- Telugu News Photo Gallery Sports photos Australian ipl cricket players david warner steve smith pat cummins return home after maldives
Australian IPL Cricket Players: సిడ్నీ చేరుకున్న ఆస్ట్రేలియా ఐపీఎల్ ఆటగాళ్లు.. అయినా మరో 14 రోజు ఇంటికి దూరంగానే…
Australian Players Return Home: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2021)లో ఆడిన ఆస్ట్రేలియా క్రికెటర్లు సురక్షితంగా తమ దేశానికి చేరుకున్నారు. భారత్‌లో కరోనా ఉదృతి నేపథ్యంలో ఐపీఎల్‌ను అర్ధాంతరంగా రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్‌లో ఆడేందుకు వచ్చిన ఆసీస్ క్రికెటర్లు .. రెండు వారాల పాటు మాల్దీవుల్లో ఉన్నారు. అక్కడ నుంచి ఓ ప్రత్యేక విమానంలో సోమవారం ఉదయం సిడ్నీ చేరుకున్నారు.
Updated on: May 17, 2021 | 3:31 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2021)లో ఆడిన ఆస్ట్రేలియా క్రికెటర్లు సురక్షితంగా తమ దేశానికి చేరుకున్నారు. స్టార్ ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, ప్యాట్ కమ్మిన్స్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ తో పాటు సపోర్ట్ స్టాఫ్, రికీ పాంటింగ్, మైఖేల్ స్లేటర్లు కూడా ఇవాళ సిడ్నీ చేరుకున్నారు.

భారత్‌లో కరోనా ఉదృతి నేపథ్యంలో ఐపీఎల్‌ను అర్ధాంతరంగా రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్‌లో ఆడేందుకు వచ్చిన ఆసీస్ క్రికెటర్లు .. రెండు వారాల పాటు మాల్దీవుల్లో ఉన్నారు. అక్కడ నుంచి ఓ ప్రత్యేక విమానంలో ఇవాళ ఉదయం సిడ్నీ చేరుకున్నారు.

వివిధ జట్లలో కోవిడ్ -19 కేసులు పెరుగుతుండటంతో ఐపిఎల్‌ను వాయిదా వేసింది బీసీసీఐ. అయితే భారత్‌లో కోవిడ్ సెకెండ్ వేవ్ వ్యాప్తి అధికంగా ఉండటంతో భారతదేశం నుండి విమానాలను నిషేధించింది ఆస్ట్రేలియా. ఈ కారణంగా క్రికెటర్లు నేరుగా స్వదేశానికి తిరిగి పోలేక పోయారు.

సుమారు 38 మంది ఆసీస్ ఆటగాళ్లు ఐపీఎల్‌లో ప్రాతినిధ్యం వహించారు. వీరిలో ఆటగాళ్ళు, అధికారులు, వ్యాఖ్యాతలతో సహా మొత్తం 38 మంది సభ్యుల ఆస్ట్రేలియా బృందం ప్రత్యేక విమానంలో సొంత దేశానికి చేరుకుంది.ఈ చిత్రంలో మైఖేల్ స్లేటర్ కనిపిస్తాడు. మైఖేల్ స్లేటర్ ఓ సమయంలో కొద్దిగా ఆవేశానికి గురయ్యాడు. ఓ ప్రత్యేక విమానం ఏర్పాటు చేయాలంటూ ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

ఆస్ట్రేలియా ఆటగాళ్ళు ఇప్పుడు సిడ్నీలో తప్పనిసరి రెండు వారాల నిర్బంధంలో ఉండవలసి ఉంటుంది. నేషనల్ బ్రాడ్‌కాస్టర్ ఎబిసి ప్రకారం ఎయిర్ సీషెల్స్ విమానంలో ఇక్కడికి వచ్చిన వారిలో స్మిత్, కమ్మిన్స్, బ్యాట్స్ మాన్ డేవిడ్ వార్నర్, ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్ తదితరులు ఉన్నారు.

శుక్రవారం కోవిడ్ -19 రిపోర్ట్ నెగిటివ్ రావడంతో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సీ కూడా ఆదివారం దోహా ద్వారా సిడ్నీకి చేరుకున్నారు. చిత్రంలో స్టీవ్ స్మిత్ చూడొచ్చు.




