డోలాయమానం… రవిశాస్త్రి భవితవ్యం!

| Edited By: Pardhasaradhi Peri

Jul 16, 2019 | 4:52 PM

ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ పోటీల్లో భారత క్రికెట్ జట్టు సెమీ ఫైనల్ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు చేతిలో 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే, భారత క్రికెట్ జట్టు కోచ్‌గా రవిశాస్త్రి కాంట్రాక్టు కూడా వరల్డ్ కప్‌తోనే ముగిసింది. కానీ, వెస్టిండీస్ పర్యటన వరకు 45 రోజుల పాటు పదవీకాలం పొడిగించారు. ఆ తర్వాత కొత్త కోచ్‌ను బీసీసీఐ ఎంపిక చేయనుంది. ఆసక్తి గలవారు జూలై 30 […]

డోలాయమానం... రవిశాస్త్రి భవితవ్యం!
Follow us on

ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ పోటీల్లో భారత క్రికెట్ జట్టు సెమీ ఫైనల్ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు చేతిలో 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే, భారత క్రికెట్ జట్టు కోచ్‌గా రవిశాస్త్రి కాంట్రాక్టు కూడా వరల్డ్ కప్‌తోనే ముగిసింది. కానీ, వెస్టిండీస్ పర్యటన వరకు 45 రోజుల పాటు పదవీకాలం పొడిగించారు. ఆ తర్వాత కొత్త కోచ్‌ను బీసీసీఐ ఎంపిక చేయనుంది. ఆసక్తి గలవారు జూలై 30 లోగా తమ అభ్యర్థనలను పంపవచ్చని బీసీసీఐ పేర్కొంది.

కాగా… వరల్డ్ కప్ లో భారత్ వైఫల్యం తరువాత, రవిశాస్త్రికి మరోమారు పదవీకాలం పొడిగింపు ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. రవిశాస్త్రితో పాటు బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌, బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ లతో పాటు, ఫీల్డింగ్‌ కోచ్‌ శ్రీధర్‌ ల స్థానంలోనూ కొత్తవారు రానున్నారు. వరల్డ్‌ కప్‌ వైఫల్యం తరువాత జట్టు ఫిజియో ప్యాట్రిక్‌ ఫర్హాత్‌, ట్రైనర్‌ శంకర్‌ బసులు ఇప్పటికే తమ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. వెస్టిండీస్ పర్యటన తరువాత, సెప్టెంబరు 15 నుంచి స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగే పోటీల సమయానికి కొత్త కోచ్, అతని సహాయకుల ఎంపిక పూర్తి చేయాలని బీసీసీఐ భావిస్తోంది.