ICC Player of The Month : ఐసీసీ కొత్త అవార్డులు.. నామినీల్లో టీమిండియా ఆటగాడు వికెట్ కీపర్ రిషబ్ పంత్‌

అంతర్జాతీయ క్రికెట్ (ICC) లో అద్భుత ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లకు ప్రతినెలా ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు ఇవ్వాలని ఐసీసీ నిర్ణయించింది. ఏడాది పొడవునా అన్ని ఫార్మాట్లలో మెన్స్‌, విమెన్స్‌ క్రికెటర్ల ఉత్తమ ప్రదర్శనల గుర్తించి క్రికెటర్ల విజయాన్ని..

ICC Player of The Month : ఐసీసీ కొత్త అవార్డులు.. నామినీల్లో టీమిండియా ఆటగాడు వికెట్ కీపర్ రిషబ్ పంత్‌
Follow us
Sanjay Kasula

|

Updated on: Feb 03, 2021 | 5:19 PM

ICC Player of The Month : అంతర్జాతీయ క్రికెట్ (ICC) లో అద్భుత ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లకు ప్రతినెలా ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు ఇవ్వాలని ఐసీసీ నిర్ణయించింది. ఏడాది పొడవునా అన్ని ఫార్మాట్లలో మెన్స్‌, విమెన్స్‌ క్రికెటర్ల ఉత్తమ ప్రదర్శనల గుర్తించి క్రికెటర్ల విజయాన్ని సెలబ్రేట్‌ చేసేందుకు ఈ అవార్డులను ఇవ్వనుంది.

దీనిలో భాగంగానే ఆరంభ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులకు నామినీలను ప్రకటించింది. జనవరి నెలకుగాను నామినేట్ అయిన ఆటగాళ్ల పేర్లను వెల్లడించింది. ఈ జాబితాలో భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్‌ కూడా చోటు దక్కించుకున్నాడు. రిషబ్ పంత్‌తోపాటు ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ జో రూట్, ఐర్లాండ్ ఓపెనర్ పాల్ స్టిర్లింగ్‌ కూడా రేసులో ఉన్నారు.

వీరిలో జో రూట్ ఈ ఒక్క నెలలోనే టెస్టుల్లో 426 పరుగులు సాధించి మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. పంత్ 245 పరుగులు సాధించి సెకెండ్ ప్లేస్‌లో నిలువగా… స్టిర్లింగ్‌ ఈ నెలలో జరిగిన వన్డేల్లో 420 పరుగులు సాధిచడతో ఈ జాబితాలోకి ఎంపిక చేసినట్లు ఐసీసీ తెలిపింది. ఇక పురుషులతో పాటు మహిళా ప్లేయర్ల నామినీల జాబితాను కూడా ఐసీసీ ప్రకటిచింది.

ఇక వీరితో పాటు మహిళల విభాగంలో కూడా నామినీలను ప్రకటించింది ఐసీసీ. అయితే ఇందులో భారత ఆటగాళ్లకు చోటు దక్కలేదు. ఉమెన్స్ విభాగంలో డయానా బేగ్ (పాకిస్థాన్‌), షబ్నమ్ (సౌతాఫ్రికా) , మారిజానే కాప్ ( సౌతాఫ్రికా) ఈ అవార్డుకు నామినేట్ అయ్యారు. ఇందులో ప్లేయర్ ఆఫ్ ది మంత్ ఆవార్డు ఎవరిని వరిస్తోంది చూడాలి..

ప్లేయర్ ఆఫ్ ది మంత్ (మెన్స్ ,జనవరి) నామినీలు:

రిషబ్ పంత్ (భారత్‌), జో రూట్ (ఇంగ్లాండ్‌), పాల్ స్టిర్లింగ్ (ఐర్లాండ్‌)

ప్లేయర్ ఆఫ్ ది మంత్( విమెన్స్, జనవరి)నామినీలు:

డయానా బేగ్ (పాకిస్థాన్‌), షబ్నమ్‌ ఇస్మాయిల్ (సౌతాఫ్రికా), మారిజానే కాప్( సౌతాఫ్రికా)

ఇవి కూడా చదవండి : 

Pete Buttigieg : అమెరికా కేబినెట్‌లోకి తొలి ట్రాన్స్​జెండర్.. రవాణా మంత్రిగా పీట్ బుట్టిగీగ్.. Naadu Nedu Second Phase : మనబడి ‘నాడు- నేడు’పై సీఎం జగన్‌ సమీక్ష.. రెండో విడతకు సిద్ధం కావాలని అధికారులకు ఆదేశాలు..