BBL 2023: విరాట్ వికెట్‌తో వెలుగులోకి.. 17 సిక్సర్లు.. 45 ఫోర్లు.. 460 పరుగులతో బౌలర్ల ఊచకోత

|

Feb 04, 2023 | 9:08 PM

హోరాహోరీగా జరిగిన బిగ్ బాష్ లీగ్ 2022-23 టైటిల్‌ను పెర్త్ స్కార్చర్స్ గెలుచుకుంది. డిపెండింగ్‌ ఛాంపియన్‌గా ఈ టోర్నీలోకి బరిలోకి దిగిన పెర్త్ అద్భుత ఆటను కనబరిచి టైటిల్‌ను కాపాడుకుంది.

BBL 2023: విరాట్ వికెట్‌తో వెలుగులోకి.. 17 సిక్సర్లు.. 45 ఫోర్లు.. 460 పరుగులతో బౌలర్ల ఊచకోత
Aaron Hardie
Follow us on

హోరాహోరీగా జరిగిన బిగ్ బాష్ లీగ్ 2022-23 టైటిల్‌ను పెర్త్ స్కార్చర్స్ గెలుచుకుంది. డిపెండింగ్‌ ఛాంపియన్‌గా ఈ టోర్నీలోకి బరిలోకి దిగిన పెర్త్ అద్భుత ఆటను కనబరిచి టైటిల్‌ను కాపాడుకుంది. ఫైనల్‌లో పెర్త్‌కు 176 పరుగులు అవసరం కాగా 32 బంతుల్లో 53 పరుగులు చేసి కెప్టెన్ ఆష్టన్ టర్నర్ చేసి తన జట్టును గెలిపించాడు. అయితే ఈ టోర్నమెంట్ గెలవడంలో మరో కీలక ప్లేయర్‌ ఉన్నాడు అతనే ఆరోన్ హార్డీ. బ్యాట్‌తోనే కాదు బంతితోనూ అద్భుతాలు చేసిన ఈ యంగ్‌ ప్లేయర్‌ తన జట్టును ఛాంపియన్‌గా నిలిచాడు. కాగా విరాట్ కోహ్లీ కారణంగా ఈ యంగ్‌ క్రికెటర్‌ వెలుగులోకి వచ్చాడు. ఆరోన్ హార్డీ 2018లో ప్రాక్టీస్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీతో ఆడాడు. ఆ సమయంలో విరాట్ కెప్టెన్‌గా ఉండగా, టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. అక్కడ జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్‌పై హార్డీ నాలుగు వికెట్లు తీయగా, అందులో విరాట్ కోహ్లీ వికెట్‌ కూడా ఒకటి. అంతే కాదు ఈ మ్యాచ్‌లో హార్డీ అద్భుత హాఫ్ సెంచరీ కూడా చేశాడు.

బిగ్ బాష్ లీగ్‌లో ఆరోన్ హార్డీ అత్యధికంగా 460 పరుగులు చేశాడు. ఈ టోర్నమెంట్‌లో హార్డీ యావరేజ్‌ 41.81 కాగా స్ట్రైక్ రేట్ కూడా 141గా ఉంది. ఈ టోర్నీలో హార్డీ 17 సిక్సర్లు, 45 ఫోర్లు కొట్టాడు. అలాగే తన మీడియం పేస్ బౌలింగ్‌తో 5 వికెట్లు కూడా తీశాడు. తద్వారా ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన పరంగా మూడో స్థానంలో నిలిచాడు. కెప్టెన్ ఆష్టన్ టర్నర్ 381 పరుగులు చేశాడు. కాగా 2017-18 సంవత్సరంలో ఆడిన అండర్-19 ప్రపంచకప్‌లో హార్డీ ఆస్ట్రేలియన్ జట్టులో ఉన్నాడు. అయితే గాయం కారణంగా అతను టోర్నీ మధ్య నుంచి వైదొలగాల్సి వచ్చింది. దీంతో ఈ యువ ఆటగాడికి పెద్ద దెబ్బ తగిలింది. ఆ తర్వాత ఈ టోర్నీ ఫైనల్‌లో భారత్‌తో జరిగిన టైటిల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓడిపోయింది. ఆ భారత జట్టుకు పృథ్వీ షా కెప్టెన్‌గా వ్యవహరించగా, ఆ టోర్నీలో శుభ్‌మన్ గిల్ ప్లేయర్ ఆఫ్ సిరీస్‌గా నిలిచాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..