
Australia vs Pakistan: మెల్‌బోర్న్‌లో పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ ప్రత్యేక రికార్డును లిఖించాడు. టాస్ గెలిచిన పాకిస్థాన్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. అందుకు తగ్గట్టుగానే ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టుకు డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజాలు శుభారంభం అందించారు.
తొలి వికెట్‌కు 90 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన డేవిడ్ వార్నర్ (38).. స్లిప్ వద్ద సల్మాన్ అలీ ఆఘా చేతికి చిక్కాడు. ఈ ఇన్నింగ్స్‌లో 38 పరుగులతో వార్నర్ అంతర్జాతీయ క్రికెట్‌లో ఆస్ట్రేలియా తరపున అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.
గతంలో స్టీవ్ వా ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. ఆసీస్ మాజీ కెప్టెన్ 548 ఇన్నింగ్స్‌లలో 18496 పరుగులు చేశాడు. ఇప్పుడు ఈ రికార్డును డేవిడ్ వార్నర్ బద్దలు కొట్టి రెండో స్థానంలో నిలిచాడు.
ఆస్ట్రేలియా తరపున 460 ఇన్నింగ్స్‌లు ఆడిన డేవిడ్ వార్నర్.. ఇప్పటివరకు 18502 పరుగులు చేశాడు. దీంతో ఆసీస్ తరపున అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.
ఈ జాబితాలో రికీ పాంటింగ్ అగ్రస్థానంలో ఉన్నాడు. పాటింగ్ అంతర్జాతీయ క్రికెట్‌లో 667 ఇన్నింగ్స్‌ల ద్వారా మొత్తం 27368 పరుగులు సాధించాడు. దీంతో ఆస్ట్రేలియా తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.
ఈ జాబితాలో డేవిడ్ వార్నర్ 2వ స్థానంలో ఉన్నా.. అగ్రస్థానంలో ఉండలేడని చెప్పొచ్చు. ఎందుకంటే జనవరి 3 నుంచి పాకిస్థాన్‌తో జరిగే 3వ మ్యాచ్ ద్వారా వార్నర్ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలుకనున్నాడు.
అలాగే 37 ఏళ్ల వార్నర్ ఇక నుంచి వన్డే, టీ20 జట్లలో కనిపించడం అనుమానమే. అందువల్ల ఆస్ట్రేలియా తరపున 27,000కు పైగా పరుగులు చేసిన రికీ పాంటింగ్ రికార్డు సేఫ్ అని చెప్పొచ్చు.
మెల్‌బోర్న్ వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న 2వ టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టుకు శుభారంభం లభించింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (38), ఉస్మాన్ ఖవాజా (42) శుభారంభం ఇచ్చి వికెట్లను కోల్పోయారు. తొలి రోజు ఆటముగిసే సమయానికి 66 ఓవర్లలో ఆస్ట్రేలియా జట్టు 3 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. క్రీజులో మార్నస్ లాబుషాగ్నే (44), ట్రావిస్ హెడ్ (9) బ్యాటింగ్ చేస్తున్నారు.
పాకిస్థాన్ (ప్లేయింగ్ XI): అబ్దుల్లా షఫీక్, ఇమామ్-ఉల్-హక్, షాన్ మసూద్(కెప్టెన్), బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్(కీపర్), అఘా సల్మాన్, అమీర్ జమాల్, షాహీన్ అఫ్రిది, హసన్ అలీ, మీర్ హమ్జా.
ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషాగ్నే, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ(కీపర్), మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్(కెప్టెన్), నాథన్ లియాన్, జోష్ హేజిల్‌వుడ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..