రవీంద్ర జడేజా స్థానంలో జట్టులోకి వచ్చిన ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ అద్భుతంగా రాణిస్తున్నాడు. జడేజా లేని లోటును కనిపించనీయకుండా
కచ్చితమైన బౌలింగ్‌తో వికెట్లు పడగొట్టడమే కాకుండా అవసరమైన సందర్భాల్లో ధాటిగా బ్యాటింగ్ చేస్తూన్నాడు. తాజాగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలోనూ సత్తా చాటాడీ స్టార్ ఆల్‌రౌండర్. కేవలం 5 ఓవర్లే వేసినప్పటికీ కీలకమైన ధనుంజయ డిసిల్వాను అద్భుతంగా బౌల్డ్ చేశాడు. కాగా ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్‌లోనూ అదరగొట్టాడు అక్షర్. మొత్తం మూడు క్యాచ్‌లు పట్టాడు. అయితే చమికా కరుణ రత్నేక్యాచ్ పట్టడం మ్యాచ్‌కే హైలెట్. ఉమ్రాన్ మాలిక్ వేసిన బంతిని కరుణరత్నే పాయింట్ ఏరియా వైపు ఆడగా అక్కడే ఉన్న అక్షర్ అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. బంతి చాలా వేగంగా వచ్చినప్పటికీఎడమవైపు డైవ్ చేసి బంతిని క్యాచ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక తొలి వన్డేలో శ్రీలంకపై 300కు పైగా పరుగులు అందించిన టీమిండియా బౌలింగ్ కోల్‌కతా వన్డేలో అద్భుతంగా పుంజుకుంది. టాస గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక తొలి వికెట్ ను మహ్మద్ సిరాజ్ పడగొట్టగా.. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ శ్రీలంక మిడిల్ ఆర్డర్ ను వణికించాడు.
కోల్‌కతాలో శ్రీలంక జట్టు 39.4 ఓవర్లలో కేవలం 215 పరుగులకే ఆలౌటైంది. టీమిండియా తరఫున మహ్మద్ సిరాజ్ 30 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.కుల్దీప్ యాదవ్ కూడా 51 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ఉమ్రాన్ మాలిక్ 2 వికెట్లు తీశాడు. కాగా 215 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా తడబడుతోంది. కడపటి వార్తలందే సమయానికి 10 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (17), శుభ్‌మన్ గిల్ (21), విరాట్ కోహ్లీ (4) పెవిలియన్ చేరుకున్నారు. ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్ (13), కేఎల్ రాహుల్ (5) క్రీజులో ఉన్నారు. లహిరు కుమార రెండు వికెట్లు పడగొట్టాడు.
Sharp catch alert ?@akshar2026 dives to his left and takes a fine catch as @umran_malik_01 gets his second wicket ??#TeamIndia | #INDvSL | @mastercardindia pic.twitter.com/R4bJoPXNM3
— BCCI (@BCCI) January 12, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..