IND vs SA: సౌతాఫ్రికా పర్యటనకు టీమిండియా స్వ్కాడ్.. 3 ఫార్మాట్లలో భాగమైన ఆ ఇద్దరు.. ఎప్పటినుంచంటే?

Team India Squad for South Africa multi-format Series: బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా గురువారం దక్షిణాఫ్రికాతో ఆల్-ఫార్మాట్ సిరీస్ మ్యాచ్‌ల కోసం భారత మహిళల జట్టును ప్రకటించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ మూడు ఫార్మాట్లలో టీమ్ ఇండియాకు నాయకత్వం వహిస్తుంది. స్మృతి మంధాన డిప్యూటీగా ఉంటుంది. జెమిమా రోడ్రిగ్స్, ఫాస్ట్ బౌలర్ పూజా వస్త్రాకర్ టీమ్ ఇండియా మూడు స్క్వాడ్‌లలో భాగంగా ఉన్నారు.

IND vs SA: సౌతాఫ్రికా పర్యటనకు టీమిండియా స్వ్కాడ్.. 3 ఫార్మాట్లలో భాగమైన ఆ ఇద్దరు.. ఎప్పటినుంచంటే?
Indw Vs Saw

Updated on: May 31, 2024 | 8:41 AM

Team India Squad for South Africa multi-format Series: బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా గురువారం దక్షిణాఫ్రికాతో ఆల్-ఫార్మాట్ సిరీస్ మ్యాచ్‌ల కోసం భారత మహిళల జట్టును ప్రకటించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ మూడు ఫార్మాట్లలో టీమ్ ఇండియాకు నాయకత్వం వహిస్తుంది. స్మృతి మంధాన డిప్యూటీగా ఉంటుంది. జెమిమా రోడ్రిగ్స్, ఫాస్ట్ బౌలర్ పూజా వస్త్రాకర్ టీమ్ ఇండియా మూడు స్క్వాడ్‌లలో భాగంగా ఉన్నారు. అయితే వీరిద్దరి ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ దక్షిణాఫ్రికా పర్యటన మూడు మ్యాచ్‌ల ODI సిరీస్‌తో ప్రారంభమవుతుంది, ఆ తర్వాత రెండు జట్ల మధ్య ఒక టెస్ట్ మ్యాచ్ కూడా జరుగుతుంది. ఈ పర్యటన మూడు మ్యాచ్‌ల T20 సిరీస్‌తో ముగుస్తుంది.

వన్డే సిరీస్‌కు ముందు, జూన్ 13న బెంగళూరులో బోర్డ్ ప్రెసిడెంట్స్ ఎలెవన్‌తో విజిటింగ్ టీమ్ వార్మప్ మ్యాచ్ ఆడనుంది. బెంగళూరు వేదికగా వన్డే సిరీస్‌ జరగనుంది. అదే సమయంలో చెన్నైలో ఏకైక టెస్టు, టీ20 సిరీస్‌లు జరగనున్నాయి.

ఏడు నెలల తర్వాత భారత మహిళల జట్టు టెస్టు మ్యాచ్ ఆడనుంది. అంతకుముందు, హర్మన్‌ప్రీత్ కౌర్ సేన గత ఏడాది డిసెంబర్‌లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియాతో 1-1 టెస్ట్ మ్యాచ్ ఆడింది. టీం ఇండియా అద్భుత ప్రదర్శన చేసి రెండు మ్యాచ్‌లను గెలుచుకుంది.

వన్డే సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లు 2022-2025 ICC మహిళల ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఉన్నాయి. ఆతిథ్య భారత్‌తో పాటు ఛాంపియన్‌షిప్‌లోని టాప్ 5 జట్లు ICC మహిళల క్రికెట్ ప్రపంచ కప్ 2025కి నేరుగా అర్హత సాధిస్తాయి.

దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ కోసం భారత వన్డే జట్టు:

హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్*, రిచా ఘోష్ (కీపర్), ఉమా ఛెత్రి (కీపర్), దయాళన్ హేమలత, రాధా యాదవ్, ఆశా శోభన, శ్రేయాంక పాటిల్, సైకా ఇషాక్ , పూజా వస్త్రాకర్*, రేణుకా సింగ్ ఠాకూర్, అరుంధతి రెడ్డి, ప్రియా పునియా

దక్షిణాఫ్రికాతో ఏకైక టెస్టుకు భారత జట్టు:

హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, శుభా సతీష్, జెమిమా రోడ్రిగ్స్*, రిచా ఘోష్ (కీపర్), ఉమా ఛెత్రి (కీపర్), దీప్తి శర్మ, స్నేహ రాణా, సైకా ఇషాక్, రాజేశ్వరి గైక్వాడ్, పూజా వస్త్రాకర్ *, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, మేఘనా సింగ్, ప్రియా పునియా

దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు భారత జట్టు:

హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (విసి), షఫాలీ వర్మ, దయాళన్ హేమలత, ఉమా ఛెత్రి (కీపర్), రిచా ఘోష్ (కీపర్), జెమీమా రోడ్రిగ్స్*, సజ్నా సజీవన్, దీప్తి శర్మ, శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్, అమంజోత్, ఆశా శోభన, పూజా వస్త్రాకర్*, రేణుకా సింగ్ ఠాకూర్, అరుంధతి రెడ్డి

స్టాండ్‌బై: సైకా ఇషాక్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..