T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ కోసం బంగ్లాదేశ్ జట్టు ఎంపిక.. ఎవరూ ఊహించని ప్లేయర్లకు టీమ్‌లో ఛాన్స్

|

May 14, 2024 | 6:48 PM

ప్రపంచ కప్ కోసం బంగ్లాదేశ్ ప్రధాన జట్టులో 15 మంది ఆటగాళ్లు ఉన్నారు. ఇద్దరికీ రిజర్వ్‌ ఆటగాళ్లుగా అవకాశం లభించింది. 25 ఏళ్ల యువ ఆటగాడు బంగ్లాదేశ్‌కు నాయకత్వం వహించనున్నాడు. గాయపడిన ఆటగాడికి వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు. అలాగే బంగ్లాదేశ్ స్టార్ ఆల్ రౌండర్ కూడా వరుసగా తొమ్మిదో ప్రపంచకప్ ఆడేందుకు సిద్ధమయ్యాడు.

T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ కోసం బంగ్లాదేశ్ జట్టు ఎంపిక.. ఎవరూ ఊహించని ప్లేయర్లకు టీమ్‌లో ఛాన్స్
Bangaldesh Cricket Team
Follow us on

బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు రాబోయే ICC T20 ప్రపంచ కప్ 2024 కోసం తమ జట్టును ప్రకటించింది. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్, ఐసీసీ సోషల్ మీడియా ద్వారా తెలియజేశాయి. ప్రపంచ కప్ కోసం బంగ్లాదేశ్ ప్రధాన జట్టులో 15 మంది ఆటగాళ్లు ఉన్నారు. ఇద్దరికీ రిజర్వ్‌ ఆటగాళ్లుగా అవకాశం లభించింది. 25 ఏళ్ల యువ ఆటగాడు బంగ్లాదేశ్‌కు నాయకత్వం వహించనున్నాడు. గాయపడిన ఆటగాడికి వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు. అలాగే బంగ్లాదేశ్ స్టార్ ఆల్ రౌండర్ కూడా వరుసగా తొమ్మిదో ప్రపంచకప్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మంగళవారం (మే 14న) జట్టును ప్రకటించింది. దీని ప్రకారం 25 ఏళ్ల యువకుడు నజ్ముల్ హుస్సేన్ శాంటోకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. అలాగే గాయం తర్వాత కూడా తస్కిన్ అహ్మద్‌కు జట్టులో చోటు కల్పించారు. అంతేకాదు వైస్ కెప్టెన్‌గా కూడా ఎంపికయ్యాడు. అలాగే అనుభవజ్ఞుడైన షకీబ్ అల్ హసన్ కూడా జట్టులోకి ఎంపికయ్యాడు. షకీబ్‌కి ఇది వరుసగా తొమ్మిదో T20 ప్రపంచకప్. 2007లో జరిగిన తొలి టీ20 ప్రపంచకప్ నుంచి గత ప్రపంచకప్ వరకు ప్రతి టోర్నీలో షకీబ్ ఆడాడు.

కాగా, ప్రపంచకప్‌లో పాల్గొనే 20 జట్లను 5-5 ప్రకారం 4 గ్రూపులుగా విభజించారు. దీని ప్రకారం బంగ్లాదేశ్ జట్టు గ్రూప్ డిలో ఉంది. బంగ్లాదేశ్‌తో పాటు ఈ గ్రూపులో నెదర్లాండ్స్, శ్రీలంక, నేపాల్, దక్షిణాఫ్రికా ఉన్నాయి. జూన్ 2 నుంచి ప్రపంచకప్ ప్రారంభం కానుంది.  5 రోజుల తర్వాత బంగ్లాదేశ్ తొలి మ్యాచ్ ఆడనుంది.

ఇవి కూడా చదవండి

T20 ప్రపంచ కప్ 2024 కోసం బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు:

నజ్ముల్ హుస్సేన్ శాంటో (కెప్టెన్), తస్కిన్ అహ్మద్ (వైస్ కెప్టెన్), లిటన్ దాస్, సౌమ్య సర్కార్, తాంజిద్ హసన్, షకీబ్ అల్ హసన్, తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, జకీర్ అలీ, తన్వీర్ హసన్ ఇస్లాం, రిషా హసన్ ఇస్లాం, మెహదీ హుస్సేన్, ముస్తాఫిజుర్ రెహమాన్, షరీఫుల్ ఇస్లాం,  తంజిమ్ హసన్.

రిజర్వ్‌లు:

హసన్ మహమూద్, అఫీఫ్ హుస్సేన్.

బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు ఇదే..

మరో 18 రోజుల్లో మెగా క్రికెట్ ఈవెంట్ టోర్నీ..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..