భారత్‌ కోసం మేమున్నామంటున్న ఆసీస్ ఆటగాళ్లు.. మన దేశం కోసం ఆ దేశంలో విరాళ సేకరణ..

|

Jun 02, 2021 | 11:08 PM

భారత్‌లో కోవిడ్ మహమ్మారి సృష్టిస్తున్న అలజడి చూసి ఆస్ట్రేలియా క్రికెటర్లు చలించిపోతున్నారు. కరోనాతో పోరాడుతున్న భారతీయులను చూసి తట్టుకోలేకపోతుననారు.

భారత్‌ కోసం మేమున్నామంటున్న ఆసీస్ ఆటగాళ్లు.. మన దేశం కోసం  ఆ దేశంలో విరాళ సేకరణ..
Australian Ipl Cricketers
Follow us on

భారత్‌లో కోవిడ్ మహమ్మారి సృష్టిస్తున్న అలజడి చూసి ఆస్ట్రేలియా క్రికెటర్లు చలించిపోతున్నారు. కరోనాతో పోరాడుతున్న భారతీయులను చూసి తట్టుకోలేకపోతుననారు. భారత్‌లో కొవిడ్ బాధితులను ఆదుకునేందుకు ఆసీస్ క్రికెటర్లు విరాళాల సేకరణ చేయబోతున్నారు. కరోనా విపత్కర పరిస్థితులు చూసి మన దేశానికి సాయం చేసేందుకు ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్లు ఒక్కటయ్యారు. గురువారం వర్చువల్‌గా జరగనున్న ఓ కార్యక్రమంలో పాట్ కమిన్స్, స్టార్క్, హేజిల్​వుడ్, లైయన్‌తో పాటు ఆ దేశ మహిళా క్రికెటర్లు కూడా చేతులు కలిపారు. ఈ కార్యక్రమం ద్వారా లక్ష డాలర్ల వరకు విరాళాలు సేకరించాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. క‌రోనాపై భార‌త్ చేస్తున్న పోరాటానికి త‌న వంతు సాయం అందిస్తాన‌ని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ పేసర్‌ ప్యాట్ కమిన్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. బాధితులకు ఆక్సిజన్‌ అందించడం కోసం ఈ ఆసీస్ పేస‌ర్ కమిన్స్‌ విరాళంగా 50 వేల డాలర్ల విరాళాన్ని ప్రకటించాడు.

ఒక్కటై కదులుతున్నారిలా…

ఈ లైవ్​ స్ట్రీమ్​లో క్రికెట్‌కు సంబంధించిన విషయాలు చర్చించడం…ఆ కార్యక్రమంకు వచ్చినవారితో క్రికెటర్లు వీడియో గేమ్స్ కూడా ఆడనున్నారు. భారత కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం 12:30 గంటలకు మొదలయ్యే ఈ ఫండ్ రైజింగ్ కార్యక్రమం.. అర్ధరాత్రి 12:30 గంటల వరకు సాగనుంది. ఫండ్‌ రెయిజింగ్‌ కోసం మరిన్ని కార్యక్రమాలు మరిన్ని కార్యక్రమాలను ప్లాన్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :  Gold Price Today: కస్టమర్లకు షాకిస్తున్న బంగారం ధరలు.. పెరుగుతున్న పసిడి.. నిన్నటి కంటే ఈ రోజు ఎంత పెరిగిందంటే

Spitting in Public Places: బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేసే వారిపై అధికారుల కొరడా.. ఇక నుంచి రూ. 1200 ఫైన్..!