పీకల్లోతు కష్టాల్లో ఆస్ట్రేలియా!

న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 8 పరుగుల తేడాతో రెండు కీలక వికెట్లను కోల్పోయి చిక్కుల్లో పడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ 15 పరుగుల వద్దే కెప్టెన్ అరోన్ ఫించ్ (8) వికెట్‌ను కోల్పోయింది. ఉస్మాన్ ఖావాజాతో కలిసి నిదానంగా ఆడుతున్న సమయంలో 38 పరుగుల వద్ద డేవిడ్ వార్నర్ (16) పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత మరో 8 పరుగుల తేడాతోనే మూడో వికెట్‌ను కూడా ఆసీస్ కోల్పోయింది. ఫెర్గూసన్ బౌలింగ్‌లో గప్టిల్‌కు […]

పీకల్లోతు కష్టాల్లో ఆస్ట్రేలియా!

Edited By:

Updated on: Jun 29, 2019 | 7:56 PM

న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 8 పరుగుల తేడాతో రెండు కీలక వికెట్లను కోల్పోయి చిక్కుల్లో పడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ 15 పరుగుల వద్దే కెప్టెన్ అరోన్ ఫించ్ (8) వికెట్‌ను కోల్పోయింది. ఉస్మాన్ ఖావాజాతో కలిసి నిదానంగా ఆడుతున్న సమయంలో 38 పరుగుల వద్ద డేవిడ్ వార్నర్ (16) పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత మరో 8 పరుగుల తేడాతోనే మూడో వికెట్‌ను కూడా ఆసీస్ కోల్పోయింది. ఫెర్గూసన్ బౌలింగ్‌లో గప్టిల్‌కు క్యాచ్ ఇచ్చి స్టీవ్ స్మిత్ (5) అవుటయ్యాడు. ప్రస్తుతం 23 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ ఐదు వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది.