T20 World Cup 2022: గత విజేతగా బరిలోకి.. కొలిసొచ్చే అంశాలు ఉన్నా.. ఆస్ట్రేలియా టీంను వెంటాడుతోన్న ఆ వీక్‌నెస్..

|

Oct 17, 2022 | 6:18 PM

Australia Team Strength and Weakness: ఈ ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాకు సొంతగడ్డపై ఆడడమే అతిపెద్ద బలం. 2015లో కూడా ఇదే జట్టు స్వదేశంలో వన్డే ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది.

T20 World Cup 2022: గత విజేతగా బరిలోకి.. కొలిసొచ్చే అంశాలు ఉన్నా.. ఆస్ట్రేలియా టీంను వెంటాడుతోన్న ఆ వీక్‌నెస్..
Australia Team T20 Wc
Follow us on

టీ20 ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లో నమీబియా, నాలుగో మ్యాచ్‌లో స్కాట్లాండ్ టీంలు విజయాలు సాధించడంతో ఏ జట్టునైనా తేలికగా తీసుకుంటే పెద్ద తప్పే అవుతుందని స్పష్టం చేసింది. ప్రతి జట్టు తమ బలాలు, బలహీనతలను దృష్టిలో ఉంచుకుని మైదానంలోకి దిగాల్సిన తరుణం ఇది. టీ20 ప్రపంచ కప్‌లో రాణించాలంటే కచ్చితమైన అవగాహనతోనే ముందుకు వెళ్లాలి. లేదంటే ఓటమి తప్పదని మాజీలు, నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతి జట్టుకు దాని బలాలు, బలహీనతలు ఉంటాయి. భారత జట్టు బలం అంతా బ్యాటింగ్ అయితే, పాకిస్తాన్ బలం దాని ఫాస్ట్ బౌలింగ్. అలాగే ఈ రెండు టీంలకు ఎన్నో బలహీనతలు కూడా ఉన్నాయి. టాప్-10 జట్ల స్వ్కాడ్ తోపాటు బలాలు, బలహీనతలను ఓసారి పరిశీలిద్దాం.. అందులో భాగంగా ఆస్ట్రేలియా జట్టు పరిస్థితులేంటో ఇప్పుడు చూద్దాం..

1. ఆస్ట్రేలియా..

విజేతగా నిలిచిన సంవత్సరం.. 2021

రన్నరప్ గా నిలిచిన సంవత్సరం.. 2010

ఇవి కూడా చదవండి

బలం: ఈ ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాకు సొంతగడ్డపై ఆడడమే అతిపెద్ద బలం. 2015లో కూడా ఇదే జట్టు స్వదేశంలో వన్డే ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. అక్కడి మైదానాలు వారికి కొంతమేర కలిసొచ్చే అంశం. జట్టు బ్యాటింగ్ కూడా అద్భుతంగా ఉంది. 2021 టీ20 వరల్డ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ డేవిడ్ వార్నర్ అద్భుతమైన స్థితిలో ఉన్నాడు. అదే సమయంలో మిడిలార్డర్‌లో గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, మిచెల్ మార్ష్‌లు ఎలాంటి మ్యాచ్‌నైనా తారుమారు చేయగల ఆటగాళ్లు. జట్టులో మిచెల్ మార్ష్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్ రూపంలో ముగ్గురు నాణ్యమైన ఆల్ రౌండర్లు కూడా ఉన్నారు. అలాగే సింగపూర్‌లో జన్మించిన టిమ్ డేవిడ్‌ను ఫినిషర్ పాత్ర పోషించగల టీ20 సంచలనాన్ని కూడా జట్టులో ఉంచుకుంది.

బలహీనత: లెగ్ స్పిన్నర్లు ఆడమ్ జంపా, అష్టన్ అగర్ మినహా జట్టులో స్పిన్నర్ల కోసం పెద్దగా ఎంపికలు లేవు. ఇది జట్టుకు సమస్యలను సృష్టించవచ్చు. అదే సమయంలో కెప్టెన్ ఆరోన్ ఫించ్ ప్రస్తుతం ఫామ్‌లో లేడు. స్టీవ్ స్మిత్ పవర్ హిట్టింగ్‌లో నిరంతరం విఫలమవుతున్నాడు. అతను ఈ ఏడాది 120 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేశాడు. ఇటీవల ఇంగ్లండ్‌, భారత్‌ టీ20ల సిరీస్‌లోనూ ఓటమి చవిచూసింది.

ICC T20 ప్రపంచ కప్ 2022లో ఆస్ట్రేలియా షెడ్యూల్ ఇదే..

తేదీ మ్యాచ్ సమయం (వాస్తవం) వేదిక
22 అక్టోబర్, శనివారం న్యూజిలాండ్ vs ఆస్ట్రేలియా సాయంత్రం 6:00 గంటలకు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, సిడ్నీ
25 అక్టోబర్, మంగళవారం ఆస్ట్రేలియా vs గ్రూప్ A విజేత రాత్రి 7:00 గంటలకు పెర్త్ స్టేడియం, పెర్త్
28 అక్టోబర్, శుక్రవారం ఇంగ్లాండ్ vs ఆస్ట్రేలియా రాత్రి 7:00 గంటలకు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్, మెల్బోర్న్
31 అక్టోబర్, సోమవారం ఆస్ట్రేలియా vs గ్రూప్ B రన్నరప్ సాయంత్రం 6:00 గంటలకు గబ్బా, బ్రిస్బేన్
4 నవంబర్, శుక్రవారం ఆస్ట్రేలియా vs ఆఫ్ఘనిస్తాన్ సాయంత్రం 6:30 గంటలకు అడిలైడ్ ఓవల్, అడిలైడ్

ఆస్ట్రేలియా స్వ్కాడ్: ఆరోన్ ఫించ్ (సి), డేవిడ్ వార్నర్, పాట్ కమిన్స్, అష్టన్ అగర్, టిమ్ డేవిడ్, జోష్ హేజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, స్టీవ్ స్మిత్, కేన్ రిచర్డ్‌సన్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, ఆడమ్ జాంపా.

ఆస్ట్రేలియా ప్రాబబుల్ ప్లేయింగ్ XI : ఆరోన్ ఫించ్ (సి), డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, మాథ్యూ వేడ్ (WK), గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..