Team India: గెలుపుకు చివరి బంతి.. అనూహ్యంగా టీమిండియాకు అనుకోని షాక్.. అసలు మ్యాచ్ గెలిచిందా?

|

Jun 11, 2021 | 9:05 AM

ప్రత్యర్ధి జట్టు ఆఖరి బంతికి రెండు పరుగులు చేయాలి. టీమిండియాకు గెలుపు తధ్యం అని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా అప్పుడే...

Team India: గెలుపుకు చివరి బంతి.. అనూహ్యంగా టీమిండియాకు అనుకోని షాక్.. అసలు మ్యాచ్ గెలిచిందా?
India Women Team
Follow us on

ప్రత్యర్ధి జట్టు ఆఖరి బంతికి రెండు పరుగులు చేయాలి. టీమిండియాకు గెలుపు తధ్యం అని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా అప్పుడే అనుకోని షాక్ తగిలింది. కథ అడ్డం తిరిగింది. సస్పెన్స్ సినిమాను తలపించేలా జరిగిన ఈ మ్యాచ్ ఉమెన్స్ టీ20 ఆసియా కప్ టోర్నమెంట్‌లో చోటు చేసుకుంది. సెమీఫైనల్స్‌లో భారత ఉమెన్స్ టీం.. పాకిస్థాన్‌ను ఓడించి ఫైనల్స్ చేరుకోగా.. శ్రీలంకపై అద్భుత విజయాన్ని నమోదు చేసుకుని బంగ్లాదేశ్ ఉమెన్స్ జట్టు ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. ఈ రెండు జట్ల మధ్య 2018 జూన్ 10వ తేదీన ఫైనల్ జరిగింది.

ఫైనల్‌లో మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా 112 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అర్ధ సెంచరీ చేయడంతో జట్టు గౌరవప్రదమైన స్కోర్ చేయడంలో సాధ్యపడింది. ఆమె తప్ప జట్టులోని ఇతర బ్యాట్స్‌మెన్‌లు ఎవరూ కూడా 11 పరుగులు మించి సాధించలేదు. స్టార్ బ్యాట్స్‌మెన్ అయిన మిథాలీ రాజ్, స్మృతి మంధనా కూడా విఫలమయ్యారు.

120 పరుగుల టార్గెట్.. చివరి ఓవర్‌లో నరాలు తెగే ఉత్కంఠ..

బంగ్లాదేశ్ సాధించడానికి ఇది ఈజీ టార్గెటే. కానీ టీమిండియా ఉమెన్స్ జట్టు మాత్రం దాన్ని కష్టతరం చేయడానికి బౌలింగ్, ఫీల్డింగ్‌లో తన ప్రతిభను చూపించింది. మొదటి వికెట్ పడే సమయానికి బంగ్లాదేశ్ 35 పరుగులు జోడించింది. ఆ తర్వాత రెండో వికెట్ కూడా వెంటనే పడిపోవడంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇలా భారత్ కట్టుదిట్టమైన బౌలింగ్‌కు బంగ్లాదేశ్ 15.2 ఓవర్లలో 3 వికెట్లకు 83 పరుగులు చేసింది. అనంతరం మరో రెండు వికెట్లను కూడా తక్కువ పరుగులకే కోల్పోయింది. ఇక చివరి ఓవర్‌కు 9 పరుగులు చేయాల్సి వచ్చింది.

ఇదిలా ఉంటే జట్టు గెలుపు బాధ్యతను సారధి హర్మన్‌ప్రీత్ కౌర్ తన చేతుల్లోకి తీసుకుంది. లాస్ట్ ఓవర్ వేసేందుకు సిద్దమైంది. తొలి బంతికి సింగిల్, రెండో బంతికి ఫోర్, మూడో బంతికి సింగిల్.. అంటే భారత అభిమానుల్లో చిరునవ్వు దూరమైంది. అయితే అనూహ్యంగా హార్మన్‌ప్రీత్.. నాలుగో బంతికి బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ సంజీదా ఇస్లాంను అవుట్ చేయడంతో అభిమానులకు కాస్త ఊరట లభించింది. అయితే అది కూడా ఎంతోసేపు నిలవలేదు. చివరి రెండు బంతులకు 4 పరుగులు రాబట్టడంతో బంగ్లాదేశ్ అద్బుత విజయాన్ని నమోదు చేసింది.

Also Read:

పల్లీలు, బెల్లం కలిపి తింటున్నారా.? అయితే ఈ విషయాలు తెలుసుకోండి..

అక్కడి పండ్లు తిన్నారో బీమారీ గ్యారంటీ.! కొనాలంటేనే భయపడుతున్న ప్రజలు.!!

ఒకే కాన్పులో 10 మందికి జన్మనిచ్చిన మహిళ.? అసలు నిజమెంత.! వెలుగులోకి కొత్త ట్విస్ట్..