ICC ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చే ఏడాది అంటే ఫిబ్రవరి, మార్చి నెలల్లో పాకిస్థాన్ వేదికగా జరుగనుంది. ఈ ఐసీసీ ఈవెంట్‌లో పాల్గొనేందుకు టీమ్ ఇండియా పాకిస్థాన్ వెళ్తుందా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే టీమ్ ఇండియాను పాకిస్థాన్ పంపేందుకు భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. మరోవైపు టీమ్ ఇండియాను పాకిస్థాన్‌కు ఆహ్వానించే బాధ్యతను పీసీబీ, ఐసీసీ భుజాలకెత్తుకున్నాయి. దీంతో త్వరలో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీపై క్రికెట్ ప్రేమికుల్లో ఆసక్తి నెలకొంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. అయితే దీనిపై బీసీసీఐ కార్యదర్శి జై షా స్పందించారు. టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయంపై ఒక ప్రకటన చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు టీమిండియా పాకిస్థాన్ వెళ్తుందా లేదా అనే ప్రశ్నకు ‘దీనిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. టోర్నీ దగ్గర పడ్డాక నిర్ణయం తీసుకుంటాం’ అని జైషా చెప్పుకొచ్చారు.
ఐసిసికి పాకిస్తాన్ సమర్పించిన ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ ప్రకారం, టోర్నమెంట్ ఫిబ్రవరి 19, 2025 నుండి మార్చి 9, 2025 వరకు జరగాల్సి ఉంది. కాగా, ఈ టోర్నీలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ మార్చి 1న జరగాల్సి ఉంది. కానీ పాకిస్థాన్ ఐసీసీకి సమర్పించిన ముసాయిదా షెడ్యూల్‌ను ఐసీసీ ఇప్పటి వరకు ఆమోదించలేదు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో మొత్తం 8 జట్లు పాల్గొంటాయి. ఇందులో భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్ జట్లు ఉన్నాయి. ఈ జట్లను 2 గ్రూపులుగా విభజించారు. మొదటి గ్రూపులో భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్ , బంగ్లాదేశ్ ఉండగా.. రెండో గ్రూపులో ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఉన్నాయి.
Jay Shah, the secretary of Board of Control for Cricket in India (BCCI), said that no decision has been made so far regarding Indian team’s visit to Pakistan to play Champions Trophy 2025. “No stand as of now. We will cross the bridge when it comes,” he was quoted as saying… pic.twitter.com/SaKJo54NbP
— The Frontier Voice (@thefrontiervoic) August 15, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..