బీసీసీఐ కొత్త కాంట్రాక్ట్‌ల ప్రకటన..! గ్రేడ్‌ ‘ఎ’ ప్లస్‌లో ముగ్గురు మాత్రమే.. ఎవరెవరంటే..?

BCCI Annual Player Contracts : బీసీసీఐ (Board of Control for Cricket in India) 2020-21 సీజన్‌కి ఆటగాళ్ల కొత్త కాంట్రాక్ట్‌లను ప్రకటించింది. గత కాంట్రాక్ట్‌ సెప్టెంబరు 30తో ముగియగా తాజా

బీసీసీఐ కొత్త కాంట్రాక్ట్‌ల ప్రకటన..! గ్రేడ్‌ 'ఎ' ప్లస్‌లో ముగ్గురు మాత్రమే.. ఎవరెవరంటే..?
Follow us
uppula Raju

|

Updated on: Apr 16, 2021 | 9:07 AM

BCCI Annual Player Contracts : బీసీసీఐ (Board of Control for Cricket in India) 2020-21 సీజన్‌కి ఆటగాళ్ల కొత్త కాంట్రాక్ట్‌లను ప్రకటించింది. గత కాంట్రాక్ట్‌ సెప్టెంబరు 30తో ముగియగా తాజా కాంట్రాక్ట్‌ 2020 అక్టోబరు నుంచి 2021 సెప్టెంబరు వరకు ఉంటుంది. ఈ జాబితాలో కొంతమంది ఆటగాళ్లకు నిరాశ చెందినా మరికొంతమంది కొత్తగా చేరారు. ఆ వివరాలేంటో తెలుసుకుందాం. వరుసగా మూడో ఏడాది భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, భారత వన్డే జట్టు వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్టార్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా గ్రేడ్‌ ‘ఎ’ ప్లస్‌’లో తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. ఈ ముగ్గురికి ఏడాది కాలానికి రూ. 7 కోట్లు చొప్పున చెల్లిస్తారు. ఈసారి మొత్తం 28 మంది ఆటగాళ్లతో బీసీసీఐ కాంట్రాక్ట్‌ జాబితాను రూపొందించింది.

హైదరాబాద్‌ పేస్‌ బౌలర్‌ మొహమ్మద్‌ సిరాజ్, పంజాబ్‌ బ్యాట్స్‌మన్‌ శుబ్‌మన్‌ గిల్‌ తొలిసారి కాంట్రాక్ట్‌లను అందుకున్నారు. వీరిద్దరికి గ్రేడ్‌ ‘సి’ లో చోటు కల్పించారు. వీరిద్దరికి రూ. కోటి చొప్పు న కాంట్రాక్ట్‌ మొత్తం లభిస్తుంది. 2017–2018 తర్వాత స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ (గుజరాత్‌) మళ్లీ కాంట్రాక్ట్‌ జాబితాలో చోటు సంపాదించాడు. అక్షర్‌ పటేల్‌కు గ్రేడ్‌ ‘సి’లో స్థానం ఇచ్చారు. గాయాల బారిన పడ్డ భువనేశ్వర్‌ కుమార్‌ గ్రేడ్‌ ‘ఎ’ నుంచి ‘బి’కి పడిపోయాడు. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాకు గ్రేడ్‌ ‘బి’ నుంచి ‘ఎ’కు… పేస్‌ బౌలర్‌ శార్దుల్‌ ఠాకూర్‌కు గ్రేడ్‌ ‘సి’ నుంచి ‘బి’కి ప్రమోషన్‌ లభించింది. గత ఏడాది గ్రేడ్‌ ‘సి’ కాంట్రాక్ట్‌ పొందిన కేదార్‌ జాదవ్‌ (మహారాష్ట్ర), మనీశ్‌ పాండే (కర్ణాటక) ఈసారి మొండిచేయి లభించింది. వీరిద్దరూ తమ కాంట్రాక్ట్‌లను కోల్పోయారు.

గ్రేడ్‌ ‘ఎ’ ప్లస్‌ (రూ. 7 కోట్లు) విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, జస్‌ప్రీత్‌ బుమ్రా. గ్రేడ్‌ ‘ఎ’ (రూ. 5 కోట్లు) రవిచంద్రన్‌ అశ్విన్, రవీంద్ర జడేజా, చతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానే, శిఖర్‌ ధావన్, కేఎల్‌ రాహుల్, మొహమ్మద్‌ షమీ, ఇషాంత్‌ శర్మ, రిషభ్‌ పంత్, హార్దిక్‌ పాండ్యా. గ్రేడ్‌ ‘బి’ (రూ. 3 కోట్లు) వృద్ధిమాన్‌ సాహా, ఉమేశ్‌ యాదవ్, భువనేశ్వర్‌ కుమార్, శార్దుల్‌ ఠాకూర్, మయాంక్‌ అగర్వాల్‌.

Viral Video : రిషబ్‌ పంత్ రనౌట్‌.. రియాన్ పరాగ్ బిహు డ్యాన్స్‌..! సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో..

SBI Recruitment 2021: ఎస్‌బీఐలో స్పెషల్ కేడర్ ఆఫీసర్, క్లారికల్ కేడర్ పోస్టుల కోసం దరఖాస్తుల ఆహ్వానం

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!