Bangladesh vs Australia: బంగ్లాదేశ్‌తో జరిగిన నాలుగో టీ20లో ఆస్ట్రేలియా క్రికెటర్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) ఆల్‌రౌండర్ డానియల్ క్రిస్ట్రియన్ చెలరేగిపోయాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో బంగ్లాదేశ్ టీంను గడగడలాడించాడు. షకీబ్ అల్ హసన్ బౌలింగ్‌ను ఉతికి ఆరేశాడు. ఒకే ఓవర్‌లో 5 సిక్సర్లు బాది దుమ్ము దులిపాడు. అయితే మరో సిక్స్ కొట్టి ఉంటే మాత్రం.. ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు బాదిన యువరాజ్ సింగ్, హెర్షెల్ గిబ్స్, కీరన్ పొలార్డ్, సోబెర్స్ సరసన చేరేవాడు. ఈ అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నాడు. క్రిస్ట్రియన్(15 బంతుల్లో 39; ఫోర్, 5 సిక్సర్లు) అద్భుత బ్యాటింగ్‌తో నాలుగో టీ20 ఆసీస్ 3 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. మూడవ టీ20లో తడబడిన డానియల్ క్రిస్టియన్ నాలుగో టీ20లో విరుచపడ్డాడు. అయితే ఐదు టీ20ల సిరీస్‌ను ఇప్పటికే బంగ్లాదేశ్ 3-1తో కైవసం చేసుకుంది. కాగా, బంగ్లాదేశ్ తొలిసారి ఆస్ట్రేలియాపై సిరీస్ విజయాన్నందుకుని రికార్డులను బద్దలు కొట్టింది.
నాలుగో టీ20లో మూడో స్థానంలో బ్యాటింగ్ వచ్చిన డానియల్ క్రిస్టియన్.. షకీబ్ అల్ హసన్‌కు చుక్కలు చూపించాడు. తొలి బంతిని స్టెప్ ఔటై లాంగాన్ దిశగా సిక్సర్ బాదేశాడు. ఇక రెండవ బంతిని వైడ్ లాంగ్ ఆన్ దిశకు చేర్చాడు. మూడో బంతిని స్లాగ్ స్వీప్ షాట్‌తో డీప్ మిడ్ వికెట్ మీదుగా మైదానం అవతల పడేసి హ్యాట్రిక్ సిక్సర్ బాదేశాడు. అప్పటికే షకీబ్ అల్ హసన్ మొహం మాడిపోయింది. అయితే నాలుగో బంతిని షకీబ్ తెలివిగా ఔట్‌సైడ్ ఆఫ్ స్టాంప్ దిశగా వేశాడు. ఈ బంతిని బౌండరీ తరలించడంలో క్రిస్టియన్ విఫలమయ్యాడు. దాంతో నాలుగో బంతి డాట్‌గా మిగిలిపోయింది. ఐదో బంతిని లాంగాన్ దిశగా భారీ మలిచి మరలా ఓ సిక్సర్ బాదేశాడు. ఇక చివరి బంతిని ఓవర్ డీప్ మిడ్ వికెట్ మీదుగా బౌండరీ దాటించాడు. ఈ ఓవర్‌లో 30 పరుగులు వచ్చాయి. అనంతరం ఆ జోరును కొనసాగించలేక ముస్తాఫిజుర్ బౌలింగ్‌లోనే క్రిస్టియన్ పెవిలియన్ చేరాడు.
ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షో కనబర్చిన ఆసీస్.. 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వరుస పరాజయాలకు మాత్రం బ్రేక్ వేసుకోగలిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 104 పరుగులు చేసింది. ఓపెనర్ మహ్మద్ నైమ్(28), హోస్సెన్(23), మెహ్‌దీ హసన్(23) టాస్ స్కోరర్లుగా నిలిచారు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆండ్రూటై, మిచెల్ స్వెప్సన్ చెరో మూడు వికెట్లు తీయగా.. జోష్ హజెల్ వుడ్ 2, అష్టన్ అగర్ ఒక వికెట్ తీశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా19 ఓవర్లలో 7 వికెట్లకు 105 పరుగులు చేసి 6 బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది.
6⃣6⃣6⃣0⃣6⃣6⃣#BANvAUS #DanChristian fell one short of joining Sir Garfield Sobers, Herschelle Gibbs, Yuvraj Singh, and Kieron Pollard!pic.twitter.com/CchMzWh8Hr
— Hundred Live (@LiveHundred) August 8, 2021
Also Read: IND vs ENG 1st Test Match: టీమిండియా గెలుపును అడ్డుకున్న వర్షం.. డ్రా గా ముగిసిన తొలి టెస్ట్..