ్ (మధ్యాహ్నం 3:30)
18. ఏప్రిల్ 11 (శనివారం): ఢిల్లీ క్యాపిటల్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ – చెన్నై (రాత్రి 7:30)
19. ఏప్రిల్ 12 (ఆదివారం): గుజరాత్ టైటాన్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ – లక్నో (మధ్యాహ్నం 3:30)
20. ఏప్రిల్ 12 (ఆదివారం): రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ముంబై ఇండియన్స్ – ముంబై (రాత్రి 7:30)
21. ఏప్రిల్ 13 (సోమవారం): రాజస్థాన్ రాయల్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ – హైదరాబాద్ (రాత్రి 7:30)
22. ఏప్రిల్ 14 (మంగళవారం): కోల్‌కతా నైట్ రైడర్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ – చెన్నై (రాత్రి 7:30)
23. ఏప్రిల్ 15 (బుధవారం): లక్నో సూపర్ జెయింట్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – బెంగళూరు (రాత్రి 7:30)
24. ఏప్రిల్ 16 (గురువారం): పంజాబ్ కింగ్స్ vs ముంబై ఇండియన్స్ – ముంబై (రాత్రి 7:30)
25. ఏప్రిల్ 17 (శుక్రవారం): కోల్‌కతా నైట్ రైడర్స్ vs గుజరాత్ టైటాన్స్ – అహ్మదాబాద్ (రాత్రి 7:30)
26. ఏప్రిల్ 18 (శనివారం): ఢిల్లీ క్యాపిటల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – బెంగళూరు (మధ్యాహ్నం 3:30)
27. ఏప్రిల్ 18 (శనివారం): చెన్నై సూపర్ కింగ్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ – హైదరాబాద్ (రాత్రి 7:30)
28. ఏప్రిల్ 19 (ఆదివారం): రాజస్థాన్ రాయల్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ – కోల్‌కతా (మధ్యాహ్నం 3:30)
29. ఏప్రిల్ 19 (ఆదివారం): లక్నో సూపర్ జెయింట్స్ vs పంజాబ్ కింగ్స్ – న్యూ చండీగఢ్ (రాత్రి 7:30)
30. ఏప్రిల్ 20 (సోమవారం): ముంబై ఇండియన్స్ vs గుజరాత్ టైటాన్స్ – అహ్మదాబాద్ (రాత్రి 7:30)
31. ఏప్రిల్ 21 (మంగళవారం): ఢిల్లీ క్యాపిటల్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ – హైదరాబాద్ (రాత్రి 7:30)
32. ఏప్రిల్ 22 (బుధవారం): రాజస్థాన్ రాయల్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ – లక్నో (రాత్రి 7:30)
33. ఏప్రిల్ 23 (గురువారం): చెన్నై సూపర్ కింగ్స్ vs ముంబై ఇండియన్స్ – ముంబై (రాత్రి 7:30)
34. ఏప్రిల్ 24 (శుక్రవారం): గుజరాత్ టైటాన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – బెంగళూరు (రాత్రి 7:30)
35. ఏప్రిల్ 25 (శనివారం): పంజాబ్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ – ఢిల్లీ (మధ్యాహ్నం 3:30)
36. ఏప్రిల్ 25 (శనివారం): సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాజస్థాన్ రాయల్స్ – జైపూర్ (రాత్రి 7:30)
37. ఏప్రిల్ 26 (ఆదివారం): చెన్నై సూపర్ కింగ్స్ vs గుజరాత్ టైటాన్స్ – అహ్మదాబాద్ (మధ్యాహ్నం 3:30)
38. ఏప్రిల్ 26 (ఆదివారం): కోల్‌కతా నైట్ రైడర్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ – లక్నో (రాత్రి 7:30)
39. ఏప్రిల్ 27 (సోమవారం): రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ఢిల్లీ క్యాపిటల్స్ – ఢిల్లీ (రాత్రి 7:30)
40. ఏప్రిల్ 28 (మంగళవారం): రాజస్థాన్ రాయల్స్ vs పంజాబ్ కింగ్స్ – న్యూ చండీగఢ్ (రాత్రి 7:30)
41. ఏప్రిల్ 29 (బుధవారం): సన్‌రైజర్స్ హైదరాబాద్ vs ముంబై ఇండియన్స్ – ముంబై (రాత్రి 7:30)
42. ఏప్రిల్ 30 (గురువారం): రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs గుజరాత్ టైటాన్స్ – అహ్మదాబాద్ (రాత్రి 7:30)
43. మే 01 (శుక్రవారం): ఢిల్లీ క్యాపిటల్స్ vs రాజస్థాన్ రాయల్స్ – జైపూర్ (రాత్రి 7:30)
44. మే 02 (శనివారం): ముంబై ఇండియన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ – చెన్నై (రాత్రి 7:30)
45. మే 03 (ఆదివారం): కోల్‌కతా నైట్ రైడర్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ – హైదరాబాద్ (మధ్యాహ్నం 3:30)
46. మే 03 (ఆదివారం): పంజాబ్ కింగ్స్ vs గుజరాత్ టైటాన్స్ – అహ్మదాబాద్ (రాత్రి 7:30)
47. మే 04 (సోమవారం): లక్నో సూపర్ జెయింట్స్ vs ముంబై ఇండియన్స్ – ముంబై (రాత్రి 7:30)
48. మే 05 (మంగళవారం): చెన్నై సూపర్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ – ఢిల్లీ (రాత్రి 7:30)
49. మే 06 (బుధవారం): పంజాబ్ కింగ్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ – హైదరాబాద్ (రాత్రి 7:30)
50. మే 07 (గురువారం): రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs లక్నో సూపర్ జెయింట్స్ – లక్నో (రాత్రి 7:30)
51. మే 08 (శుక్రవారం): కోల్‌కతా నైట్ రైడర్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ – ఢిల్లీ (రాత్రి 7:30)
52. మే 09 (శనివారం): గుజరాత్ టైటాన్స్ vs రాజస్థాన్ రాయల్స్ – జైపూర్ (రాత్రి 7:30)
53. మే 10 (ఆదివారం): లక్నో సూపర్ జెయింట్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ – చెన్నై (మధ్యాహ్నం 3:30)
54. మే 10 (ఆదివారం): ముంబై ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – రాయ్‌పూర్ (రాత్రి 7:30)
55. మే 11 (సోమవారం): ఢిల్లీ క్యాపిటల్స్ vs పంజాబ్ కింగ్స్ – ధర్మశాల (రాత్రి 7:30)
56. మే 12 (మంగళవారం): సన్‌రైజర్స్ హైదరాబాద్ vs గుజరాత్ టైటాన్స్ – అహ్మదాబాద్ (రాత్రి 7:30)
57. మే 13 (బుధవారం): కోల్‌కతా నైట్ రైడర్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – రాయ్‌పూర్ (రాత్రి 7:30)
58. మే 14 (గురువారం): ముంబై ఇండియన్స్ vs పంజాబ్ కింగ్స్ – ధర్మశాల (రాత్రి 7:30)
59. మే 15 (శుక్రవారం): చెన్నై సూపర్ కింగ్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ – లక్నో (రాత్రి 7:30)
60. మే 16 (శనివారం): గుజరాత్ టైటాన్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ – కోల్‌కతా (రాత్రి 7:30)
61. మే 17 (ఆదివారం): రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs పంజాబ్ కింగ్స్ – ధర్మశాల (మధ్యాహ్నం 3:30)
62. మే 17 (ఆదివారం): రాజస్థాన్ రాయల్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ – ఢిల్లీ (రాత్రి 7:30)
63. మే 18 (సోమవారం): సన్‌రైజర్స్ హైదరాబాద్ vs చెన్నై సూపర్ కింగ్స్ – చెన్నై (రాత్రి 7:30)
64. మే 19 (మంగళవారం): లక్నో సూపర్ జెయింట్స్ vs రాజస్థాన్ రాయల్స్ – జైపూర్ (రాత్రి 7:30)
65. మే 20 (బుధవారం): ముంబై ఇండియన్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ – కోల్‌కతా (రాత్రి 7:30)
66. మే 21 (గురువారం): గుజరాత్ టైటాన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ – చెన్నై (రాత్రి 7:30)
67. మే 22 (శుక్రవారం): రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs సన్‌రైజర్స్ హైదరాబాద్ – హైదరాబాద్ (రాత్రి 7:30)
68. మే 23 (శనివారం): పంజాబ్ కింగ్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ – లక్నో (రాత్రి 7:30)
69. మే 24 (ఆదివారం): రాజస్థాన్ రాయల్స్ vs ముంబై ఇండియన్స్ – ముంబై (మధ్యాహ్నం 3:30)
70. మే 24 (ఆదివారం): ఢిల్లీ క్యాపిటల్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ – కోల్‌కతా (రాత్రి 7:30)
గమనిక: ప్లేఆఫ్ మ్యాచ్‌ల వేదికలు, షెడ్యూల్‌ను బోర్డు త్వరలోనే ప్రకటిస్తుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..