Video: ఎవడ్రా సామీ నువ్వు.. ఒక చేతిలో 2 బీర్ క్యాన్స్.. మరో చేతితో కళ్లు చెదిరే క్యాచ్.. వావ్ అనాల్సిందే.!

One handed Catch Viral Video: ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియోను బిగ్ బాష్ లీగ్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేయడంతో అది కాసేపట్లోనే వైరల్‌గా మారింది. కామెంటేటర్లు సైతం ఈ ఫీట్‌ను చూసి నోరెళ్లబెట్టారు. "వన్ హ్యాండ్.. టూ క్యాన్స్.. క్లాసిక్ ఆస్ట్రేలియన్ క్యాచ్!" అంటూ ప్రశంసల జల్లు కురిపించారు. నెటిజన్లు అతడిని 'ఇన్‌స్టాగ్రామ్ స్టార్' అని, 'ఈ సీజన్ బెస్ట్ కౌడ్ క్యాచ్' అని కామెంట్స్ చేస్తున్నారు.

Video: ఎవడ్రా సామీ నువ్వు.. ఒక చేతిలో 2 బీర్ క్యాన్స్.. మరో చేతితో కళ్లు చెదిరే క్యాచ్.. వావ్ అనాల్సిందే.!
One Handed Catch

Updated on: Jan 07, 2026 | 11:14 AM

క్రికెట్ మైదానంలో ఆటగాళ్లు పట్టే క్యాచ్‌లు అప్పుడప్పుడు ఆశ్చర్యపరుస్తాయి. కానీ, స్టేడియంలో కూర్చున్న ఒక అభిమాని ఏకంగా ఒక చేత్తో రెండు బీర్ క్యాన్లను పట్టుకుని, మరో చేత్తో మెరుపు వేగంతో వచ్చే బంతిని ఒడిసిపట్టుకుంటే.? అవును, బిగ్ బాష్ లీగ్ (BBL)లో సరిగ్గా ఇదే జరిగింది. సిడ్నీ థండర్ వర్సెస్ అడిలైడ్ స్ట్రైకర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక అభిమాని పట్టిన ఈ క్యాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.

ఆస్ట్రేలియాలో జరుగుతున్న ప్రతిష్టాత్మక టీ20 టోర్నీ ‘బిగ్ బాష్ లీగ్’ (BBL) ఎప్పుడూ వినోదానికి కేరాఫ్ అడ్రస్‌గా ఉంటుంది. మైదానంలో ఆటగాళ్ల ప్రదర్శన ఎంత బాగుంటుందో, స్టాండ్స్‌లో ఉండే అభిమానుల ఉత్సాహం కూడా అంతే స్థాయిలో ఉంటుంది. తాజాగా అడిలైడ్ ఓవల్ వేదికగా అడిలైడ్ స్ట్రైకర్స్ వర్సెస్ సిడ్నీ థండర్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఒక అరుదైన దృశ్యానికి వేదికైంది.

ఇవి కూడా చదవండి

అసలేం జరిగిందంటే..?

సిడ్నీ థండర్ ఇన్నింగ్స్ 13వ ఓవర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆస్ట్రేలియా బ్యాటర్ నిక్ మాడిన్సన్ ఒక అద్భుతమైన పుల్ షాట్ ఆడాడు. బంతి గాలిలోకి లేచి డీప్ స్క్వేర్ లెగ్ వైపు వేగంగా దూసుకెళ్లి స్టాండ్స్‌లో పడింది. అక్కడ కూర్చున్న ఒక యువ అభిమాని ఆ బంతిని చూసి అప్రమత్తమయ్యాడు. విశేషం ఏమిటంటే, ఆ సమయంలో అతని ఎడమ చేతిలో రెండు బీర్ క్యాన్లు ఉన్నాయి.

కానీ, ఆ అభిమాని ఏమాత్రం తడబడలేదు. తన చేతిలో ఉన్న బీర్‌ను కింద పడేయకుండా, కుడి చేత్తో గాలిలోకి ఎగిరి ఆ బంతిని అద్భుతంగా ఒడిసిపట్టుకున్నాడు. క్యాచ్ పట్టిన తర్వాత కూడా అతను తన చేతిలో ఉన్న బీర్ ను చిందించకుండా చాలా సాధారణంగా సెలబ్రేట్ చేసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. అడిలైడ్ స్ట్రైకర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 165 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో సిడ్నీ థండర్ చివరి వరకు పోరాడినా 6 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. డేవిడ్ వార్నర్ (57*) ఒంటరి పోరాటం చేసినా జట్టును గెలిపించలేకపోయాడు. మ్యాచ్‌లో అడిలైడ్ గెలిచినప్పటికీ, స్టాండ్స్‌లో ఆ అభిమాని పట్టిన క్యాచ్ మాత్రం అందరి మనసు గెలుచుకుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..