ICC Events: క్రికెట్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. కీలక టోర్నమెంట్‌లు చూడాలంటే.. జేబులకు చిల్లులే.. ఎందుకంటే?

IPL, ICC టోర్నమెంట్‌లకు సంబంధించిన టీవీ, డిజిటల్ హక్కులను వివిధ కంపెనీలు పొందడం వల్ల ఈ టోర్నమెంట్‌లను చూడటం అభిమానులకు ఖరీదైనదిగా మారింది.

ICC Events: క్రికెట్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. కీలక టోర్నమెంట్‌లు చూడాలంటే.. జేబులకు చిల్లులే.. ఎందుకంటే?
Icc Awards

Updated on: Aug 30, 2022 | 9:14 PM

ICC & IPL Digital and TV Rights: భారతదేశంలో క్రికెట్‌పై ఉన్న క్రేజ్ వేరే లెవల్లో ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు క్రికెట్ మ్యాచ్ చూసేందుకు చాలా ఆసక్తి చూపిస్తుంటారు. ప్రపంచం నలుమూలల నుంచి భారత క్రికెట్‌పై ఆసక్తి చూపిస్తుంటారు. ఇందుక ఉదాహరణలు గమనిస్తే.. భారత జట్టు మ్యాచ్ జరుగుతున్నప్పుడు టీవీల ముందే కూర్చంటారు. అయితే ఇప్పుడు క్రికెట్ అభిమానులకు చేదువార్త ఒకటి వచ్చింది. భారీ క్రికెట్ టోర్నమెంట్‌లను చూడటం అభిమానులకు ఖరీదైనదిగా మారింది.

టీవీ, డిజిటల్ హక్కుల కారణంతో..

భారతీయ క్రికెట్ అభిమానులకు భారీ ICC ఈవెంట్‌లు, IPL చూడటం ఖరీదైనది. దీనికి కారణం టీవీ, డిజిటల్ హక్కులు. నిజానికి, అభిమానులు ICC టీవీ స్ట్రీమింగ్ కోసం ప్రత్యేక సబ్‌స్క్రిప్షన్ తీసుకోవలసి ఉంటుంది. అయితే డిజిటల్ స్ట్రీమింగ్ కోసం విడిగా వేరే సబ్‌స్క్రిప్షన్ తీసుకోవలసి ఉంటుంది. అదేవిధంగా, IPL టీవీ స్ట్రీమింగ్ కోసం విడిగా, దాని డిజిటల్ స్ట్రీమింగ్ కోసం విడిగా సబ్‌స్క్రిప్షన్ తీసుకోవలసి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

Sony + Zee ICC ఈవెంట్లకు సంబంధించిన టీవీ హక్కులను తీసుకోగా, Hotstar డిజిటల్ హక్కులను పొందింది. నిజానికి Sony + Zee భారీ ICC ఈవెంట్‌ల TV హక్కులను పొందింది. ఇటువంటి పరిస్థితిలో TVలో Sony + Zeeకి సబ్‌స్క్రైబ్ చేయడం ద్వారా ICC ఈవెంట్‌లను ఆస్వాదించవచ్చు. అయితే, ఫోన్‌లో ICC ఈవెంట్‌లను ఆస్వాదించాలనుకుంటే అందుకోసం డిస్నీ + హాట్‌స్టార్‌కు ప్రత్యేక సభ్యత్వాన్ని తీసుకోవాలి.

స్టార్ టీవీ, వయాకామ్ 18 డిజిటల్ హక్కులను పొందాయి. అయితే ICC టోర్నమెంట్‌లు కాకుండా, స్టార్ ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్ IPL కోసం టీవీ హక్కులను కలిగి ఉంది. టీవీలో ఐపీఎల్‌ని ఆస్వాదించడానికి మీరు స్టార్‌కి సభ్యత్వం పొందాలి. మరోవైపు, డిజిటల్ స్ట్రీమింగ్ కోసం, మీరు వయాకామ్ 18 సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంది.