రవీంద్ర జడేజాను క్రికెట్‌లో రాక్‌స్టార్ అని ఎందుకు పిలుస్తారో అందరికీ తెలిసిందే. తాజాగా మరోసారి లక్నోలో రుజువు చేశాడు. లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ అద్భుతం చేశాడు. రవీంద్ర జడేజా తన అద్భుతమైన బంతితో అందర్నీ షాక్‌కి గురిచేశాడు. ప్రపంచంలోని ఏ బ్యాట్స్‌మెన్ ముందు నిలబడలేనంత ప్రమాదకరమైన బంతిని విసిరాడు. జడేజా వేసిన బంతిని మార్కస్ స్టోయినిస్ ఎదుర్కొనలేక, ముఖ్యంగా అర్థం చేసుకోలేక పోయాడు. దీంతో పెవిలియన్ బాట పట్టాడు. రవీంద్ర జడేజా వేసిన ఈ బంతిని ఐపీఎల్‌లో అత్యుత్తమ బాల్‌గా పిలుస్తున్నారు.
లక్నో ఇన్నింగ్స్ 7వ ఓవర్‌లో రవీంద్ర జడేజా ఈ బంతిని వేశాడు. జడేజా వేసిన ఈ బంతి లెగ్ స్టంప్‌పై పడింది. ఆ తర్వాత గిర్రున తిరిగి ఆఫ్ స్టంప్‌ను పడగొట్టింది. జడేజా వేసిన ఈ బంతి చాలా మలుపులు తిరిగింది. అసలేం జరిగిందో తెలియక స్టోయినిస్ అలాగే చూస్తుండిపోయాడు. ఆశ్చర్యపోతూ పెవిలియన్ చేరాడు.
?.?.?.?.?!
That was an epic delivery from @imjadeja ??
Follow the match ▶️ https://t.co/QwaagO40CB #TATAIPL | #LSGvCSK pic.twitter.com/dhPSVB4BuF
— IndianPremierLeague (@IPL) May 3, 2023
ఈ సీజన్‌లో రవీంద్ర జడేజా బ్యాట్ సైలెంట్‌గా ఉన్నప్పటికీ అతను బంతితో రెచ్చిపోతున్నాడు. జడేజా 9 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు పడగొట్టాడు. అతని ఎకానమీ రేటు ఓవర్‌కు 7.50 పరుగులుగా నిలిచింది. బ్యాట్‌తో అతని ప్రదర్శన ఖచ్చితంగా సగటు కంటే తక్కువగా ఉంది. అతను 7 ఇన్నింగ్స్‌ల్లో 18.40 సగటుతో 92 పరుగులు మాత్రమే చేయగలిగాడు. జడేజా తన ప్రభావాన్ని బ్యాట్‌తో కాకపోయినా బంతితో చూపిస్తున్నాడు.
లక్నో పిచ్‌పై చెన్నై స్పిన్నర్లు అద్భుతాలు చేశారు. మొయిన్ అలీ 4 ఓవర్లలో 13 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. ఈ వార్త రాసే సమయానికి మహిష్ తీక్షణ 4 ఓవర్లలో 13 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. అదే సమయంలో రవీంద్ర జడేజా కూడా పొదుపుగా బౌలింగ్ చేస్తూ 3 ఓవర్లలో 11 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. లక్నో జట్టు 19.2 ఓవర్లలో 125 పరుగులు చేసింది. అనంతరం వర్షంతో మ్యాచ్‌కు అంతరాయం కలిగింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..