BANW vs INDW 1st ODI: ఢాకా వేదికగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య బంగ్లాదేశ్ మహిళల చేతిలో టీమిండియా అమ్మాయిలు తొలిసారిగా ఓటమిపాలయ్యారు. వర్షం కారణంగా 44 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ టీమ్ 152 పరుగులకే పరిమితమయింది. టీమ్ కెప్టెన్ నిగర్ సుల్తానా 39 పరుగులతో బంగ్లా తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఈ క్రమంలో భారత్ తరఫున అమంజోత్ కౌర్ 4 వికెట్లతో చెలరేగగా.. దేవికా వైద్య 2, పూజా వాస్త్రాకర్ 1 వికెట్ తీసుకున్నారు. అయితే స్వల్ప టార్గెట్‌తో బరిలోకి దిగిన టీమిండిాయా మహిళలు బ్యాటింగ్‌లో చేతులెత్తేశారు.
టీమిండియా ఓపెనర్లుగా వచ్చిన ప్రియా పూనియా(10), స్మ్రతీ మంధాన(11) నుంచి శుభారంభం లభించలేదు. ఆ తర్వాత వచ్చిన యస్తికా భాటియా(15), కెప్టెన్ హార్మన్‌ప్రీత్ కౌర్(5) సహా అంతా చేతులెత్తేయడంతో భారత అమ్మాయిల జట్టు 113 పరుగులకే కుప్పకూలింది. దీప్తి శర్మ 20 పరుగులతో భారత్ తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచిందంటేనే అర్థం చేసుకోవచ్చు.. ఈ మ్యాచ్‌లో మనవాళ్ల ఆటతీరు. మరోవైపు బంగ్లా తరఫున మరుఫా అక్తర్ 4, రబేయా ఖాన్ 3 వికెట్లతో రాణించగా.. నహీదా అక్తర్, సుల్తానా ఖాతున్ చెరో వికెట్ తీసుకున్నారు. దీంతో టీమిండియాపై బంగ్లా అమ్మాయిలు 40 పరుగుల తేడాతో తొలి వన్డేలో విజయం సాధించింది.
కాగా, బంగ్లాదేశ్, టీమిండియా అమ్మాయిలు ఇప్పటివరకు 6 వన్డే మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇక ఆదివారం జరిగిన 6వ వన్డేలో తొలి సారిగా భారత్‌పై బంగ్లా అమ్మాయిలు విజయం సాధించారు. మరోవైపు 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్ కంటే బంగ్లాదేశ్ 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. అలాగే రెండో వన్డే ఈ నెల 19న, మూడో మ్యాచ్ జూలై 22న జరగనున్నాయి.
బంగ్లాదేశ్ ప్లేయింగ్ 11: ముర్షిదా ఖాతున్, షర్మిన్ అక్తర్, ఫెర్గానా హోక్, నిగర్ సుల్తానా(కెప్టెన్, వికెట్ కీపర్), షోర్నా అక్తర్, నహిదా అక్తర్, రీతు మోని, ఫాహిమా ఖాతున్, రబేయా ఖాన్, మరుఫా అక్తర్, సుల్తానా ఖాతున్
టీమిండియా ప్లేయింగ్ 11: స్మృతి మంధాన, ప్రియా పునియా, జెమీమా రోడ్రిగ్జ్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), యాస్తిక భాటియా(వికెట్ కీపర్), దీప్తి శర్మ, దేవికా వైద్య, అమంజోత్ కౌర్, పూజా వస్త్రాకర్, స్నేహ రాణా, అనూషా బరెడ్డి.
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..