SL vs AUS: టీమిండియాపై అదరగొట్టాడు.. కట్‌చేస్తే.. 7 ఏళ్ల తర్వాత కెప్టెన్‌గా రీఎంట్రీ

|

Jan 09, 2025 | 8:27 AM

Steve Smith Captain: శ్రీలంక పర్యటనకు ఆస్ట్రేలియా జట్టు తన జట్టును ప్రకటించింది. ఈ రెండు టెస్టుల సిరీస్‌లో స్టీవ్‌ స్మిత్‌కు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఏడేళ్ల తర్వాత ఆస్ట్రేలియా జట్టు బాధ్యతలు చేపట్టబోతున్నాడు. శాండిల్ పేపర్ వివాదం తర్వాత ఓ పూర్తి సిరీస్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

SL vs AUS: టీమిండియాపై అదరగొట్టాడు.. కట్‌చేస్తే.. 7 ఏళ్ల తర్వాత కెప్టెన్‌గా రీఎంట్రీ
Steve Smith Captain
Follow us on

Steve Smith Captain: శ్రీలంక పర్యటనకు ఆస్ట్రేలియా జట్టు తన జట్టును ప్రకటించింది. ఈ రెండు టెస్టుల సిరీస్‌లో స్టీవ్‌ స్మిత్‌కు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. జట్టు రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ తన రెండవ బిడ్డ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇది కాకుండా, అతనికి చీలమండ సమస్య కూడా ఉంది. దీనికి చికిత్స చేయాల్సి ఉంది. అందుకే సెలవు తీసుకున్నాడు. అతని గైర్హాజరీతో స్మిత్‌కు జట్టు కమాండ్‌ని అప్పగించారు. ఏడేళ్ల తర్వాత స్మిత్ ఆస్ట్రేలియా జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.

7 ఏళ్ల తర్వాత కెప్టెన్‌‌గా స్టీవ్ స్మిత్..

2018లో శాండిల్ పేపర్ కుంభకోణంలో దోషిగా తేలిన తర్వాత, స్టీవ్ స్మిత్ 12 నెలల పాటు ఏ జట్టుకు కెప్టెన్సీ చేయకుండా నిషేధం విధించారు. నిషేధం ముగిసిన తర్వాత రెండుసార్లు ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. కోవిడ్-19 కారణంగా 2021లో కమిన్స్ అందుబాటులో లేడు. కానీ, అతనికి జట్టు కమాండ్ ఇచ్చారు. ఆ తరువాత, 2023 సంవత్సరంలో భారత పర్యటన సందర్భంగా, కమిన్స్ తన తల్లి ఆకస్మిక మరణం కారణంగా ఆస్ట్రేలియాకు తిరిగి రావలసి వచ్చింది. ఆ తర్వాత భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో చివరి రెండు మ్యాచ్‌లలో కంగారూ జట్టుకు స్మిత్ నాయకత్వం వహించాడు. అయితే, రెండుసార్లు తాత్కాలిక కెప్టెన్‌గా నియమితుడై ఒకటి రెండు మ్యాచ్‌ల్లో అవకాశం లభించింది. అయితే, శ్రీలంక టూర్‌లో 7 ఏళ్ల తర్వాత తొలిసారిగా మొత్తం సిరీస్‌లో జట్టుకు కెప్టెన్‌గా కనిపించనున్నాడు.

16 మంది సభ్యుల బృందం..

శ్రీలంక పర్యటనలో ఆస్ట్రేలియా జట్టు రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. తొలి మ్యాచ్ జనవరి 29 నుంచి ఫిబ్రవరి 2 వరకు, రెండో మ్యాచ్ ఫిబ్రవరి 6 నుంచి 10 వరకు జరగనుంది. ఇందుకోసం ఆస్ట్రేలియా జట్టు 16 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించింది. ఇటీవలే భారత్‌పై అరంగేట్రం చేసిన సామ్ కాన్స్టాస్, నాథన్ మెక్‌స్వీనీ, బ్యూ వెబ్‌స్టర్‌లకు ఈ పర్యటనలో చోటు కల్పించారు. శ్రీలంకలో స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. నాథన్ లియోన్‌తో పాటు మరో ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లు మర్ఫీ, కుహ్నెమాన్ కూడా ఎంపికయ్యారు. వీరితో పాటు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా జట్టుతో నిరంతరం కొనసాగిన షాన్ అబాట్, జోష్ ఇంగ్లిస్ కూడా శ్రీలంకకు వెళ్లే విమానంలో చోటు దక్కించుకున్నారు. 21 ఏళ్ల ప్రతిభావంతుడైన ఆటగాడు కూపర్ కొన్నోలీ కూడా జట్టులో చోటు సంపాదించడంలో విజయం సాధించాడు.

ఇవి కూడా చదవండి

శ్రీలంక పర్యటనకు ఆస్ట్రేలియా జట్టు..

స్టీవ్ స్మిత్ (కెప్టెన్), షాన్ అబాట్, స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, ట్రావిస్ హెడ్ (వైస్ కెప్టెన్), సామ్ కాన్స్టాన్స్, మాట్ కుహ్నెమన్, మార్నస్ లాబుస్‌చాగ్నే, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, టాడ్ మర్ఫీ, నాథన్ లియోన్, నాథన్ మెక్‌స్వీనీ, మిచెల్ బ్యూ వెబ్‌స్టర్, కూపర్ కొన్నోలీ.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..