కొడుకు వేసే తొలి అడుగులు తల్లిదండ్రుల్లో ఎంతో సంతోషాన్ని నింపుతాయి. ఇలాంటి ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు టీమిండియా ఆల్‌రౌండర్, ముంబై ఇండియన్స్ క్రికెటర్ హార్దిక్ పాండ్య. చిన్నోడు చేసే సందడిని కుటుంబం మొత్తం ఆస్వాదిస్తోంది. కొడుకు చేసే చిలపి పనులతో పాండ్య సరదాగా గడుపుతున్నాడు. గతేడాది జులైలో అతడి సతీమణి, సెర్బియా నటి నటాషా స్టాంకోవిచ్ మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఆ బుజ్జి పాండ్యకు అగస్త్య పాండ్య అని నామకరణం చేశారు.
కుమారుడు అగస్త్య పాండ్యతో ఆడుకుంటూ తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ చిన్నోడు వేస్తున్న బుడి బుడి అడుగులను చూసి పాండ్య దంపతులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. జూనియర్ పాండ్య వేస్తున్న బుడి బుడి అడుగులను వీడియో తీసిన ముంబయి ఇండియన్స్ తమ ట్విటర్‌లో పోస్టు చేసింది. ఇది పోస్ట్ కాస్తా వైరల్ అవుతోంది.
Baby Pandya is on the move ?#OneFamily #MumbaiIndians @hardikpandya7 @Natasa_Official pic.twitter.com/5OmZXZZiFZ
— Mumbai Indians (@mipaltan) May 16, 2021
ఆ వీడియోలో కొడుకు కిందపడిపోకుండా హార్దిక్ పట్టుకోవడంతో చిన్ని చిన్ని అడుగులేసుకుంటూ తల్లి నటాషా ఒడిలోకి చేరుకున్నాడు జూనియర్ పాండ్య. దీంతో హార్దిక్ దంపతులు ఎంతో మురిసిపోయారు.
ప్రస్తుతం ఐపీఎల్ వాయిదా పడటంతో ఇంట్లోనే ఉంటున్న పాండ్య.. వచ్చే నెలలో న్యూజిలాండ్‌తో జరిగే ప్రపంచటెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్, అనంతరం ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టులకు ఎంపిక కాలేదు. దీంతో ఈ ఖాళీ సమయాన్ని కుటుంబం కోసం వెచ్చిస్తున్నాడు.