AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BCCI: ఒకేసారి 5 జట్లు, 69 మంది ఆటగాళ్లు.. బీసీసీఐ సంచలన మాస్టర్ ప్లాన్

BCCI: బీసీసీఐ రాబోయే ఐదు వారాల్లో రికార్డు స్థాయిలో 69 మంది ఆటగాళ్లతో ఐదు వేర్వేరు జట్లను బరిలోకి దించనుంది. ఏషియన్ గేమ్స్, వెస్టిండీస్ సిరీస్, ఇండియా ఏ అలాగే ఇరానీ కప్ మ్యాచ్‌లతో భారత క్రికెట్ షెడ్యూల్ బీజీ బిజీగా మారనుంది. బెంచ్ స్ట్రెంత్‌ను పరీక్షించేందుకు బీసీసీఐ ఈ భారీ ప్రణాళికను రూపొందించింది.

BCCI: ఒకేసారి 5 జట్లు, 69 మంది ఆటగాళ్లు.. బీసీసీఐ సంచలన మాస్టర్ ప్లాన్
Team India
Rakesh
|

Updated on: Sep 18, 2026 | 9:19 AM

Share

BCCI: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) రాబోయే ఐదు వారాల పాటు అత్యంత కీలకమైన ప్రణాళికను అమలు చేసేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 17 వరకు జరిగే ఈ కాలంలో భారత క్రికెట్ జట్టు రికార్డు స్థాయిలో ఒకేసారి ఐదు వేర్వేరు జట్లతో మైదానంలోకి దిగనుంది. ఈ సువర్ణావకాశం ద్వారా కేవలం సీనియర్ ఆటగాళ్లే కాకుండా బెంచ్ స్ట్రెంత్ ఎంత బలంగా ఉందో పరీక్షించుకునేందుకు బీసీసీఐ భారీ కసరత్తు చేస్తోంది.

ఈ ప్రత్యేక షెడ్యూల్ ప్రకారం ఏషియన్ గేమ్స్, జపాన్‌తో టీ20 మ్యాచ్‌లు, వెస్టిండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్, ఆస్ట్రేలియా ఏ జట్టుతో మల్టీ-డే అలాగే పరిమిత ఓవర్ల మ్యాచ్‌లు, ప్రతిష్టాత్మకమైన ఇరానీ కప్ వంటి టోర్నీలు ఒకే సమయంలో జరగనున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 69 మంది టాలెంటెడ్ ఆటగాళ్లకు ఈ ఐదు జట్లలో చోటు దక్కనుంది. దీనివల్ల ప్రతి ఆటగాడికి అంతర్జాతీయ వేదికలపై తమ ప్రతిభను చాటుకోవడానికి, జట్టులో తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికి అద్భుతమైన అవకాశం లభిస్తుంది.

వెస్టిండీస్‌తో జరగనున్న వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి జట్టులోకి రావడం విశేషం. శుభమన్ గిల్ ఈ జట్టుకు నాయకత్వం వహిస్తుండగా, కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. మరోవైపు ఏషియన్ గేమ్స్ అలాగే టీ20 సిరీస్‌ల కోసం శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో యువ జట్టు బరిలోకి దిగనుంది. సంజు శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మతో పాటు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కూడా ఈ జట్టులో స్థానం దక్కించుకోవడం విశేషం.

దేశీయ క్రికెట్‌కు పెద్దపీట వేసేలా రంజీ ఛాంపియన్ జమ్మూ-కశ్మీర్‌తో జరిగే ఇరానీ కప్ మ్యాచ్ కోసం రిషబ్ పంత్ సారథ్యంలో రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు సిద్ధమైంది. అలాగే ఆస్ట్రేలియా ఏ జట్టుతో జరిగే మ్యాచ్‌ల కోసం దేవదత్ ఫడిక్కల్, సాయి సుదర్శన్ నేతృత్వంలో ఇండియా ఏ జట్లను ప్రకటించారు. ఈ ప్రణాళిక ద్వారా భారత క్రికెట్ భవిష్యత్తు కోసం అగ్రశ్రేణి ఆటగాళ్ల బెంచ్ స్ట్రెంత్ మరింత పటిష్టం కానుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

వివిధ జట్ల వివరాలు:

వెస్టిండీస్ వన్డే జట్టు: శుభమన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ కృష్ణ, గురనూర్ బరార్, మొహమ్మద్ సిరాజ్, ఆకిబ్ నబి, యశస్వి జైస్వాల్, నమన్ ధీర్.

వెస్టిండీస్ టీ20 జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, తిలక్ వర్మ, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, నితీష్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్.

ఇరానీ కప్ (రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు): రిషబ్ పంత్ (కెప్టెన్), సనత్ సాంగ్వాన్, శిఖర్ మోహన్, సుదీప్ ఘరామి, సర్ఫరాజ్ ఖాన్, స్మరణ్ రవిచంద్రన్, మానవ్ సుతార్, సారాంశ్ జైన్, ఆకాష్ దీప్, ముకేష్ కుమార్, ముకేష్ చౌదరి, ఆర్యన్ జుయల్, ఆర్యన్ పాండే, అనుకుల్ రాయ్, ఆయుష్ డోసేజ్.

ఇండియా ఏ (టీ20 జట్టు): అమన్ మోఖడే, ఆయుష్ పాండే, దేవదత్ ఫడిక్కల్, సాయి సుదర్శన్, యశ్ రాథోడ్, షేక్ రషీద్, కుమార్ కుషాగ్రహ్, శమ్స్ ములానీ, తనుష్ కొటియన్, తుషార్ దేశ్‌పాండే, అన్షుల్ కాంబోజ్, ప్రఫుల్ల హింగే, ఎన్ జగదీశన్, నచికేత్ భూటే, వి వైశాఖ్.

ఇండియా ఏ (వన్డే జట్టు): ప్రియాన్ష్ ఆర్య, సాయి సుదర్శన్, దేవదత్ ఫడిక్కల్(వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రజత్ పాటిదార్, కుమార్ కుషాగ్రహ్, నిషాత్ సింధు, విప్రజ్ నిగమ్, అర్షిన్ కులకర్ణి, అర్షద్ ఖాన్, నమన్ ధీర్, హార్దిక్ పాండ్యా, ప్రభసిమ్రన్ సింగ్, గుర్జాపనీత్ సింగ్, యశ్ ఠాకూర్.

Follow Us