Australia Pull Out : సౌతాఫ్రికా టూర్ రద్దు చేసుకున్న ఆస్ట్రేలియా.. లాభపడింది మాత్రం కివీస్..
సౌతాఫ్రికా పర్యటనను వాయిదా వేసుకుంది ఆస్ట్రేలియా. ఆతిథ్య దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్కొనసాగుతుండటంతో ఆస్ట్రేలియా ఈ నిర్ణయం తీసుకుంది. పరిస్థితి సద్దుమణిగాక త్వరలోనే కొత్త షెడ్యూల్‌ను ప్రకటిస్తామని పేర్కొంది..
Australia Pull Out : సౌతాఫ్రికా పర్యటనను వాయిదా వేసుకుంది ఆస్ట్రేలియా. ఆతిథ్య దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్కొనసాగుతుండటంతో ఆస్ట్రేలియా ఈ నిర్ణయం తీసుకుంది. పరిస్థితి సద్దుమణిగాక త్వరలోనే కొత్త షెడ్యూల్‌ను ప్రకటిస్తామని పేర్కొంది ఆసీస్ క్రికెట్ బోర్డు.
ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ భయాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా వైరస్కారణంగా దక్షిణాఫ్రికా పర్యటనను ఆస్ట్రేలియా జట్టు రద్దు చేసుకుంది. షెడ్యూల్ ప్రకారం దక్షిణాఫ్రికాతో మూడు టెస్టులను ఆస్ట్రేలియా ఆడాల్సి ఉంది. ఇందుకోసం గత వారంలో జట్టును కూడా ప్రకటించింది.
Today we informed Cricket South Africa that we believe we have no choice but to postpone the forthcoming Qantas Tour of South Africa due to the coronavirus pandemic. Full statement ? pic.twitter.com/mYjqNpkYjp
— Cricket Australia (@CricketAus) February 2, 2021
అయితే ఆతిథ్య దేశంలో కోవిడ్ వైరస్ వ్యాప్తి అధికంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఆటగాళ్లు ఇబ్బందులు ఎదుర్కోకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. ఆకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడం పట్లు ఇప్పటికే క్రికెట్ సౌతాఫ్రికాకు సారీ చెప్పింది. ఈ విషయాన్ని ఆసీస్ క్రికెట్ బోర్డు తాత్కాలిక సీఈఓ నిక్ హాక్లే ట్వీట్ చేశారు.
ఇదిలావుంటే.. దక్షిణాఫ్రికా పర్యటనను ఆసీస్ రద్దు చేసుకోవడంతో న్యూజిలాండ్ జట్టు వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా రికార్డులకెక్కింది. ఒకవైపు జనవరి చివరివారంలోనే దక్షిణాఫ్రికా పర్యటనను దృష్టిలో ఉంచుకొని క్రికెట్ ఆస్ట్రేలియా టిమ్ పైన్ నేతృత్వంలోని 19 మందితో కూడిన ప్రాబబుల్స్‌ను ఎంపిక చేసింది. ఇదే విషయమై ట్విటర్‌లో స్పందిస్తూ లేఖను విడుదల చేసింది.
ఇక జూన్‌లో జరగనున్న వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా కివీస్ నిలిచింది. ఐసీసీ ఇటీవలే ప్రకటించిన ర్యాంకింగ్స్ ప్రకారం కేన్ విలియమ్సన్ నేతృత్వంలోని న్యూజిలాండ్ జట్టు 118 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా..
అదే రేటింగ్ పాయింట్లతో టీమిండియా రెండో స్థానంలో ఉన్నా.. ఇరు జట్ల మధ్య 5 మ్యాచ్‌ల వ్యత్యాసం ఉంది. ఇక 113 రేటింగ్ పాయింట్లతో ఆసీస్ మూడోస్థానంలో, 108 రేటింగ్ పాయింట్లతో ఇంగ్లండ్ నాలుగోస్థానంలో ఉన్నాయి. కాగా జూన్‌లో లార్డ్స్ వేదికగా వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
A huge victory in the second Test has propelled New Zealand to the No.1 spot in the @MRFWorldwide ICC Test Team Rankings ?#NZvPAK report ⬇️
— ICC (@ICC) January 6, 2021
ఇవి కూడా చదవండి :
Pete Buttigieg : అమెరికా కేబినెట్‌లోకి తొలి ట్రాన్స్జెండర్.. రవాణా మంత్రిగా పీట్ బుట్టిగీగ్.. Naadu Nedu Second Phase : మనబడి ‘నాడు- నేడు’పై సీఎం జగన్ సమీక్ష.. రెండో విడతకు సిద్ధం కావాలని అధికారులకు ఆదేశాలు..