ఐపీఎల్ కంటే డబుల్ మజాకు ప్లాన్ చేసిన బీసీసీఐ.. టీమిండియా షెడ్యూల్‌లో కీలక మార్పు.. అదేంటంటే?

BCCI Team India Schedule: ఐపీఎల్ 2026 ఉత్కంఠభరిత సమరం ముగిసిన వెంటనే భారత క్రికెట్ జట్టు మళ్లీ అంతర్జాతీయ మ్యాచ్‌లతో బిజీ కానుంది. టీమిండియా భవిష్యత్తు సిరీస్‌లపై స్పష్టతనిస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సరికొత్త ప్రణాళికను సిద్ధం చేసింది. జూన్ నెలలోనే ఆఫ్ఘనిస్తాన్‌తో సిరీస్ ప్రారంభం కానుండగా, ఆగస్టులో శ్రీలంకతో కీలక టెస్టు సిరీస్‌కు రంగం సిద్ధమైంది.

ఐపీఎల్ కంటే డబుల్ మజాకు ప్లాన్ చేసిన బీసీసీఐ.. టీమిండియా షెడ్యూల్‌లో కీలక మార్పు.. అదేంటంటే?
Team India Schedule

Updated on: May 18, 2026 | 5:39 PM

BCCI Team India Schedule: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐపీఎల్ జోష్ నడుస్తోంది. మే ఆఖరి నాటికి ఈ ధనాధన్ లీగ్ ముగియనుంది. అయితే, క్రికెట్ అభిమానులకు విరామం లేకుండా చేసేందుకు బోర్డు పక్కా ప్లాన్ వేసింది. ఐపీఎల్ ముగిసిన వెంటనే జూన్ మొదటి వారంలోనే టీమిండియా అంతర్జాతీయ క్రికెట్ బరిలోకి దిగనుంది. ఇందులో భాగంగా అఫ్గానిస్తాన్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో రెండు జట్ల మధ్య ఒక ఏకైక టెస్టు మ్యాచ్‌తో పాటు మూడు వన్డేల సిరీస్ జరగనుంది.

జూన్ 6 నుంచి 10 వరకు మొహాలీ సమీపంలోని ముల్లాన్‌పూర్ వేదికగా ఏకైక టెస్టు మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత జూన్ 14 నుంచి 20 వరకు ధర్మశాల, లక్నో, చెన్నై వేదికలుగా మూడు వన్డే మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఐపీఎల్‌లో అలసిపోయిన కొందరు సీనియర్ ఆటగాళ్లకు ఈ సిరీస్‌లో విశ్రాంతినిచ్చే అవకాశముంది.

ఆగస్టులో లంకతో అసలు సమరం.. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పోరు..!

అఫ్గానిస్తాన్ సిరీస్ తర్వాత భారత జట్టు జింబాబ్వే, ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు వెళ్లనుంది. ఆ సుదీర్ఘ పర్యటనలు ముగిసిన వెంటనే, ఆగస్టు నెలలో శ్రీలంకతో టెస్టు సిరీస్ షెడ్యూల్ ఖరారైంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) పట్టికలో టాప్ స్థానమే లక్ష్యంగా భారత్ ఈ సిరీస్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోనుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: ఇది కదా ట్విస్ట్ అంటే.. SRH గెలిస్తే ప్లేఆఫ్స్‌కు 2 జట్లు.. కాటేరమ్మ కొడుకులతో అట్లుంటది మరి..!

బీసీసీఐ, శ్రీలంక క్రికెట్ బోర్డు అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం, ఆగస్టు 15 నుంచి 29 మధ్య ఈ రెండు టెస్టుల సిరీస్ జరగవచ్చని తెలుస్తోంది. ఈ రెండు మ్యాచ్‌లు లంక గడ్డపైనే జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్, వేదికల వివరాలను మరికొద్ది రోజుల్లోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

యువ ఆటగాళ్లకు బంపర్ ఆఫర్.. సెలక్టర్ల కసరత్తు..!

సుదీర్ఘమైన ఐపీఎల్ సీజన్ తర్వాత జరగబోయే సిరీస్ కావడంతో, టీమిండియా సెలక్షన్ కమిటీ సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్తోంది. జూన్ 19న జరిగే సెలక్షన్ కమిటీ సమావేశంలో అఫ్గాన్ సిరీస్‌కు సంబంధించిన వన్డే, టెస్ట్ జట్లను ప్రకటించనున్నారు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ వంటి సీనియర్ బౌలర్లకు విశ్రాంతినిచ్చి, ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించిన యువ పేసర్ ప్రిన్స్ యాదవ్ వంటి నయా సంచలనాలకు ఈ సిరీస్ ద్వారా భారత జట్టులో చోటు కల్పించాలని సెలక్టర్లు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: MS Dhoni: చెన్నై ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. ఐపీఎల్ రిటైర్మెంట్‌పై ధోనీ కీలక సంకేతాలు..!

సరికొత్త కుర్రాళ్లతో అఫ్గాన్‌ను ఢీకొట్టడం, ఆపై ఇంగ్లాండ్ పర్యటన ముగించుకుని ఆగస్టులో లంకతో డబ్ల్యూటీసీ పోరుకు సిద్ధమవ్వడం చూస్తుంటే టీమిండియాకు రాబోయే రోజులు కత్తిమీద సామే అని చెప్పాలి. ఏదేమైనా ఐపీఎల్ వినోదం ముగిసినా, అంతకు మించిన అససలైన అంతర్జాతీయ క్రికెట్ మజాను ఆస్వాదించడానికి భారత క్రికెట్ అభిమానులు సిద్ధంగా ఉండవచ్చు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us