PAK vs ENG 2nd Test: పరుగులే కాదు నవ్వులూ పూయిస్తానంటున్న పాక్ బ్యాట్స్‌మాన్.. అసలేం చేశాడంటే..?

|

Dec 10, 2022 | 6:18 PM

ఇంగ్లాండ్ తన పర్యటనలో భాగంగా పాకిస్థాన్‌తో రెండో టెస్ట్ ఆడుతోంది. మ్యాచ్ మొదలైన మొదటిరోజే బాబర్ చేసిన ఓ చిలిపి పని ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. అసలు అతడు ఏం చేశాడంటే.. ఎంపైర్ మరైస్ ఎరాస్మస్‌..

PAK vs ENG 2nd Test: పరుగులే కాదు నవ్వులూ పూయిస్తానంటున్న పాక్ బ్యాట్స్‌మాన్.. అసలేం చేశాడంటే..?
Babar Azam Funny Meme
Follow us on

పాకిస్థాన్ క్రికెట్ చరిత్రలో బాబర్ అజామ్ అత్యున్నత ప్రతిభ ఉన్న క్రికెటర్ అని తప్పక చెప్పుకోవాలి. క్రికెట్ మైదానంలో నిత్యం తన బ్యాట్‌తో పరుగుల వర్షం కురిపించే బాబర్ ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో మాత్రం నవ్విస్తున్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ తన పర్యటనలో భాగంగా పాకిస్థాన్‌తో రెండో టెస్ట్ ఆడుతోంది. మ్యాచ్ మొదలైన మొదటిరోజే బాబర్ చేసిన ఓ చిలిపి పని ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

అసలు అతడు ఏం చేశాడంటే.. ఎంపైర్ మరైస్ ఎరాస్మస్‌ పక్కకు వచ్చి నిలబడి ఉన్నాడు. అప్పుడు అనుకోకుండా ఓ ఫొటో క్లిక్ అంది. అందులో వారు ఇద్దరూ పక్కపక్కనే నిలబడి ఉండగా ఎంపైర్ ఎరాస్మస్ పొట్ట కాస్త బయటకు కనిసిస్తూ ఉంటుంది. మళ్లీ కాసేపటి తర్వాత ఆ ఫొటోలో ఉన్నట్లుగానే నిలబడి నవ్వుకుంటూ ఎంపైర్ పొట్ట మీద సరదాగా తాకి వెళ్లాడు. దానికి సంబంధించిన పాక్ క్రికెట్ బోర్డు తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీంతో అది నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ఇవి కూడా చదవండి

అయితే ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లాండు తన మొదటి ఇన్నింగ్స్‌లో 281 పరులకు అలౌట్ అవ్వగా పాక్ 208 పరుగులకే పరిమితమయింది. ఇక రెండో ఇన్నింగ్స్‌ ఆటలో భాగంగా రెండో రోజు ఆట ముగిసే సరికి ఇంగ్లాండ్ జట్టు 5 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసి 281 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో బాబర్ అజామ్ 75 పరుగులు చేసి ఔటయ్యాడు.

కాగా, ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 136 పరుగులు చేసిన బాబర్ రెండో ఇన్నింగ్స్‌లో 4 పరుగులకే అవుటయ్యాడు. అయితే ఆ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టుపై ఇంగ్లాండ్ 74 పరుగుల తేడాతో గెలుపొందింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..