Watch Video: అభిమానిపై చేయి చేసుకున్న షకీబ్ అల్ హాసన్.. మరోసారి వివాదాల్లో నిలిచిన బంగ్లా ఆల్‌రౌండర్..

|

Mar 11, 2023 | 3:38 PM

భారీ సెక్యూరిటీ మధ్యలో కూడా ఒక అభిమాని షకీబ్ క్యాప్‌ను తీసుకోవడంతో.. సహనం కోల్పోయిన షకీబ్ తన క్యాప్‌ను..

Watch Video: అభిమానిపై చేయి చేసుకున్న షకీబ్ అల్ హాసన్.. మరోసారి వివాదాల్లో నిలిచిన బంగ్లా ఆల్‌రౌండర్..
Shakib Al Hasan
Follow us on

బంగ్లాదేశ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకీబ్ అల్ హాసన్ అద్భుతమైన క్రికెటర్ అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. అయితే అటు మైదానంలో, ఇటు మైదానం బయట కూడా వరుస వివాదాలలో చిక్కుకుని వార్తలలో నిలుస్తుంటాడు ఈ ఆటగాడు.  అవును, తాజాగా  కూడా తన ప్రవర్తనతో మరోసారి వార్తల్లోకి ఎక్కాడు షకీబ్ అల్ హాసన్. గతంలో పలుసార్లు మైదానంలో మ్యాచ్ అంపైర్‌ల మీద కూడా అతడు అసహనానికి గురైన సందర్భాలు ఉండగా.. ఈ సారి మైదానం బయట అలాంటి ఘటన జరిగింది. వందలాది మంది మధ్యే ఓ అభిమానిని క్యాప్‌తో కొడుతున్న దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో షకీబ్‌ మరోసారి వివాదాల్లో చిక్కుకున్నాడు.

బంగ్లాదేశ్‌లోని చట్టోగ్రామ్‌లో ఓ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న షకీబ్‌ను చూసేందుకు అభిమానులు   భారీ సంఖ్యలో అక్కడికి పోటెత్తారు. ఆ క్రమంలోనే ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో అతడిని చుట్టుముట్టారు. భారీ సెక్యూరిటీ మధ్యలో కూడా ఒక అభిమాని షకీబ్ క్యాప్‌ను తీసుకోవడంతో.. సహనం కోల్పోయిన షకీబ్ తన క్యాప్‌ను లాక్కొని దానితోనే ఆ అభిమానిని కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ అవుతోంది. ఇంకా దీనిని చూసిన నెటిజన్లు షకీబ్ ప్రవర్తనపై మండిపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా, షకీబ్‌కు ఇలాంటి వివాదాలు కొత్త కాదు. మైదానంలో చాలా సార్లు అంపైర్లతో గొడవకు దిగిన సందర్భాలు ఉన్నాయి. అంతేకాక జట్టులోని తోటి ఆటగాళ్లతో సరిగ్గా ఉండడనే వార్తలు కూడా వచ్చాయి. మరోవైపు షకీబ్‌కు తమీమ్‌ ఇక్బాల్‌, మరో ఇద్దరు సీనియర్‌ ఆటగాళ్లతో గొడవలు ఉన్నట్లు గత నెలలో ఆ దేశ క్రికెట్‌ బోర్డు అధ్యక్షుడే స్వయంగా చెప్పడం గమనార్హం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..