BAN vs AFG: ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్ట్‌లో ఆఫ్గానిస్తాన్ ఆరంగేట్ర ఫాస్ట్ బౌలర్ నిజత్ మసూద్ తొలి మ్యాచ్‌లోనే అరుదైన రికార్డులను నమోదు చేసుకున్నాడు. బంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్తాన్ మధ్య జరుగుతున్న ఏకైక టెస్ట్‌లో తన తొలి బంతికే ఆతిథ్య జట్టు ఓపెనర్ జకీర్ హసన్‌ను ఔట్ చేశాడు మసూద్. తద్వారా ఆరంగేట్ర టెస్ట్ మ్యాచ్ తొలి బంతికే వికెట్ పడగొట్టిన 7వ బౌలర్‌గా నిలిచాడు. అలాగే ఐదుగురు బంగ్లా ఆటగాళ్లను ఔట్ చేసి.. ఆఫ్ఘాన్ టెస్ట్ చరిత్రలో ఆరంగేట్ర మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లోనే ఫైవ్ వికెట్ హాల్ సాధించిన మొట్టమొదటి ప్లేయర్‌గా అవతరించాడు.
మసూద్ తన ఆరంగేట్ర మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో.. జాకీర్ హాసన్, మోమినుల్, ముష్ఫిఖర్ రహీమ్, తైజుల్ ఇస్లామ్, షోరిఫుల్ ఇస్లాం వికెట్లను పడగొట్టడం ద్వారా ఈ ఘనతను సాధించాడు. అయితే మసూద్ రికార్డులు సృష్టించినప్పటికీ.. మ్యాచ్‌లో మాత్రం బంగ్లాదేశ్ పైచేయి సాధించింది. నజ్ముమ్ షాంటో(146) సెంచరీతో చెలరేగడంతో బంగ్లాదేశ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 382 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘాన్లు 146 పరుగులకే చతికిల పడ్డారు.
దీంతో మళ్లీ బ్యాటింగ్‌కి వచ్చిన బంగ్లా తన రెండో ఇన్సింగ్స్‌లో ఓ వికెట్ కోల్పోయి 134 పరుగులు చేసింది. దీంతో ఆఫ్ఘాన్‌పై 370 పరుగులు ఆధిక్యంతో కొనసాగుతుంది. ఇక క్రీజులో ప్రస్తుతం జకీర్ హసన్(54), నజ్ముల్ షాంటో (54) ఉన్నారు. అంతకముందు ఓపెనర్‌గా వచ్చిన మహ్మదుల్ హసన్ జాయ్(17) స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..