AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: 7 బంతుల్లో 5 సిక్సర్లు.. 428.57 స్ట్రైక్ రేట్‌తో గంభీర్ శిష్యుడి బీభత్సం.. భారత జట్టులో చోటు?

Ayush Badoni Fire Innings: ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (DPL 2024) 21వ మ్యాచ్ వెస్ట్ ఢిల్లీ లయన్స్ వర్సెస్ సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో వెస్ట్ ఢిల్లీ లయన్స్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 4 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసింది. తొలుత ఆడిన పశ్చిమ ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో 178/5 స్కోరు చేయగా, దక్షిణ ఢిల్లీ 15 ఓవర్లు మాత్రమే ఆడగా, 123/5 స్కోరు చేసినప్పటికీ, జట్టు ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది.

Video: 7 బంతుల్లో 5 సిక్సర్లు.. 428.57 స్ట్రైక్ రేట్‌తో గంభీర్ శిష్యుడి బీభత్సం.. భారత జట్టులో చోటు?
Ayush Badoni
Venkata Chari
|

Updated on: Aug 31, 2024 | 11:33 AM

Share

Ayush Badoni Fire Innings: ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (DPL 2024) 21వ మ్యాచ్ వెస్ట్ ఢిల్లీ లయన్స్ వర్సెస్ సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో వెస్ట్ ఢిల్లీ లయన్స్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 4 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసింది. తొలుత ఆడిన పశ్చిమ ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో 178/5 స్కోరు చేయగా, దక్షిణ ఢిల్లీ 15 ఓవర్లు మాత్రమే ఆడగా, 123/5 స్కోరు చేసినప్పటికీ, జట్టు ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. అద్భుత సెంచరీ ఆడిన వెస్ట్ ఢిల్లీకి చెందిన క్రిష్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.

క్రిష్ యాదవ్ అత్యుత్తమ సెంచరీ..

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్ట్ ఢిల్లీ లయన్స్‌కు శుభారంభం లభించింది. ఓపెనర్ క్రిష్ యాదవ్ అంకిత్ కుమార్‌తో కలిసి తొలి వికెట్‌కు 77 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అంకిత్ 21 బంతుల్లో నాలుగు ఫోర్ల సాయంతో 28 పరుగులు చేసి ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ హృతిక్ షౌకీన్ వేగంగా పరుగులు చేయడంలో విఫలమయ్యాడు. 18 బంతుల్లో 16 పరుగులతో నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆడాడు. అదే సమయంలో, మరో ఎండ్ నుంచి క్రిష్ తన తుపాన్ బ్యాటింగ్‌ను కొనసాగించాడు. చివరికి సెంచరీని కూడా సాధించగలిగాడు. క్రిష్ 68 బంతుల్లో 106 పరుగులు చేశాడు. ఇందులో ఎనిమిది ఫోర్లు, ఆరు సిక్సర్లు కూడా ఉన్నాయి. దీంతో వెస్ట్ ఢిల్లీ లయన్స్ 5 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసి విజయం సాధించింది. సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ తరపున రాఘవ్ సింగ్ అత్యధికంగా రెండు వికెట్లు తీశాడు.

ఆయుష్ బడోని అద్భుత ఇన్నింగ్స్ వృథా..

లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సౌత్ ఢిల్లీకి బ్యాడ్ స్టార్ట్ లభించింది. ఓపెనర్ సౌరభ్ దేస్వాల్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టాడు. ప్రియాంష్ ఆర్య వేగంగా పరుగులు చేసేందుకు ప్రయత్నించి 9 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 24 పరుగులు చేశాడు. ఆ తర్వాత, కెప్టెన్ ఆయుష్ బడోని దూకుడు కనిపించింది. అతను కేవలం 7 బంతుల్లో ఐదు సిక్సర్లు కొట్టి 30 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, అతను ఔట్ అయిన వెంటనే, మిగిలిన బ్యాట్స్‌మెన్స్ త్వరగా పరుగులు చేయలేకపోయారు. దీని కారణంగా, సౌత్ ఢిల్లీ ఆట ఆగిపోయే సమయానికి నిర్ణీత స్కోరు కంటే 4 పరుగులు వెనుకబడి ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..